Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

శ్రీరామానుజుడు (క్రీ.శ.1017-1137) - sri ramanujacharya biography in telugu

శ్రీరామానుజుడు (క్రీ.శ.1017-1137) రామానుజుడు తమిళనాడులో శ్రీపెరంబుదూరులో జన్మించాడు. జన్మించింది బ్రాహ్మణ కులంలోనైనా నిమ్నవర్గాల ప్...


శ్రీరామానుజుడు (క్రీ.శ.1017-1137)

రామానుజుడు తమిళనాడులో శ్రీపెరంబుదూరులో జన్మించాడు. జన్మించింది బ్రాహ్మణ కులంలోనైనా నిమ్నవర్గాల ప్రజల స్థితిపట్ల ఎంతో ఆవేదన చెందాడు. బ్రాహ్మణుల నుండి అస్పృశ్యుల వరకు గల అన్ని వర్గాల ప్రజలకు ఆచరణ యోగ్యమైన సర్వోచ్చమైన ఆధ్యాత్మిక ఉపాసనా పద్ధతులను సృష్టించాడు.
రామానుజుని గురువులు ఐదుగురు. నిమ్నవర్గీయుడైన మహాపూర్ణుడు అనే గురువు నుండి వేదాలను, నాలియర ప్రబంధాన్ని (తమిళ వేదాన్ని) అధ్యయనం చేసి వారి వద్దే 'వైష్ణవ దీక్షను స్వీకరించాడు. శూద్రుడైన తిరుక్కోటియార్ నంబి (గోష్టిపూర్ణుడు)ని రెండవ గురువుగా స్వీకరించి వారిని సేవించాడు. తనగురువు నుండి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రదీక్షను పొంది, తాను ఒక్కడే ముక్తిని పొందడం కాక, ప్రజలందరూ ముక్తిని పొందాలన్న కోరికతో శ్రీరామానుజుడు గుడి గోపురాన్నెక్కి గ్రామప్రజలందర్నీ పిలిచి వారందరికీ బిగ్గరగా సామూహికంగా అష్టాక్షరి మంత్రోపదేశాన్ని చేసాడు. ఈ పని చేసినందుకు తనకు నరకం ప్రాప్తమైనా సరేనని తయారయ్యాడు. తన 23వ ఏటనే సన్యాసదీక్షను స్వీకరించాడు.
దేశమంతా విస్తృతంగా పర్యటించి అనేక చోట్ల మఠాలను స్థాపించాడు.రామానుజుడు కర్ణాటకలోని 'మేలుకోట'ను తన కేంద్రంగా చేసుకున్నాడు. అన్ని వర్గాలకు చెందిన వారిని తన శిష్యులుగా స్వీకరించాడు. ఆనాటి నుండి నేటివరకు అక్కడ రథయాత్రను ముందులాగే అవకాశం నిమ్నవర్గాల వారికే కల్పించబడింది. 1099లోనే అక్కడ తిరునారాయణ పెరుమాళ్ళు వైష్ణవ మందిరంలో పంచములకు ప్రవేశార్హత కల్పించాడు. అనేక మందిరాలలోనిమ్నవర్గాల వారికి ప్రవేశం కల్పించి వైష్ణవావలంబులుగా చేసాడు.మేలకోటలోని సుందరమైన విగ్రహాన్ని ఒక ముస్లిం పాలకుడు ఢిల్లీకి ఎత్తుకుపోగా రామానుజుడు ఢిల్లీ వెళ్లి ఆ ముస్లిం నవాబునుండి తిరిగి విగ్రహాన్ని వెనక్కి తీసుకువచ్చాడు.
ముస్లిం కుమార్తె బీబీ నాంచియార్ ఆ సుందరమైన విష్ణువు విగ్రహాన్ని సేవిస్తూ భక్తురాలైంది. ఆమె కూడా మేలుకోట వచ్చిచేరింది. ఆమెలోని భక్తిని గుర్తించి ఆమెకు దేవాలయ ప్రవేశార్హత కల్పించాడు రామానుజుడు. ఆమె భక్తి పారవశ్యంతో నృత్యంచేస్తూ, ఆ దేవాలయంలోనే మిగిలిన జీవితమంతా గడిపింది. ఆమె తనువు చాలించిన తర్వాత బీబీ నాంచారమ్మ విగ్రహాన్ని ఆ దేవాలయంలోనే ప్రతిష్టించాడు రామానుజుడు. సామాజిక సమరసతకు ఇది ఎంత మంచి ఉదాహరణ.
రామానుజుడు అనేక దేవాలయాలను నిర్మించి, ఆ దేవాలయాలలో అన్ని వర్గాల ప్రజలు ప్రధానంగా నిమ్నవర్గాల ప్రజలు దేవుని సేవించే విధంగా నూతన వ్యవస్థలను, పద్దతులను, ప్రారంభించాడు. రామానుజుని ప్రయత్నాలవల్ల వేదాలు, ఇతర ధార్మిక గ్రంథాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. అన్నివర్గాల ప్రజలను శిష్యులుగా స్వీకరించాడు. అస్పృశ్యుల ఇండ్లలో భిక్షను స్వీకరించాడు. వార్ధక్యంలో నదీస్నానం చేసుకుని పంచముల భుజంపై చేయివేసుకుని వారి సహకారంతో తిరిగి వచ్చేవాడు.
అగ్రవర్గాలవారు దీనిపట్ల అభ్యంతరం చెప్పగా, న జాతికి కారణం లోకే గుణాః కళ్యాణ హేతవః లోకకళ్యాణానికి కులం కారణం కారాదు, గుణము ప్రధానమైనది. అని సమాధానమిచ్చాడు. 'రామానందుడు' వంటి అనేకమంది శిష్యులను తయారుచేసాడు. కాలానుణమైన మార్పులను చేస్తూ నిమ్నవర్గాల ప్రజలలో వైష్ణవ వ్యాప్తికి విశేషంగా కృషి చేసి (మాల దాసరుల వ్యవస్థ) ఏర్పరచి, తన 120వ ఏట సమాధిని పొందాడు. 2016కి వారు జన్మించి 1000 సంవత్సరములు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments