Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

జాతీయ కవి గుర్రం జాషువా - about gurram jashuva in telugu

జాతీయ కవి గుర్రం జాషువా ఆంధ్రప్రదేశ్లో జన్మించిన సాహితీవేత్తల్లో ధ్రువతార గుర్రం జాషువా. జాషువా తండ్రి గుర్రం వీరయ్య గొల్ల కులస్థుడ...


జాతీయ కవి గుర్రం జాషువా

ఆంధ్రప్రదేశ్లో జన్మించిన సాహితీవేత్తల్లో ధ్రువతార గుర్రం జాషువా. జాషువా తండ్రి గుర్రం వీరయ్య గొల్ల కులస్థుడు. తల్లి లింగమాంబ మాదిగ కులస్తురాలు. జాషువా 28 సెప్టెంబరు 1895న జన్మించారు. ఆయన జన్మించిందీ పెరిగిందీ గుంటూరు జిల్లా వినుకొండలో. అతని చిన్నప్పటి నుండి తోటి పిల్లలు నన్ను తాకవద్దు- నీవు అస్పృశ్యడవంటూ అవమాన పరిచారు. వారు అనుభవించిన దారిద్ర్యానికి రెండు ఉదాహరణలు. నేను బాపట్ల ట్రైనింగ్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒకసారి సెలవులకు ఇంటికి రావాలనుకున్నాను. నా వద్ద ఛార్టీకి డబ్బులేదు, ఎవరినైనా అడగటానికి అభిమానం అడ్డువచ్చింది.
అంతేకాక అప్పు తీర్చగలనన్న ఆశ లేదు. అంచేత నాకున్న రెండు జతల బట్టలు, నా సత్తు కంచం, గ్లాసు, అద్దం దువ్వెన ఒకచెక్క పెట్టెలో పెట్టుకొని దానిని మోసుకుంటూ బాపట్ల నుండి వినుకొండకు నడిచి రావాలని నిశ్చయించుకున్నాను. నాతోపాటు మరో నలుగురు పేద విద్యార్థులు కూడా బయలుదేరారు. త్రోవలో మజిలీలు చేసి నర్సరావుపేట చేరేటప్పటికి నా కాళ్ళువాచి అడుగు వేయనీయలేదు.నా దురవస్థ చూచిన స్నేహితులు జాలిపడి తమవద్ద గల కొద్ది చిల్లర డబ్బులు పోగుచేసి వినుకొండకు టిక్కెట్టు కొని నన్ను బండిలో ఎత్తి కూర్చోబెట్టారు" అంటూ తన అనుభవాన్ని ఒకసారి చెప్పారు.
ఉద్యోగంగా రాజమండ్రి వద్ద ఒక టూరింగ్ టాకీస్లో మూకీ సినిమాలకు కథ వాచకుడిగా చేరాడు. రెండు పూటలా భోజనం మాత్రం లభించేది. జీతం మాత్రం ఏమీలేదు. ఒకే పంచ, ఒకే చొక్కాతో మూడు మాసాలు గడిపారు. రాత్రి రెండవ ఆట తరువాత గోదావరికి పోయి స్నానం చేసి, చొక్కా పంచే ఉతికి ఆరబెట్టి వేసుకొని వచ్చేవారు. జాషువా వ్యధిత హృదయం నుండి కవిత్వం పెల్లుబికింది. భావప్రకటనకు అవసరం అయిన తగిన భాష లేదు.
అందుకై పురాణ ఇతిహాసాలను చదువ సాగారు. దానితో క్రైస్తవులు ఉగ్రులయ్యారు. మాదిగ కులస్థుడు అయి ఉండి శాస్త్రాలు చదవటమా? అంటూ హిందువులు ప్రశ్నించారు. జాషువా కవిత్వంలో హిందూమతాన్ని ప్రచారం చేసే అంశాలు ఉండడంతో క్రైస్తవ బోధకులు జాషువా చేస్తున్న టీచరు ఉద్యోగం నుండి డిసిమిస్ చేశారు.
1919లో చదువు పూర్తిచేసుకొని 24సం||లు ఉపాధ్యాయునిగా గుంటూరులో పని చేసాడు. కొన్నాళ్ళు రేడియో ప్రొడ్యూసర్ గా పనిచేశాడు. ఆయన పిరదౌసి, గబ్బిలము, స్వప్నకథ, కాందిశీకుడు, ముంతాజ్ మహల్, నేతాజీ, స్వయంవరము, సాకథ రచించాడు. మీ జీవితంలో మరపురాని ఆనందకరమైన సంఘటన ఏమిటని ప్రశ్నిస్తే, తిరుపతి వెంకటకవులు వంటి పెద్దలు స్వయంగా నాకు గుండపెండేరం తొడిగి, ఏనుగుపై ఎక్కించి, కనకాభిషేకం చేయడం"అని ఆనంద బాష్పాలతో అన్నారు. 1926లో శివాజీ ప్రబంధము అన్న చారిత్రక కావ్యంలో భారతమాతను ఎంతో రమ్యంగా స్తుతించాడు.

సగరమాంధాత్రాది షట్చక్రవర్తులు - అంకసీమల నిల్చినట్టి సాధ్వి
కమలనాభుని వేణుగాన సుధాంబుధి - మునిగి తేలిన పరిపూతదేహ
కాళిదాసాది సత్కవికుమారులగాంచి - కీర్తినొందిన పెద్దగేస్తురాలు
బుద్దాది మునిజనంబుల తపంబున మోద - బాష్పముల్ విడిచిన భక్తురాలు
సింధు గంగానదీ జల క్షీరమెపుడు - కురిసి బిద్దల పోషించుకొనుచుచున్న
పచ్చి బాలెంతరాలు, మా భరత మాత, - మాతలకు మాత, సకల సంపత్ సమేత

నిజానికి కొనసాగుతున్న సామాజిక వివక్షకు మనలను మనమే ప్రశ్నించుకోవాలి! 24 జూలై 1971న జాషువా తనువు చాలించారు.

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..