Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అస్సాం మహావీరుడు లాచిత్ బడఫుకన్ - lachit borphukan biography in telugu

లాచిత్ బడఫుకన్: అస్సాం యువకుల నరనరాల్లో స్ఫూర్తిని చైతన్యాన్ని పరుగులు తీయించిన మహావీరుడు లాచిత్. విధి నిర్వహణలో, దేశరక్షణలో బాధ్యతార...


లాచిత్ బడఫుకన్: అస్సాం యువకుల నరనరాల్లో స్ఫూర్తిని చైతన్యాన్ని పరుగులు తీయించిన మహావీరుడు లాచిత్. విధి నిర్వహణలో, దేశరక్షణలో బాధ్యతారహితంగా ప్రవర్తించిన పినతండ్రి తల నరికి రక్తసంబంధం కంటే దేశమే మిన్నయైనదని చాటిచెప్పిన అపర దేశభక్తుడు.
అస్సాంను తన అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించిన మొగలుసేనల గుండెల్లో నిద్రపోయిన హైందవసింహం. సమరుడైన ధైర్యసాహసాలు కలిగిన సైన్యాధిపతి వీధర్మీయులైన మొగలాయిలను అస్సాంలో అడుగు మోప నీయకుండా కొన ఊపిరి ఉన్నంతవరకు మాతృభూమి రక్షణకై పోరాడి అమరుడైన ధన్యజీవి.ఆదర్శపురుషుడు లాచిత్ బడఫుకన్.
క్రీ.శ. 17వ శతాబ్దికాలమువాడు బడఫుకన్. ఇతడు మోమయితాములీకి పెంపుడు కొడుకు. తేయాకు తోటల్లో దొరికిన పసిగుడ్డు. అస్సామీ భాషలో ల అంటే రక్తము చిత్ అంటే తడిసిన అని అర్ధం. ఇది కలిసొచ్చేలా లచిత్ అని నామకరణం చేశాడు. బలం ఇతని ఆస్తి. వీరత్వం ఇతనికి ఆభరణం. అస్సాంలోని అహోంరాజు పెట్టిన పరీక్షలో నెగ్గి సేనాపతి అయ్యాడు.
లాచిత్ ఆత్మాభిమానాన్ని ప్రాణం కంటే మిన్నగా కాపాడుకునేవాడు. లాచిత్ గువాహతికి ప్రధాన సేనాపతి అయ్యాడు. అస్సామీ భాషలో బడఫుకన్ అంటే సేనాపతి అని అర్థం. ఆనాటినుండి ఆ వీరుడు లాచిత్ బడపుకన్గా ప్రసిద్ధి చెందాడు. మొగలులను దేశం నుండి బయటకు గెంటేస్తానని లాచిత్ అహోంరాజుకు మాట ఇచ్చి శత్రువులతో తలపడ్డాడు.
లాచిత్ బ్రహ్మపుత్రా నదిలో నావికా సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. మొగలుల అధీనంలో ఉన్న చిన్నచిన్న రాజ్యాలను జయించుకుంటూ ముందుకు సాగాడు, బడపుకన్ ధాటికి తట్టుకోలేక ఇట్ ఖులీ కోటలోని మొగలు సైన్యం చెల్లాచెదురైంది. లాచిత్ ఫకీర్ల వేషములో తన గూఢచారులను శత్రువుల శిబిరాల్లోకి పంపేవాడు. అర్ధరాత్రి సమయంలో అరటి బోదెల్లో దీపాలు వెలిగించి నదిలోకి వదిలి శత్రువులను భయపెట్టేవాడు. సైనిక శిబిరాల్లో వేలసంఖ్యలో చిన్న చిన్న నెగళ్లను వేసి సైనికసంఖ్య అత్యధికంగా ఉందనే భ్రమ కలిగించి శత్రువులను ముందు మానసికంగా, తరువాత శారీరకంగా దెబ్బతీసే యుద్ధచాతుర్యాన్ని ప్రదర్శించేవాడు.
1674 విజయదశమి రోజున లాచిత్ యుద్ధం చేస్తున్న యుద్ధనౌక సరిగా లేకపోయినప్పటికీ వీరోచితంగానే పోరాడి రామసింహ నాయకత్వంలో వచ్చిన మొగలు సైన్యాన్ని తరిమిగొట్టాడు. అయితే లాచిత్ విజయకేతన మగరేసి గుండెల నిండా ఊపిరి పీల్చుకుని అంతిమశ్వాస విడిచి వీరస్వర్గమలంక రించాడు. లాచిత్ బడపుకన్ వీరత్వాన్ని, ధైర్య సాహసాలను, యుద్ధకళను, దేశభక్తి నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటుంటారు అహోం ప్రజలు.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

No comments