1893లో చికాగో వేదికగా జరిగిన సర్మమత సమ్మేళనానికి తొలిసారిగా హాజరైన స్వామి వివేకానందుడు ఒక్క మాటతోనే ప్రపంచాన్ని భారతవైపు తిప్పుకునేలా చేశారు.
చికాగోలో సర్వమత సమ్మేళనం 1893, సెప్టెంబరు 11న ప్రారంభమైంది. ఈ మహాసభకు వివిధ దేశాలకు చెందిన వేలాది మంది ప్రతినిధులు హజరయ్యారు. వీరందరిలో కెల్లా భారత్ తరఫున పాల్గొన్న స్వామి వివేకానంద పిన్న వయస్కుడు. ఈ సమ్మేళనానికి హాజరైన వారంత తమ ప్రసంగ పాఠాలను ముందుగానే తయారు చేసుకున్నారు. అయితే స్వామిజీ దగ్గర అలాంటిదేమి లేదు. అందుకే తన ప్రసంగాన్ని చివరలో ఉంచమని సభాధ్యక్షుడికి విఙ్ఞప్తి చేశారు. అయితే వివేకానందుడు దాదాపు రెండు నెల ముందే అమెరికా చేరుకున్నారు. అమెరికా సోదర సోదరీ మణులారా.. అని స్వామీ వివేకానంద తన ప్రసంగాన్ని ప్రారంభించగానే దాదాపు మూడు నిమిషాల పాటు కరతాల ధ్వనులతో ప్రాంగణం దద్దరిల్లింది. వివేకానందుడి ప్రేమ పూర్వక పిలుపునకు సభికులు దాసోహం అన్నారు. అప్పుడు స్వామి వివేకానంద మాట్లాడిన ఉపన్యాస భావము ఈ విధంగా ఉంది.
అమెరికన్ సోదర, సోదరీమణులారా,
మాకు మీరొసగిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో ముచ్చటించటo నాకు మహదానందదాయకo. ప్రపంచంలో ప్రాచీన యతి సాంప్రదాయo పేర మీకు నా అభివాదాలు. సమస్త మతాలకూ సమస్త ధర్మాలకూ తల్లిఅనదగ్గ సనాతనధర్మం పేర మీకు నా అభివాదాలు. నానా జాతులతో, నానా సాంప్రదాయలతో కూడిన భారత జన సహస్రాల పేర మీకు నా అభివాదాలు.
సహనభావాన్ని వివిధదేశస్తులకు తెలిపిన ఘనత గౌరవమూ సుదూర దేశస్తులైన ప్రాచ్యులకు చెందటం ఎంతో సమంజసమని తత్ప్రతినిధులను గురించి ఈ సభావేదికనుంచి తెలిపిన వక్తలకూ నా అభివాదాలు. సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతనధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. సర్వమత సహనాన్నే కాక, సర్వమతాలు సత్యాలనే మేము విశ్వశిస్తాo. సమస్త మత సమస్తదేశాలనుంచీ పరపీడితులై, శరణాగతులై వచ్చినవారికి శరణ్యమైన దేశం నా దేశమని గర్విస్తున్నాను. రోమన్ ల నిరంకుశత్వానికి గురై తమ దేవాలయం తుత్తునీయులైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణుపొందిన యూదులను నిజమైన యూదులనదగ్గవారిలో మిగిలిన వారిని మా కౌగిట చేర్చుకున్నామని తెలుపటానికి గర్విస్తున్నాను. మహాజోరాష్ఠ్రీయ సంఘంలో శౌషించినవారికి శరణు ఒసగి నేటికీ వారిని ఆదరిస్తున్న సనాతనధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. సోదరులారా అతి బాల్యం నుంచీ పారాయణ చేస్తూన్నట్లు నాకు జ్ఞాపకంవున్న ఒక స్తోత్రం నుంచి, ప్రతి రోజు కోట్లాది మానవులచే పారాయణ గావించబడే ఒక స్తోత్రం నుంచి కొన్ని చరణాలను ఉదాహరిస్తాను. "వివిధ ప్రదేశాలలో జన్మించిన నదులు సముద్రం లో సంగమించేట్లే వివిధ భావాలున్న మనుషులు అవలంబించే వివిధ ఆరాధనామార్గాలు వక్రాలై కనబడినా, అవక్రాలై కనబడినా సర్వేశ్వరా నిన్నే చేరుతున్నవి".
"ఎవరు నన్ను ఏ రూపంలో నన్ను గ్రహిస్తారో నేను వారినలాగే అనుగ్రహిస్తున్నాను. ఎల్లరూ సమస్త మార్గాలచేతనూ తుదకు నన్నే చేరుతున్నారు." అని గీతలో తెలుపబడ్డ అద్బుత సిద్దాంతాన్ని ప్రపంచంలో ఇంతవరకు జరిగిన మహోత్కృష్టసమావేశాల్లో ఒకటైన ఈ మతమహాసబే సమర్ధిస్తూ ముక్తకంఠంతో లోకానికి చాటుతోందని చెప్పనొప్పతుంది. శాకాభిమానo స్వమత దురభిమానo దానివల్ల జనించిన మూర్ఖాభినివేశము సుందరమైన ఈ జగత్తును చిరకాలంగా ఆక్రమించివున్నవి భూమిని అవిదౌర్జన్యమయo గావించి, అనేక పర్యాయాలు మానవ రక్తసిక్తము చేశాయి. ఈ ఘోర రాక్షసులు చెలరేగి వుండకుంటే , మానవ సమాజం నేటికంటే విశేషాభివృద్ది పొందివుండేది. కాని వాటి అవసాన సమయం ఆసన్నమైంది. ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మోగించబడిన గంట సర్వవిదాలైన స్వమత ధురభిమానానికి పరమత ద్వేషానికి కత్తితో గానివ్వండి, కలంతో గానివ్వండి సాగించబడే నానా విధాలైన హింసకు మాత్రమేకాక, ఒక్క గమ్యాన్నే ప్రాపించబోయే జనం కొందరిలోని నిష్టూర ద్వేషభావాలకు శాంతి పాఠo కాగలదని నేను మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.
కాబట్టి అప్పటి ఉపన్యాసం భారతదేశ యువకుల్లో ఉత్తేజం నింపి దేశ స్వాతంత్ర్య ఉద్యమం లో ఎంతో ఉపయోగపడింది. వారు మాట్లాడి 125 సంవత్సరాలు అయిన సందర్భంగా వివేకానంద కేంద్ర కన్యాకుమారి వారి ఆద్వర్యంలో మన హైదరాబాద్ లో స్వామి వివేకానంద మాస్క్ మరియు టోపీలు ధరించి ఒక మంచి సెల్ఫి దిగుతున్నారు యువత. ఈ అంశాము సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మరి మీరు దిగండి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయండి.
-రాజశేఖర్ నన్నపనేని.
0 Comments
Thank You