Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భగత్ సింగ్ ఆత్మాహుతికి ఒక రోజు ముందు ఖైదీ సహచరులకు రాసిన ఆఖరు ఉత్తరం ఇది

ఉరి తీయడానికి ఒక రోజు ముందు సెంట్రల్ జైలులోనే మరో వార్డులో బందీలుగా ఉన్న విప్లవకారులు రాసిన ఒక కాగితం భగత్ సింగ్ కు అందింది. అందులో ఆఖరు క...

ఉరి తీయడానికి ఒక రోజు ముందు సెంట్రల్ జైలులోనే మరో వార్డులో బందీలుగా ఉన్న విప్లవకారులు రాసిన ఒక కాగితం భగత్ సింగ్ కు అందింది. అందులో ఆఖరు క్షణాల్లో ఆయనను ఉరి నుండి తప్పించేందుకు ప్రయత్నం చేసే ప్రతిపాదన ఉంది. భగత్ సింగ్ జవాబు పంపాడు. ఆత్మాహుతికి ఒక రోజు ముందు ఖైదీ సహచరులకు రాసిన ఆఖరు ఉత్తరం ఇది:
                                                               మార్చి 1931.
మిత్రులారా,
జీవించాలనే కోరిక సహజంగా నాలో కూడా ఉండాలి. దీన్ని నేను దాచి పెట్టదలచుకో లేదు. కానీ, నేను బ్రతికి ఉండటాని ఒక షరతు: ఖైదీగా గానీ, ప్రతిబంధకాలతో గానీ జీవించి ఉండే కోరిక నాకు లేదు. ‘హిందుస్తానీ ఇన్ కిలాబ్ విప్లవ పార్టీ'కి నా పేరు ఒక ప్రతీకగా తయారయి పోయింది. విప్లవ పార్టీ ఆదర్శాలూ, త్యాగాలూ నన్ను చాలా ఎత్తుకు తీసుకెళ్ళాయి. ఎంత ఎత్తుకంటే, బ్రతికి ఉండి కూడా అంతకంటే ఎత్తుకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేరుకోలేనంత ఎత్తుకు. ప్రజలకు ఈ రోజు నా బలహీనతలు తెలియవు. ఉరి నుండి నేను తప్పించుకున్నట్లయితే అవి బట్టబయలవుతాయి. అంతే కాకుండా ఇన్కలాబ్ చిహ్నం మైలపడిపోవచ్చు. లేదా నశించే పోవచ్చు. అలాకాక నేను సాహనంతో నవ్వుతూ, త్రుళ్ళుతూ ఉరికంబమెక్కిన పక్షంలో ఈ దేశపు తల్లులు తమ పిల్లలు భగత్ సింగ్లు కావాలని ప్రార్ధిస్తారు. ఇంకా చెప్పాలంటే దేశ స్వాతంత్యం కోసం ఆత్మార్పణ చేసే వారి సంఖ్య ఎంతగా పెరిగిపోతుందంటే విప్లవాన్ని ఆపటానికి సామ్రాజ్యవాదానికున్న సమస్త వైశాచిక శక్తులకు కూడా బలం చాలదు.
ఆ! ఒక ఆలోచన మాత్రం ఇప్పుడు కూడా నన్ను లోలోపల తొలుస్తూ ఉంది. దేశం కోసం, మానవాళికోసం నా హృదయంలో ఉన్న ఆకాంక్షల్లో ఏవెయ్యోవంతు కూడా నేను పూర్తి చేయలేకపోయాను. జీవించి ఉంటే బహుశా వీటిని పూర్తి చేసే అవకాశం లభించి నేను నా కోరికలను నెరవేర్చుకోగలిగి ఉండే వాడినేమో! ఇంతకు మించి ఉరి నుండి తప్పించుకోడానికి సంబంధించి ఏ లాలసా నా హృదయంలో ఎప్పుడూ కలగలేదు. నాకంటే అదృష్టవంతులెవరుంటారు? ఈ రోజుల్లో నా పైన నాకు చాలా గర్వంగా ఉంటూంది. ఇప్పుడు మనస్సు ఎంతగానో ఆత్రపడుతూంది చివరి అంచును అందుకోవాలని. ఆ ఘడియ ఇంకా దగ్గర పడితే బాగుండునని ఆకాంక్షిస్తూంది.
                                                           మీ సహచరుడు,
                                                               భగత్ సింగ్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment