Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సుభాష్ చంద్రబోస్ జీవిత విశేషాలు - Subhash Chandra Bose Life

సుభాష్ చంద్రబోస్ : నేతాజీ అని వీరికి బిరుదు. వీరు ఉత్కళ ప్రాంతంలోని కటక్ లో క్రీ.శ. 1897 జనవరి 23 న ప్రముఖ న్యాయవాది జానకీనాథబసు, ప్రభావ...

సుభాష్ చంద్రబోస్ : నేతాజీ అని వీరికి బిరుదు. వీరు ఉత్కళ ప్రాంతంలోని కటక్ లో క్రీ.శ. 1897 జనవరి 23 న ప్రముఖ న్యాయవాది జానకీనాథబసు, ప్రభావతీదేవి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటినుండి స్వాభిమానంతో పట్టుదలతో ఉండేవాడు. పొటెస్టెంట్ యూరోపియన్ స్కూలులో చదువుతున్నప్పుడు భారతీయులను కొడుతును అంగేయుల పిల్లలను ఎదిరించి చావబాదాడు.
ఒక పుస్తకంలో దేశస్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవకారుల చిత్రాలను అతికించుకుని నేను కూడా ఇలా జీవించాలి నేను కూడా ఇలా మరణించాలి అని వ్రాసుకున్నాడు. సుభాష్ తన మిత్రులందరితో కలసి కటక్ లో స్వేచ్చా సేవాసంఘ్ ను స్థాపించి చుట్టుప్రక్కల గ్రామాలలో సేవా కార్యక్రమాలు చేసేవాడు. 1919లో జలియన్ వాలాబాగ్ లో భారతీయులపై జరిగిన అమానుష చర్యకు కలతచెంది ఇంగ్లండులో ఐసిఎస్ చదువుతున్న సుభాష్ బాబు 1920లో రాజీనామా పత్రాన్ని సమర్పించాడు. స్వాతంత్ర్య సమరరంగంలోకి దూకాడు.
నా జీవితం వివేకానందుని ప్రభావంతో రూపొందింది. జ్వలంతమైన వివేకా నందుని దేశభక్తి భావాలు నా రక్తనాళాలలో లావావలె ప్రవహించి నన్ను ఉత్తేజపరుస్తూ జాతీయోద్యమంలో ముందుకు నడిపిస్తున్నాయి అని సుభాష్ బాబు సగర్వంగా చెప్పుకొన్నాడు. 
ఈయనకు దేశబంధు చిత్తరంజన్ దాసు రాజకీయ గురువు. 1921లో వేల్స్ యువరాజు భారత సందర్శనను వ్యతిరేకిస్తూ సుభాష్ చంద్రబోసు స్వచ్చంద సైనికుల దళాన్ని సమకూర్చుకుని హర్తాళ్ నిర్వహించాడు. ఆంగ్లేయులు ఈయనను బర్మాలోని మండాలే జైలులో బంధించినప్పుడు దుర్గా పూజలు జరుపుకోవడానికి అనుమతినివ్వాలని ఆమరణ నిరాహారదీక్ష కొనసాగించాడు. సైమన్ కమీషన్ కు వ్యతి రేకంగా ఉద్యమించాడు. కొంతకాలం బెంగాలీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీకి అధ్యక్షుడుగా ఉన్నాడు. ఈయన అతివాది. స్వరాజ్యం తప్ప మరేమీ అక్కరలేదు అని మాత్రమే ప్రతిపాదించి పలువురి సమర్ధనను పొందాడు.
1938లో అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షుడయ్యాడు. కార్యకర్తలలో ఉత్సాహం పెల్లుబికేలా తక్షణ కార్యక్రమాలను, దీర్ఘకాలిక కార్యక్రమాలను రూపొందించాడు. స్వరాజ్య సాధనదిశగా ఆఖరి పోరాటానికి మనం సిద్ధం కావాలని పిలుపునిచ్చాడు. ఒకసారి నాగపూర్లో రైలులో వెడుతూ రాష్ట్రీయ స్వయంసేవకసంఘ్ పథసంచలనాన్ని చూసిన తరువాత ఆయనలో ఆత్మ విశ్వాసం ప్రబలింది. డాక్టర్జీని కలిశారు కాని డాక్టర్జీ తీవ్ర అస్వస్థులుగా ఉన్నందున మాట్లాడే అవకాశం లేకపోయింది.
నేతాజీ యూరపు పర్యటనలో ఉన్న సమయంలోనే కొన్ని అభ్యుదయ భావాల్ని తీవ్రచర్యల్ని తన పంథాలో ప్రజలముందుంచడం కోసం కాంగ్రెసులో భాగమని ప్రకటిస్తూనే ఫార్వర్డ్ బ్లాక్ అనే సంస్థను ప్రారంభించాడు. రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమైనాక సుభాష్ బాబును ఆంగ్ల ప్రభుత్వం నిర్బంధించింది. బ్రిటిష్ వారి కన్నుగప్పి 1941లో గృహనిర్బంధం నుండి తప్పించుకుని పురుషపురం (పెషావర్) మీదుగా జర్మనీకి వెళ్లి హిట్లర్ ను కలిసి భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని గురించి తెలియ జేసి ఆయన సమర్ధనను కూడా సంపాదించాడు. జర్మనీ జపాన్ దేశాలు సందర్శించి భారతీయులను సమీకరించి 1942 జనవరి 26న ఆజాద్ హింద్ ఫౌజ్ అనే స్వతంత్ర జాతీయ సైన్యాన్ని రూపొందించాడు. జపాన్ దేశం అండమాన్ నికోబారు దీవులను నేతాజీకి స్వాధీనం చేసింది.
1943 అక్టోబరు 21న సింగపూరు నుండి తాత్కాలిక ప్రభుత్వంలోని అధికారులను ప్రకటించాడు. వీటికి కావలసిన నిధులను భారతీయులనుండే సేకరించిన స్వాభిమాని. ఢిల్లీ ఎర్రకోట మీద సయితం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే సంకల్పంతో ఢిల్లీచలో అనే పిలుపునిచ్చాడు. ప్రజలలో చైతన్యాన్ని పులకరింతలను కలిగించేలా జైహింద్ అనే నినాదాన్నిచ్చాడు. ఇది జాతీయ నినాదంగా మారుమ్రోగింది. మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను అని దేశ యువతకు పిలుపునిచ్చాడు.

1945 ఆగస్టు 18నాడు ఫార్మోజా సమీపంలో విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లుగా టోక్యో రేడియో ప్రకటించింది. అయితే అప్పట్లో విమానప్రమాదం ఏదీ జరుగలేదని తాయిపై ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. నేతాజీ ఎప్పటివరకు జీవించి ఉన్నారు, వారి చివరిరోజులు, ఎక్కడ ఏవిధంగా గడిచాయి అన్న విషయం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. నేతాజి ప్రదర్శించిన ధైర్యసాహసాలు యువతకు ఆదర్శవంతమౌతాయి. శౌర్యం, ధైర్యం, సంఘటనా కుశలత, ప్రయత్నశీలత, త్యాగము మరియు బలిదానములనే అత్యుత్తమ ఆదర్శాలను ప్రపంచం ముందుంచిన మహానాయకుడు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

3 comments

  1. Great Post. We need more and more of such real life stories of our heroes..

    ReplyDelete
  2. చక్కని వ్యాసం. నేతాజీ జీవిత చరిత్రను క్లుప్తంగా చెప్పారు.

    ReplyDelete
  3. యువతకు స్ఫూర్తి ప్రదాత

    ReplyDelete