Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భారత జాతిని ఏకజాతిగా నడిపించడానికి శ్రమించిన భీమన్న కవి - boyi bhimanna biography in telugu

భారత జాతిని ఏకజాతిగా నడిపించడానికి శ్రమించిన భీమన్న కవి చాలా విషయాల్లో ఆయనది చెరపడానికి అసాధ్యమైన రికార్డు. బాల్యంలో పన్నెండేళ్ల వయ...


భారత జాతిని ఏకజాతిగా నడిపించడానికి శ్రమించిన భీమన్న కవి

చాలా విషయాల్లో ఆయనది చెరపడానికి అసాధ్యమైన రికార్డు. బాల్యంలో పన్నెండేళ్ల వయస్సులోనే మృదు మధురమైన పద్య కవిత వ్రాశాడు. శతాధిక గ్రంథాలను రచించి ప్రచురించాడు. కార్తీ, ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల నుండి కళాప్రపూర్ణ గౌరవాన్ని, గౌరవ డాక్టరేట్ పట్టాలను అందుకొన్నాడు. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకొన్నాడు, 95 సంవత్సరాలు జీవించటం కాదు విశేషం, చివరిరోజు వరకు కవిత్వం చెపుతూనే ఉన్నాడు. గ్రంథాలు వెలువరిస్తూనే ఉన్నాడు. ఆయన వ్రాసిన చివరి గ్రంథం శ్రీశ్రీ కమ్యూనిస్టు కాడు అన్న గ్రంథం ఆయన మరణానంతరం వెలువడింది.
1911 సెప్టెంబరు 19న తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో పుల్లయ్య, నాగమ్మ దంపతులకు జన్మించిన భీమన్న కాకినాడలో కళాశాల విద్య పూర్తి చేశాడు. 1937 నుండి ప్రముఖ హరిజన నాయకులు కుసుమ ధర్మన్నగారీ పత్రిక జయభేరిలో సహాయ సంపాదకులుగా పనిచేశాడు. 1953లో గుంటూరు జిల్లా చెరుకుమిల్లి గ్రామప్రజలు ఆయనకు గండపెండేరం తొడిగి సన్మానించారు. మతమార్పిడి వంటి సమస్యలపై ఆయన చాలా దృఢంగా, బలంగా స్పందించాడు. 1980లో వెలువడిన జన్మాంతర వైరం గ్రంథంలో వారు చర్చించిన ఈ విషయాలు గమనించదగ్గవి, నేను హిందువుగా పుట్టాను, మతం మార్చవలసిన అవసరంలేదు. పెనంలో నుండి పొయ్యిలోకి దూకటం దేనికి? అన్నాడు.
ఈ హిందూమత మూలపురుషులు ఈ భారత సంస్కృతీ మూలఋషులు నావాళ్ళు, నా హరిజనులు అని నేను విశ్వసిస్తున్నప్పుడు, నా వారసత్వపు హక్కుల్ని ఏదోవిధంగా తిరిగి సంపాదిస్తానేగాని, పారిపోవడమనేది ఎందుకుంటుంది? మెజారిటీ జనం వాణ్ణి మైనారిటీగా ఎందుకు మారతాను?నేను కనుక సిసలైన మనిషినైతే, నేనే కనుక నిజాయితీ కల మాల మాదిగవాళ్లయితే, నేనే కనుక ధర్మవ్యాధ, మాతంగ, వాల్మీకి, వ్యాస మహాపురుషుల వారసుణ్ణయితే, నేనే కనుక నా కులాన్ని దాస్యంనుంచి విమోచన కలిగించడం అనే ధర్మానికి కట్టుబడిన వాజ్ఞయితే, నేనే కనుక ఆర్ష భారతజాతి సమగ్ర సంఘటిత శ్రేయస్సును కోరినవాజ్ఞయితే- నేను నా సమస్త పదవీ విద్యాప్రతిష్ణా గర్వాలనన్నింటినీ పీకిపారేసి, ఈ నా గ్రామీణ హరిజన గుడిసెవాసులతో వుండిపోవాలి.
వాళ్లతోనే ఉంటూ వాళ్ల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ, ఒక్కొక్క అడుగే వాళ్లను ముందుకు నడిపించాలి. తరతరాల దాస్యంతో, దారిద్ర్యంతో సగం చచ్చిపోయి వున్న వాళ్లను మానసికంగా ఓదార్చాలి. బ్రెయిన్ వాష్ చేయబడినవారి మెదళ్లకు తిరిగి స్వాస్థ్యం కలిగించాలి. ఈ మధ్య హిందూ మతాధిపతులు కూడా ఇదే ధోరణిలో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇది చాలా హర్షించదగిన హృదయ పరివర్తన.
ఆదిలో ప్రపంచ మానవులందరూ హిందువులేనని, రకరకాల కారణాలవల్ల ఇతర మతాలు ఏర్పడుతూ వచ్చాయని కంచి కామకోటి పీఠాధిపతి అన్నట్లు పత్రికలలో చదివాం. అలా ఇతర మతాలలోకి పోయినవారు తిరిగివస్తే, వారికి హిందూమతం హృదయపూర్వకంగా స్వాగతం ఇస్తుంది అని కూడా వారన్నారు. ఇది మరీ హర్షదాయకం. అయితే దుష్టహేతువులు ఆనాడు (ఈనాటికి కూడా) హిందువులను ఇతర మతాలలోకి తరిమి వేశాయో (తరిమి వేస్తున్నాయో) ఆదుష్టహేతువులు ఈనాడు తొలగిపోయాయా? అనేది నా మరో ప్రశ్న కృణ్వంతో విశ్వమార్యం (ప్రపంచంలోని మానవులందర్ని ఆర్యులుగా మార్చండి) అని ఉద్బోధించిన ఋగ్వేదం నాటి సర్వజన సమతా సామాజిక వ్యవస్థ ఈనాటి హిందూ సమాజంలో ఉన్నదా? హైందవేతరుడెవడైనా హిందూమతంలోకి (తిరిగి) రావాలంటే ఎలా రాగలుగుతాడు? ఏ కులంలోకి రాగలుగుతాడు?2005 డిసెంబర్ 16న తన 95వ ఏట తనువు చాలించిన బోయిభీమన్న చిరస్మరణీయుడు.

No comments