Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

జీపుతో ట్యాంకుల్ని ఢీకొన్న హవల్దార్ అబ్దుల్ హమీద్

భారత భూభాగం అయిన ఖేమ్కరణ్ పై 1965లో భారీ ట్యాంక్లతో దాడి చేసింది పాకిస్తాన్. ఆ ట్యాంకులను ఎదుర్కోవాలంటే భారత్ ట్యాంకులు వచ్చే దాకా ఆ ...



భారత భూభాగం అయిన ఖేమ్కరణ్ పై 1965లో భారీ ట్యాంక్లతో దాడి చేసింది పాకిస్తాన్. ఆ ట్యాంకులను ఎదుర్కోవాలంటే భారత్ ట్యాంకులు వచ్చే దాకా ఆ పోస్ట్ ను కాపాడుకోవాలి. ఏం చేయాలి ? ఆలోచిస్తున్న అధికారుల మదిలో వెనువెంటనే అబ్దుల్ హమీద్ నైపుణ్యం కదలాడింది.

ఉత్తరప్రదేశ్ గజిపూర్ జిల్లాలోని ధాముపూర్ గ్రామంలో ఉస్మాన్, సకనా బేగం దంపతులకు జన్మించారు అబ్దుల్ హమీద్. వారి కుటుంబ వృత్తి ధర్టీ పని. కాని చిన్నప్పట్నుండి కుస్తీలు, కత్తి సాము అంటే ఇష్టపడే హమీద్ తన 20వ ఏట వారణాసిలో సైన్యంలో చేరాడు. రికాయిల్నెస్ గన్ వాడడంలో అత్యంత ప్రావీణ్యం సాధించిన హమీద్ 1962 చైనా యుద్దంలో తన వీరత్వం ప్రదర్శించాడు. అతను యాంటీ ట్యాంక్ గన్ పేలిస్తే ట్యాంక్ ఖచ్చితంగా ధ్వంసం అయ్యేది. అదీ అతని నైపుణ్యం. పదోన్నతి లభించిన అతను ఇప్పుడు స్టోర్స్లో క్వార్టర్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు.
క్వార్టర్ మాస్టర్ విధుల నుండి వెనక్కి పిలిపించి అతనికి యాంటీ ట్యాంక్ బాధ్యతలను అప్పగించారు అధికారులు. సామాన్యంగా ఒక ట్యాంక్ ని ధ్వంసం చేయాలంటే మరో ట్యాంక్తో దాడి చేయాలి. యాంటీ ట్యాంక్ గన్ తో నిక్కచ్చిగా గురి చూసి దాడి చేస్తే కూడా ధ్వంసం చేయవచ్చు. కాని ఆ రోజుల్లో టెక్నాలజీ లేమి వల్ల మానవ నైపుణ్యం మీదే ఆధారపడవలసి వచ్చేది, అందులో ఖచ్చితత్వం చాలా తక్కువగా ఉంటుంది.
ఖేమ్కరణ్ జిల్లాలోని చీమా గ్రామంలోని చెరకు తోటలో మాటువేసి తన జీప్ పైన యాంటీ ట్యాంక్ గన్ బిగించి శత్రువు కోసం వేచి ఉన్నాడు హమీద్, రిక్కించిన చెవులకు తమవైపుకు వస్తున్న ట్యాంక్ శబ్దాలు వినబడ్డాయి. తనజీప్ పైన ఉన్న గన్ లోడ్ చేసి సిద్దం చేసుకున్నాడు. తన గన్ పరిధిలోకి రాగానే గురి చూసి పేల్చాడు. యాంటీ ట్యాంక్ గన్ నేరుగా వెళ్ళి ట్యాంక్ ను ఢీకొట్టింది. ట్యాంక్ కి నిప్పు అంటుకోవడం సిబ్బంది పారిపోవడం కళ్ళారా చూశాడు. రెండు గంటల తర్వాత మూడు ట్యాంకులు వచ్చాయి. భారీగా పేలుళ్ళు జరుపుతూ తమ స్థావరం వైపు వస్తున్నాయి. మళ్ళీ గురి చూసి జీప్ పై బిగించిన రీకాయిల్లెస్ గన్స్ పేల్చాడు. ఒక ట్యాంక్తి నిప్పు అంటుకోగానే మిగతా వాటిని కూడా వదిలేసి పారిపోయారు పాక్ సైనికులు. అలా మొదటి రోజు రెండు ట్యాంకులను ధ్వంసం చేయగా మరో నాలుగింటిని వదిలేసి పారిపోయారు శత్రువులు.
మర్నాడు ట్యాంక్లతో పాటు వైమానిక దాడులకు తెగబడింది పాక్, అయినా హమీద్ వెరవలేదు. గురి చూసి ఆ రోజు మరో రెండు ట్యాంకులను ధ్వంసం చేశాడు. హమీద్ వాడుతున్న రికాయిల్ లెస్ గన్ తో ఒక ట్యాంక్ ని ధ్వంసం చేయడమే చాలా కష్టం. అలాంటిది ట్యాంక్లను ధ్వంసం చేయడమే కాక మరెన్నింటినో వదిలిపోయేలా చేసిన హమీద్ కు పరమవీర చక్రను అప్పటికప్పుడు ప్రతిపాదించారు అధికారులు.
కంట్లో నలుసులా ఉన్న హమీద్ జీప్ అంతు చూడాలని మర్నాడు పాక్ సైన్యం బయల్దేరింది. తమ ట్యాంకులతో ముందుగా ఆ జీప్ పై దాడ్ చేయాలనే వ్యూహంతో వచ్చారు పాక్ సైనికులు. వారికి తాను కనపడకుండా మాటు వేస్తూ మరో మూడు ట్యాంకులను ధ్వంసం చేసి తన విజయ పరంపరను కొనసాగించాడు హమీద్. నాలుగో ట్యాంక్ కి గురిపెడుతుండగా ఆ ట్యాంక్లో ఉన్న శతృసైనికులు పసిగట్టారు హమీద్ జీప్స్, హమీద్ జీపలోని గన్, పాక్ ట్యాంక్ ఒకేసారి పేలాయి. రెండూ లక్ష్యాన్ని ఛేదించాయి. పాక్ ట్యాంక్ ధ్వంసం కాగా ట్యాంక్ దాడికి మామూలు జీప్ తట్టుకోలేకపోయింది. భారత వీరుడు నేలకొరిగాడు.
హమీద్ విజయ పరంపర మగిసింది. కానీ హమీద్ పోరాట ఫలితంగా తన ట్యాంకులను ఖేమ్కరణ్ కి పంపే వ్యవధి భారతికి దొరికింది. భారత ట్యాంకులు ఖేమ్కరణ్ కు చేరాయి. భీకర సమరం సాగింది. పాకిస్తాన్ తన 100 ట్యాంకులను వదిలేసి పారిపోయింది. హవల్దార్ అబ్దుల్ హమీదకు మరణానంతరం పరమ వీర చక్ర సత్కారం లభించింది.
ఆ చీమా గ్రామానికి అసల్ ఉత్తర్ అని పేరు పెట్టారు. దీటైన సమాధానం అని దీని అర్థం. అక్కడ అబుల్ హమీద్ స్మారకం కూడా ఉన్నది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

3 comments