Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

బంకించంద్ర ఛటర్జీ - bankin chandra chatarji in telugu

ఛటోపాధ్యాయ్   బ్రిటిష్ వారు పలకలేక ఛటర్జీ  అని పిలిచేవారు. బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచంకూడా ‘ ఛటర్జీ ’ అని పిలవడం ప్రారంభించింది. ...

ఛటోపాధ్యాయ్  బ్రిటిష్ వారు పలకలేక ఛటర్జీ అని పిలిచేవారు. బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచంకూడా ‘ఛటర్జీ’ అని పిలవడం ప్రారంభించింది. వీరు బెంగాలీ కవి, వ్యాస రచయిత మరియు సంపాదకుడు. వీరి రచన వందేమాతరం వీరికి మంచి పేరు తెచ్చి పెట్టింది. వీరు  వ్రాసిన ఆనంద్ మఠ్ అనే నవలనుండి ఈ గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది. బంకించంద్ర జీ జూన్ 27, 1838 లో జన్మించారు.
ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బంకించంద్ర చటర్జీ అగ్రగణ్యుడు. ఒక్క బెంగలీ సాహిత్యాన్నే కాక సమస్త భారతీయ సాహిత్యాలను ఆయన పంతొమిదో శతాబ్ది ఉత్తరార్దంలో,ఇరవయ్యో పూర్వార్దంలో అంటె సుమారు ఒక శతాబ్దం పాటు ప్రభావితం చెసాడు. పూర్వకలంలొ కాని, ఇటీవల కాలంలొ కాని ప్రపంచ సాహిత్య చరిత్రలొ జాతుల విముక్తి పోరాటాలలొ, స్వాతంత్ర్య సమర చరిత్రలొ ఒక మహా కవి రచించిన ధేశభక్తి గీతం తన జాతి జనులను ఉత్తేజపరిచి, ఉద్యమింపచేసిన సంఘటన,బంకించంద్రుడి విషయంలో లాగ మరొక దేశంలో, మరొక దేశ స్వతత్ర్యోద్యమంలొ సంభవించలేదు. బారతదేశ స్వతత్ర్యోద్యమం ఒక నిర్ణాయక ఫలసిద్ధి దిశగా చైతన్యవంతమవుతున్నప్పుడు వందేమాతరం గీతం దాని వేగాన్ని త్వరితం చెసింది వంగదేశంలో కొందరు సాహిత్య విమర్శకులు,ఆదునిక కాలంలో బకించంద్రుడి వంటి నవలా రచయిత ఇంకొకరు లేరంటారు.
      ఆయన సృష్టించిన పాత్రలు కాల్పనిక సాహిత్యనికి చెందినవే ఆయిన సృజనాత్మక సంవేదనలలో ఆయనకాయనే సాటి అని ఆ సాహిత్య విమర్శకుల అభిప్రాయం. ఆయన సాహిత్య ప్రతిభ బహు ముఖమైనది. నవలలు,వ్యాసరచన,సాహిత్య విమర్శ, వ్యాఖ్యానరచనలో బంకించంద్రచటర్జీ వంగ సాహిత్యంలో కొత్త వరవడి సృష్టించాడు. నవలా రచనలో తక్కిన ఆధునిక భారతీయ సాహిత్యాలకు కూడా ఆయనే దారిచూపాడు. అంతరాంతరాలలో ఆయనకు పురా భారతియ సంస్కృతి పట్ల, హిందూమతాచార విశ్వాసాల పట్ల అభిమానం ఉండేదని కొందరు సాహిత్యవేత్తల అభిప్రాయం. యూరొపు మేదావులు, సాహిత్యవేత్తలు భారతియ తత్త్వ చింతనను సరిగా అర్దం చేసుకోలేదని వారిపట్ల ఆయనకు ఒక అభియోగం ఉండేదని కొందరు బెంగాలీ సాహిత్య విమర్శకులు భావిస్తారు.
ఏమైనా బంకించంద్ర చటర్జీ(1838-1894), రబీంద్రనద్ ఠాగోర్(1861-1941), శరత్చంద్ర చటర్జీ(1876-1938) 20వ వంగ సాహిత్యాన్ని అత్యంత ప్రభావితం చేశారని అజిత్ కుమార్ అనే సాహితీవేత్త అభిప్రాయం. బంకించంద్ర చటర్జీ రచనలు ఉదాత్త ఆదర్శాలకు, రవీంధ్రుడి రచనలు కాల్పనిక సౌందర్య తాత్త్వికతకు, శరత్ రచనలు సమాజ వాస్తవికతకు దర్పణాలని ఆయన అంటారు. మానవుడు చేరుకోగల ఉదాత్త శిఖరాలను బంకించంద్రుడి పాత్రలు అధిరోహిస్తాయి. ఉదారాసయాలు, ఉజ్జ్వల భావాలు,ధీరోధాత్త సాహసం, ఫ్రణయం, శౄంగారం, ఆయన తన నవలలలొ చిత్రించాడు. అనూహ్యమైన, మానవాతీతమైన త్యాగాన్ని అయన పాత్రలు ప్రకటిస్తాయి.
