Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

tribal history of india - భారతదేశ చరిత్ర అంటేనే గిరిజనుల చరిత్ర

ప్రపంచ మానవాళికి దిశాదర్శనంచేసిన భారతీయ సంస్కృతి అతిప్రాచీనమైనది.భారతదేశంలో ప్రకృతి మాత వడిలో జీవించిన ప్రజలు అన్ని రంగాల్లో రాణించారు...

ప్రపంచ మానవాళికి దిశాదర్శనంచేసిన భారతీయ సంస్కృతి అతిప్రాచీనమైనది.భారతదేశంలో ప్రకృతి మాత వడిలో జీవించిన ప్రజలు అన్ని రంగాల్లో రాణించారు. ప్రకృతిలో ఒక భాగంగా జీవించిన ఇక్కడి ప్రజలంతా ఒకానొకప్పుడు అందరూ వనవాసులే, గిరిజనులు అనవచ్చు. తర్వాత కాలంలో జనవదాలలో ఉండినవారు నెమ్మదిగా అడవుల ను నరికి గ్రామాలను నిర్మించుకుని గ్రామవాసులు గానూ, పట్టణాలను నిర్మించుకొని నగరవాసుల గానూ మారిపోయారు. ప్రకృతి మాత ను నమ్ముకొని అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్న వారు వనవాసులుగా పిలువ బడుతున్నారు. కనుక వనవాసి, గ్రామవాసులు, నగరవాసులు అంతా కలిస్తేనే భారతవాసి అవుతారు. అందరూ భరతమాత బిడ్డలే.

