Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కశ్మీర్ కుంకుమ పువ్వుకు అరుణిమ అద్దిన హాంగ్ పాన్ దాదా

పన్నెండు వేల అయిదు వందల అడుగుల ఎత్తున ఉన్న కశ్మీరీ షంషాద్రి కొండలపై నలుగురు పాకిస్తానీ ఉగ్రవాదులు చొరబడ్డారు. వారిని హతం చేయాలి' అని ...


పన్నెండు వేల అయిదు వందల అడుగుల ఎత్తున ఉన్న కశ్మీరీ షంషాద్రి కొండలపై నలుగురు పాకిస్తానీ ఉగ్రవాదులు చొరబడ్డారు. వారిని హతం చేయాలి' అని హాంగ్ పాన్ ఆదేశం వచ్చింది. 37 ఏళ్ళ హవల్లార్ హాంగ్ పాన్ దాదా కశ్మీర్లోని నౌగామ్ సెక్టర్లోని సాబూ పోస్ట్లో 35 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండర్గా ఉన్నారు.

అరుణాచల్ ప్రదేశ్లోనే తిరప్ జిల్లా ఒక మూలగా విసిరేసినట్టుంటుంది. అందులో మరీ లోతట్టు గ్రామం బర్ దురియా. ఆ ఊరికి రోడ్డు లేవు. అలాంటి ఊరులో పుట్టిన యువకుడు హాంగ్ పాన్ దాదా.
అధికారుల నుండి ఆదేశాలు వచ్చిందే తడవుగా తన బృందాన్ని తీసుకుని హాంగ్ పాన్ దాదా ముందుకు కదిలారు. కొండపై అడవుల్లో నలుగురు ఉగ్రవాదులు కనిపించారు. హాంగీపాన్ తుపాకీ ధన్ మని పేలింది. ఒక ఉగ్రవాది కుప్పకూలాడు. రెండో తూటా పేలింది. అదీ గురి తప్పలేదు. ఇంకో ముష్కరుడు నేలకూలాడు. మిగతా ఇద్దరు ఉగ్రవాదులు ఐండల చాటుకి పరిగెత్తారు.

హాంగ్ పాన్ చిరుతపులిలా ముందుకు దూకాడు. మూడోవాడిని పట్టి ముష్టిఘాతాలు కురిపించాడు. పిడిగుద్దులకు వాడు పచ్చడై పోయాడు. ప్రాణాలు ఆవిరైపోయాయి. అంతలో నాలుగోవాడు తూటాల వర్షం కురిపించాడు. హాంగ్ఎస్ ఒళ్లంతా జల్లెడ అయిపోయింది. వెచ్చని నెత్తురు శి) మంచుకొండపై పడింది. కానీ హాంగ్ పాన్ ముందుకే పరుగుతీసి నాలుగో వాడిని అదిమి పట్టుకున్నాడు. శక్తినంతా కూడదీసుకుని వాడిపై పిడిగుద్దులు కురిపించాడు. వాడూ చనిపోయాడు. తరువాత హాంగ్ పాన్ కూడా చనిపోయాడు.
కశ్మీరంలో కల్లోలం సృష్టించేందుకు చొరబడిన నలుగురు పాకిస్తానీ ఉగ్రవాదులనూ హతం చేసి కర్తవ్య నిర్వహణలో కన్ను మూశాడు హాంగ్ పాన్, కశ్మీరంలో అరుణాచల్ యువరక్తం చిందింది. అది కుంకుమ పువ్వుకు రంగులద్దింది. మువ్వన్నెల జెండాలో కాషాయంగా మారింది. జాతీయ గీతంలో అరుణాచల్ పేరుండదు. హాంగ్ పాస్ పేరు దేశంలో చాలా మందికి తెలియదు.
కానీ ఆ అరుణాచల్ వీరసింహం హాంగ్ పాన్ కి కశ్మీర్ నుంచి అరుణాచల్ వరకూ ఒకే దేశం.హాంగ్ పాన్ తప్పనిసరి పరిస్థితుల్లో పోరాడిన వాడు కాదు. ఈ పోరాటాన్ని కోరుకున్నాడు. అస్సాం రైఫిల్స్ నుంచి కశ్మీర్లో పోరాడేందుకే రాష్ట్రీయ రైఫిల్స్ కి బదిలీ చేయించుకున్నాడు. అతను చేసింది మామూలు పోరాటం కాదు. అతను చూపింది మామూలు వీరత్వం కాదు. ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవంలో మరణానంతరం హాంగ్ పాన్ దాదాకు రాష్ట్రపతి అశోకచక్ర పతకం ఇచ్చారు. ఆయన భార్య సేన్ లోవాంగ్ ఈ పతకాన్ని అశ్రు నయనాలతో వణికే చేతులతో అందుకున్నారు. యుద్ధ సమయంలో పరమవీర చక్ర ఎలాంటిదో శాంతి సమయంలో అశోక చక్ర అలాంటిది.

హాంగ్ పాన్ వంటి వేలాది మంది తమ తుది శ్వాసలను, ఆఖరి రక్తపు బొట్టును కశ్మీరం నేలపై విడిచారు. శత్రువు పాలిట మారణాయుధమై, జాతి కోసం వజ్రాయుధమై బతికారు. చనిపోయారు. చనిపోతున్నారు. అలాంటి త్యాగవీరులు ఉన్నంత వరకూ ప్రపంచంలో ఏ శక్తీ కశ్మీరును కబ్జా చేయలేదు.

హాంగపాన్ ఆరేళ్ల కుమారుడు సెనాంగ్ 'నేనూ సైన్యంలో చేరతాను. ఆర్మీ ఆఫీసర్ అవుతాను' అన్నాడు. హాంగ్ పాన్ ఆఖరి శ్వాస కశ్మీర్ కొండల్లో తిరుగాడుతూనే ఉంది. ఆఖరి ఆశ సెన్వాంగ్ గుండెల్లో మార్మోగుతూనే ఉంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments