పద్మశ్రీ నరసమ్మ జీవితం - padma shri sulagitti narasamma life

0

నరసమ్మ ముద్దులొలికే చిన్నారులను ఈ లోకంలోకి తీసుకరావడమే సేవగా భావిస్తూ ఉచితంగా పురుళ్ళుపోసి 15 వేల మందికి పైగా పసి పాపల జననానికి సహకరించిన మహిళామణిని ఏమని పొగడగలం? ప్రస్తుతం 97 ఏళ్ళ ముదుసలి అయిన నరసమ్మ గత 70 సంవత్సరాలుగా చేస్తున్నది ఇదే. ఒక్క పైసా తీసుకోకుండా తల్లులకు అత్యంత విలువైన కానుకలను వారికి నవశిశు వులను అందజేస్తూ వచ్చింది.
కర్ణాటక రాష్ట్రంలో తుముకూరు వంటి చిన్న జిల్లాలో కనీసం ఆసుపత్రుల పేరైనా వినబడని రోజుల్లో ఆమె ఈ సేవావ్రతం ప్రారంభించింది. మొదటి బిడ్డకు పురుడు పోసినప్పుడు ఆమె వయస్సు రెండు పదులే. నాటినుంచి వేలాదిమంది తల్లులకు నిస్వార్థంగా తోడ్పడుతున్నది. ఆమె దగ్గర పనిచేసి అనుభవం సంపాదించుకున్న దాదాపు 180 మంది శిష్యురాళ్ళు ఈనాడు ఆమె పనిని కొనసాగిస్తున్నారు.
వైద్య సదుపాయాలు లేనిచోట ప్రజానీకానికి సేవలు అందిస్తున్నం దుకుగాను ఆమెకు పద్మశ్రీ సత్కారం లభించింది. నిజానికి ఆమె ప్రజలకు ఒక విలువైన పెన్నిధి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top