అనాదిగా ఇక్కడి ప్రజల స్వేచ్ఛా జీవులు. బయటివారి పెత్తనాన్ ని ఎప్పుడూ వీరు ఒప్పుకోలేదు. అందుకే గ్రీకు రాజు అలెగ్జాండర్ ను తిప్పి కొట్టడం లో పురుషోత్తముని సేన, రాణాప్రతాప సింహని సేనాపతి రాణాపూంజాభీల్ నాయకత్వంలో భిల్లులు, ఛత్రపతి శివాజీ ధర్మ రక్ష పోరాటంకై సహకరించిన వీరంతా గిరిజన వీరులు.
శ్రీ రాముడు నదిని దాటించిన నిషాద రాజు గుహుడు, సేతు నిర్మాణం చేసిన నలుడు, నీలుడు, అతి గొప్ప విలుకాడైన ఏకలవ్యుడు, ప్రాగ్జోతిషపురం (నేటి అస్సాం) రాజు భగదత్తుడు, ఆనాటి అస్సాం రాజు దేవివర్మ రాజ్యం రాజ్యపటంలో నేటి చైనాలోని సగభాగం వరకు వుంది. త్రిపుర రాజా దేవ వర్మ పై ఢాకా నవాబు దాడి చేస్తే, త్రిపుర సైనికులు కొండల్లో ఉండి గెరిల్లా యుద్ధం చేసి, నవాబు ప్రారద్రోలారు. అప్పటినుండి త్రిపుర స్వతంత్ర రాజ్యంగా వుంది. 1618 సం||లో త్రిపురలోని త్రిపురేశ్వరీ మందిరాన్ని లూటీ చేసి ధ్వంసం చేశారు. 3700 సం||ల క్రితం వన గిరిజనులు ఇనుమును నెల్ వీరుడు తయారు చేసినట్లు ఆధారాలున్నాయి.
చారిత్రక కాలం: ఉత్తర సరిహద్దుల్లో ఉన్న వనవాసులే శక, హూణ, గ్రీకు, ముస్లింల దురాక్రమణలు ది ఎదుర్కొన్నారు. తర్వాత జరిగిన అనేక స్వాతంత్ర్య పోరాటాల్లో వేలాది గిరిజన వీరులు బలి అయ్యారు. సోమనాథ్ మందిరం పై మొదట దాడి చేసిన గజని మహమ్మద్ ని ఎదురొడ్డిపోరాటం చేసిన బెగడాభీల్ బిల్లు తెగకిచెందిన గిరిజనుడు. బొందిలో ప్రాణం ఉన్నంతవరకు పోరాడుతానని ఆయన ప్రతిన బూనాడు.
నేటి రారండో ప్రాంతంలో రోహతాస్గఢ్ (హరిశ్చంద్రుని పుత్రుని లోహితాస్యుడు రాజ్యం) రక్షణలో ఉరావ్ తెగవారు ముందున్నారు. మహాకోసల్ వద్ద గోండ్వానా గఢమండల్ రాణి, రాజాదళపతిసింహ భార్య రాణి దుర్గావతి అక్బర్ సేనలతో పోరాడి కంటికి బాణం గుచ్చుకున్నందున వీరమరణం పొందింది.
రాణా ప్రతాప్ మొగలులు పోరాడే సమయంలో సేనాపతి బిల్లు వీరుడు రాణాపూరజాభీల్ యుద్ధంలో మరణిస్తే ఆయన కుమారుడు దుర్గాభీల్ ఒక చేయి తెగిపోయిన తన అనుచరులతో కలిసి రాణాప్రతాపీను 14 సం||లు అడవుల్లో దాచి రక్షించాడు. చివరి హల్దీఘాట్ యుద్ధం లో రాణా యొక్క గుర్రం చేతక్ కాలుకు గాయం అయ్యింది. ఆ సమయంలో ముగ్గురు బిల్లు సహాయంతో రాణా తప్పించు కోగలిగాడు.
1677 అక్టోబర్లో శివాజీ మహారాజ్ 10రోజులు శ్రీశైలం లో ఉన్నాడు. అక్కడి నుండి నంద్యాల, కడప, తిరుపతి మీదుగా శివాజీని సురక్షితంగా తమిళనాడులోని జింజికోటకు చేర్చిన చెంచు వీరులు చెన్నమల్లు, నడిపిమల్లు, పెద్దమల్లులు.
1878 లో బీహార్లో బాగల్పూర్ వద్ద ఆంగ్లేయుల వ్యతిరేకంగా ముక్తి ఆందోళన జరిగితే 388 మంది సంతాల్లు అసువులుబాశారు. వీర తిలకామాంజీ అనే గిరిజనుడు కలెక్టర్ అగస్తీస్ క్లీవేను బాణంతో కొట్టిచంపాడు. ఆంగ్లేయుల ధనాగారం కొల్లగొట్టి బీదలకు పంచేశాడు. అతన్ని నాలుగు గుర్రాలకు కట్టి భాగల్పూర్ వీధుల్లో ఈడ్చుకువెళ్ళి, చెట్టుకు కట్టి, మేకులుకొట్టి అతి క్రూరంగా చంపారు ఆంగ్లేయులు.
ఝార్కాండ్ లోని అలీపోత్ అనే గ్రామంలో బిర్సా ముండా ను పిలకకోసి, జంధ్యం తీసినందుకు ఆంగ్లేయుల పైన, మిషనరీల పైన పెద్ద తిరుగుబాటు జరిగింది. ఒరిస్సాలోని కందమాల్ జిల్లా చక్రబిసోయి, మహారాష్ట్రలో భీమా నాయక్, కర్ణాటకలో వెంకటప్పయ్య నాయక్, కేరళలో తలక్కల్ చందు వీరంతా స్వతంత్ర పోరాటాల్లో అగ్ర గామిగా నిలిచిన గిరిజన వీరులు.
తెలుగు రాష్ట్రాల్లో ఇటు నిజాం నిరంకుశ పాలన తో, అటు ఆంగ్లేయుల కుటిల పాలన తో పోరాడిన గిరిజన వీరులు నిర్మల్ రాజ్, రాంజీ గోండ్, ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్ వీరుడు కొమురం భీమ్, విశాఖ గోదావరి జిల్లాలో అల్లూరి సీతారామరాజు తో కలసి కోయలకు నాయకత్వం వహించిన గంటం దొర, మల్లుదొర లు ఉన్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో నాగాలాండ్ లో జాదోనాంగ్, రాణి మా గైడిన్ల్యూ, మేఘాలయాలో సాంగ్స్ ఖాసీ నేత తీరతోసింహ్, అరుణాచల్ లో తాలిమ్ రకాలు ముఖ్యులు. 500 సం||లో నిరంతర విదేశీ ఆక్రమణలు, అత్యాచారాలు కారణంగా ఈశాన్య ప్రజలు కొందరు మతం మారారు. కానీ తమ అస్తిత్వానికి, సంస్కృతికి దెబ్బతగులుతుందని గుర్తించాక స్వధర్మానికి తిరిగి వచ్చారు. ఇలా భారతదేశ చరిత్ర అంటేనే గిరిజనుల సంఘర్ష చరిత్ర. - శ్రి కె రామచంద్రయ్య గారు

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


No comments