బంకించంద్రుడిలొ మాతౄదేశాభిమానం ఆరాధన అఫూర్వం. ఆనందమఠం లొ ఆయన చిత్రించిన పాత్రలు ఎటువంటి త్యాగానికైన, సాహస్ ఆనికైన వెనిదీయని ప్రతీకలు. ఫురాభారతీయ వాజ్మయంలొ ధర్మప్రతిష్ఠాపన, నీతి, ఆధర్శమూ, సత్యమూ, అనుపాలించే పురాణ పాత్రలలాగ బంకించంద్రుడి కాల్పనిక, వీర శౄంగార, ఐతిహాసిక నవలల్లో ఆయన సౄష్టించిన పాత్రలు పాఠకులను సమ్మోహితులని చేసి ఆకర్షిస్తాయి. అట్లా అని ఆ పాత్రలు జీవ ఛైతన్యాన్ని, వాస్తవిక మూర్తిమత్వాన్ని విస్మరించవు. బహుశా అటువంటి పాత్రలను సృష్టించడానికి ఆయన ఎందుకు పూనుకున్నాడంటే ఆయన సమకాలీన సమాజంలో అటువంటి భావోద్విగ్నతలు కల రచనలే ఆయనకు కనపడలేదు కనుక. అటువంటి సృజనాత్మక చిత్రణ కూడా లేదు.
అందువల్ల ఆయన చారిత్రిక పాత్రలను, పూర్వ చారిత్రిక వైభవ సన్నివేశాలను, సౌందర్య భావకతను, భావకతా సౌందర్యాన్నీ ఆలంబనం చేసుకొని రచనలు చెశాడని కొందరు సాహితీవేత్తలంటారు. ఆయన స్త్రీ పాత్రలు సంప్రదాయ జీవిత శ్రుంఖలాల మధ్య నిరాశొపహతంగా జీవించవు. సాహసం, నిర్భీకత, ప్రణయోధ్వేగం, మానవానుభూతులు, స్రుంఖలవిఛ్ఛేధం, జీవన సహజాత ఉధ్రుతుల మధ్య అవి జీవిస్తాయి. అటువంటి స్త్రీ పాత్రలు పురుషులకేమాత్రం తీసిపోరు అని వంగ సాహిత్య విశ్లేషకులు, విమర్శకులు, బంకించంద్ర చతోపాధ్యయను ప్రసంసించారు. నవలా రచనలో ఆయన సృస్టించే సంగటనలు చదివేవారిని అమితమైన ఉత్కంఠకు లోను చెస్తాయి.
ఇతివృత్త నిర్వహణలో, సన్నివేస పరికల్పనలో ఆయన సృజనసక్తి, ఆయన ప్రజ్ఞ, ఆయన ప్రతిభ అసదృశమైనవి. ఆయన నవలలు చదువుతుంటే రమణీయ లోకాలలో సంచరిస్తున్న సాహిత్యానుభవం కలుగుతుంది పాఠకులకు. గంధర్వలోకాలలొ విహరింపచేస్తాయి ఆయన భావలు. అట్లా అని కేవలం కాల్పనిక జగత్తు అనుకోకూడదు ఆయన సాహిత్య స్రుష్తిని. ఆకాశంలొ మబ్బుల గుంపులోను, శతాభ్దాల కింద కట్టిన అతి విశాల గంభీరమైన కోటనొ, విశాల వినీల సముద్రతీరాన్నో చూసిన మానవుడికి ఏ ఊహాజగత్తు సాక్షాత్కారమవుతుందో బంకించంద్ర చట్టొపాధ్యాయ రచనలు, ముఖ్యంగా నవలలు అటువంటి మానసికోత్తేజాన్నీ కలగజెస్తాయి. రచనలు ఎలా ఉన్నప్పటికి వీరు భారతదేశ స్వాతంత్ర సమరశంఖానికి వందేమాతర గీతం ప్ర్రాణమయ్యింది. ఇప్పటికి వందేమాతర గీత స్పూర్తి కొనసాగుతుంది. వీరు అంతిమ శ్వాసను ఏప్రిల్ 8, 1894 న విడిచారు జై హింద్.
కొంత సమాచారం వికీపిడియా నుండి సేకరించడం జరిగింది. అభ్యంతరాలు ఉంటే వాటిని మాకు తెలియచేస్తే వాటిని వెంటనే తొలగించడం జరుగుతుంది.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..