Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

లక్ష్యం సాధించిన వీరుడు మనోజీకుమార్ పాండే

  మనోజీకుమార్ పాండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాలో రుధా గ్రామంలో గోపీచంద్ పాండే దంపతులకు 1975, జూన్ 25న జన్మించారు. చదు...

 
మనోజీకుమార్ పాండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాలో రుధా గ్రామంలో గోపీచంద్ పాండే దంపతులకు 1975, జూన్ 25న జన్మించారు. చదువుకునే రోజుల్లోనే క్రీడల పట్ల ఆసక్తి కలిగిన పాండే బాక్సింగ్, బాడీబిల్డింగ్ పై ప్రత్యేక అభిమానం కనబరిచేవారు. ఎన్డీఏలో ఉత్తీర్ణత పొంది గూర్ఖా రైఫిల్స్ విభాగాన్ని ఎంచుకుని భారత సైన్యంలో సేవలు అందించారు. భారత సైన్యంలో అర్హత పొందే ప్రక్రియలో భాగంగా జరిగిన ముఖాముఖిలో పరమ వీర చక్ర పొందడం కోసమే సైన్యంలో చేరాలని అనుకుంటున్నట్లు సమాధానం చెప్పారు. 

కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న పాండే ఎన్నోసార్లు వరుసగా చొరబాటు దారులను సమర్థవంతంగా వెనక్కి మళ్ళించారు. వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యం కల్గిన జుబార్ టాప్ అనే ప్రదేశాన్ని కైవసం చేసుకోడానికి తన అనుచర గణాన్ని చాకచక్యంగా నడిపించారు. తన తోటి వారికి స్ఫూర్తినిచ్చేలా శతృవుల తుపాకీల దాడిని ఎదిరిస్తూ ఒంటరిగా ముందుకురికారు. ఆ క్రమంలో భుజానికి, కాలికి బుల్లెట్ గాయాలైనా సరే లెక్కచేయక పట్టుదలతో శతృవుల మొదటి బంకర్ చేరి పట్టి చేతులతో అక్కడి వారిని మట్టుపెట్టి దాన్ని కైవసం చేసుకున్నారు. ఉత్సాహం పొందిన అనుచర గణం కూడా ముష్కర మూకపై దండెత్తి పోరాటం మొదలు పెట్టారు. గాయపడిన దేహంతోనే కెప్టెన్ మనోజ్ ఒక బంకర్ నుండి మరో బంకర్ కు పరుగెడుతూ తనవారిని ఉత్సాహపరుస్తూ శతృసంహారం చేశారు. చివరి బంకర్ కూడా కైవసం చేసుకున్న తరువాతే గాయాలవల్ల ఆయన స్పృహ కోల్పోయారు.

ఆపరేషన్ విజయ్ సమయంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి కార్గిల్ బాబ్లిక్ సెక్టార్లో చొరబాటుదార్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. శతృ శిబిరాలను హస్తగతం చేసుకునే బాధ్యతను చేపట్టిన కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే 1999 జూలై 3న భాలూజర్ ను తిరిగి కైవసం చేసుకోవడం కోసం తన పటాలంతో లక్ష్యానికి దగ్గరగా చేరుకున్నారు.

శతృవుల గుళ్ళదాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ బలహీనమైన చోట ఉన్న తన బృందాన్ని సురక్షితమైన చోటికి చేర్చారు. ఒక దళాన్ని శతశిబిరానికి కుడివైపుగా ముట్టడించమని ఆజ్ఞాపించి తను వేరొక దళంతో కలిసి ఎడమవైపు నుండి వ్యూహాత్మకంగా విరుచుకు పడ్డారు. శరీరం మీద రెండు చోట్ల బుల్లెట్ గాయాలైనా లక్ష్యపెట్టక నాలుగవ దశ వరకూ శతృవుతో అలాగే పోరాడుతూ, సినాదాలతో తన వారిని ఉత్సాహపరుస్తూ ముందుకు సాగారు. చివరికి నుదిటిలో దూసుకుపోయిన తూటాకు బలై ప్రాణాలొదిరారు.

మనోజ్ ధైర్యసాహసాలు, నాయకత్వ పటిమ కారణంగా ఖాలూబర్ ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది. ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం ఇచ్చిన పరమవీర చక్ర ప్రదానంతో ఆయన కోర్కె ఫలించింది. ఆయన విద్యనభ్యసించిన లక్నో సైనిక స్కూల్ ఆయన జ్ఞాపకార్థం పాఠశాల అసెంబ్లీ హాలుకు అయన పేరు పెట్టుకున్నది. ఆయన స్వగ్రామమైన సీతాపూర్లోను, లక్నోలోని గోమతీ నగర్లోను రెండు చౌరాస్తాలకు 'కెప్టెన్ మనోజ్ పాండే చౌక్' అని పేరు పెట్టుకున్నారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments