పద్మశ్రీ లక్ష్మీకుట్టి అమ్మ-lakshmikutty amma padmashree

లక్ష్మీకుట్టి అమ్మ కేరళలోని కల్లార్ అటవీప్రాంతానికి చెందిన 75 ఏండ్ల వృద్ద, వనవాసీ మహిళ. లక్ష్మీ కుట్టికి సాంప్రదాయిక వైద్యవిధానంలో చేసిన విశిష్టకృషికిగాను పద్మశ్రీ పురస్కారం లభించింది. విషానికి విరుగుడు చికిత్స చేయటంలో ఈమె , సిద్దహస్తురాలు.
నాదేశం నన్ను గుర్తించినందుకు సంతోషంగా ఉంది. నేను పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనట్లు మా జిల్లా కలెక్టరు వచ్చి చెప్పగానే ఉబ్బితబ్బిబ్బు అయ్యాను. ఈ రంగంలో గత అర్థశతాబ్దంగా పనిచేస్తున్నాను. మా రాష్ట్ర ప్రభుత్వం కూడా నా సేవలు గుర్తించి సత్కరించింది. నాకు పద్మశ్రీ రావటం ఖాయమని కొంతమంది చెబుతూవచ్చారు
అని చెప్పింది. కవితలు, నాటికలు కూడా రచించే లక్ష్మీ కుట్టి అమ్మ జానపద అకాడమీలో బోధకురాలు. వారసత్వంగా మంత్రసానియైన తన తల్లివల్లనే ఈ జ్ఞానమంతా లభించిందని, కాణి తెగకుచెందిన తనకు 500 కుపైగా ఔషధాలు తెలుసునని చెప్పింది. ఆమె ఎనమిదో తరగతి (ధర్డ్ ఫారం) వరకు చదువుకుంది. సంస్కృత భాష కూడా వచ్చు. రెండేండ్లక్రితం ఆమె భర్త గతించాడు. ఇప్పుడు ఒంటరిగా అడవిలో ఉంటూ ఇంటిచుట్టూ ఔషధ మొక్కలను పెంచుతున్నది. మొదటి ఇద్దరు కొడుకులు మరణించారు. మూడో కుమారుడు రైల్వేలో పనిచేస్తున్నాడు.

ప్రకృతిని జాగ్రత్తగా గమనిస్తుంటానని ప్రకృతిలోనే అన్ని చికిత్సలు ఉన్నానయని చెబుతుంది. జంతువుల్లోను, చేపల్లో కూడా ఔషధశక్తి ఉన్నదని ఆమే నమ్మకం. తన ఇంటికి ఇంతవరకు రోడ్డు లేదని తాము అడవిలో ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుందని, ఇక్కడ ఏనుగులు సహా వన్యమృగాలు సంచరిస్తుంటాయని, రోగులను సకాలంలో నా వద్దకు చేర్చటం ప్రజానీకానికి ఇబ్బందిగా వుందని, ఈ దృష్ట్యా ప్రభుత్వం ఏదైనా చేయాలని అంటుంది.
నా కుమారుడు ఒకడు పాముకాటుతో మరణించాడు. అందువల్ల పామువిషానికి సంబంధించిన విజ్ఞానమంతా నేర్చుకున్నాను. పాముకరచిన వెంటనే వీలైనంత త్వరగా ఆ విషాన్ని నోటితో లాగి “ఉమ్మి వేయాలి” అని చెబుతుంది లక్ష్మీ కుట్టి అమ్మ.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments