Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

Devendra Swaroop Passes away- Nationalist-writer

పాంచజన్య హిందీ వారపత్రిక సంపాదకులుగా పనిచేసిన శ్రీ దేవేంద్ర స్వరూప్ గారు 93 ఏళ్ళ వయసులో 2019 జనవరి 14 న స్వర్గస్తులయ్యారు. 1996 లో  శ్రీ ప...

పాంచజన్య హిందీ వారపత్రిక సంపాదకులుగా పనిచేసిన శ్రీ దేవేంద్ర స్వరూప్ గారు 93 ఏళ్ళ వయసులో 2019 జనవరి 14 న స్వర్గస్తులయ్యారు.

1996 లో  శ్రీ పులుసు గోపిరెడ్డి గారు తాము వ్రాయబోయే ఇరువురు సంఘ జ్యేష్ఠ ప్రచారకుల జీవిత చరిత్ర పుస్తకాలకోసం మరికొంత సమాచారం సేకరించుకు రమ్మని  నన్ను ఢిల్లీకి పంపించారు.అక్కడ నాలుగు రోజులున్నాను. నేను అక్కడే ఉన్న శ్రీ శ్యాంపరాండే గారిని కలిశాను. వారు  విషయం తెలుసుకుని , శ్రీ దేవేంద్ర స్వరూప్ గారిని మరియు శ్రీ భానుప్రతాప్ శుక్లా ( పాంచజన్య హిందీ వారపత్రికకు సంపాదకులుగా పనిచేశారు )గారిని కలవమన్నారు. అనుకోకుండా ఒకరోజు శ్రీ దేవేంద్ర స్వరూప్ గారు ఏదో బైఠక్ నిమిత్తం కేశవకుంజ్ ( ఢిల్లీ సంఘ కార్యాలయం ) కే వస్తున్నారని శ్రీ శ్యాంపరాండే గారికి తెలిసి , వారితో కాసేపు నేను మాట్లాడటానికి  అనుమతి తీసుకున్నారు. నేను వారిని కలవడానికి వెళ్ళేటపుడు తెలుగులో శ్రీ ఓగేటి అచ్యుతరామ శాస్త్రి గారు వ్రాసిన  ' వేకువ వెలుగులు ' అనే పుస్తకం వెంట తీసుకెళ్ళాను. వారు ఆయా జ్యేష్ఠ కార్యకర్తల గురించి ఓ అరగంట సేపు చాలా విషయాలు చెప్పారు. చివరలో ఇలా మీ ప్రాంతంలో , బయటి ప్రాంతాలనుండి వచ్చి పనిచేసిన ప్రచారకుల జీవిత చరిత్రలు ప్రచురించాలనే ఆలోచన అద్భుతంగా ఉందని, ఈ పని మరెక్కడా జరిగినట్టు లేదని ( బహుశా ఆనాటికి ) అంటూ నీ చేతిలోని పుస్తకం ఏమిటని అడిగారు. ఈ పుస్తకంలో అలాంటి ప్రచారకుల జీవితాల గురించి వివరాలున్నాయని చెప్పాను. అది వినగానే ఆయన ఆ పుస్తకం ఇప్పించుకుని , పుటలు తిప్పారు. ఆ తర్వాత , ఈ పుస్తకం నాకివ్వమని, నా లైబ్రరీ లో ఉంచుకుంటానని అడిగారు. దానిమీద పుస్తకం పేరు, రచయిత పేరు హిందీ లేదా ఇంగ్లీషులో వ్రాసిఇవ్వమన్నారు. నేనేమో ఇది తెలుగు భాషలో ఉంది, మీకెలా ఉపయోగపడుతుంది అనడిగాను. అపుడాయన , నా లైబ్రరీ చూడటానికి వచ్చిన వారికి , ఇలాంటి ఒక ప్రయత్నం తెలుగు ప్రాంతంలో జరిగిందని చెప్పడానికి ,చూపడానికి పనికొస్తుందన్నారు. ఆ పుస్తకం మీద వివరాలు వ్రాసి వారికి ఇచ్చి వచ్చేశాను.
తమకు రాని భాష అయినా , ఒక కొత్త ప్రయత్నం జరిగిందని తెలుసుకుని, ఇతరులకు దాన్ని ఉదాహరణగా చూపాలని వేర్వేరు భాషల్లోనూ అలాంటి ప్రయత్నం జరిగితే బాగుంటుందనుకున్న వారి ఆలోచన ఎంతో అద్భుతం.
వారి పవిత్రాత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. - బ్రహ్మానంద రెడ్డి సింగా రెడ్డి.

No comments