స్వతంత్ర భారత తొలి పరమవీర చక్ర గ్రహీత సోమి

1

స్వతంత్ర భారత తొలి “పరమవీర చక్ర' గ్రహీత సోమి కాశ్మీర్ మహారాజు తన రాజ్యాన్ని భారత్ లో విలీనం చేస్తూ ఒప్పంద పత్రంపై సంతకం చేశారని తెలుసుకున్న పాక్ సైన్యం ఎలాగైనా శ్రీనగర్ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకోవాలని పథకం వేసింది. పాక్ వ్యూహాన్ని పసిగట్టిన భారత్ శ్రీనగర్ విమానాశ్రయాన్ని కాపాడే బాధ్యతను మేజర్ సోమనాథ్ శర్మ (సోమి) కి అప్పగించింది.
శ్రీనగర్ ఎయిర్ బేస్డి నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న బద్ధం (గ్రామంలో ఉన్న శత్రువులను నిర్వీర్యం చేయటం భారత సైనికుల కర్తవ్యం.

Image result for somnath sharma param vir chakra

సూర్యోదయానికల్లా సోమి తన సైనికులతో కలిసి బద్ధం గ్రామానికి పశ్చిమాన ఉన్న కొండ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ఊరిలో ఒక కాలువ దగ్గర జనాలు గుమికూడి ఉన్నారు. వారు ప్రశాంతంగా ఉన్నప్పటికీ వారిలో ఏదో భయం కన్పిస్తోంది. మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి ఆ తరువాత ఎయిర్ఫీల్డ్ కి తిరిగి వెళ్ళాలని సోమి నిర్ణయించుకున్నారు.
మధ్యాహ్నానికి ప్రజలు చెల్లా చెదురపడం చూసి ఎవరిళ్ళకి వారు భోజనాలకి వెళుతున్నారని అనుకున్నాడు సోమి. కానీ వాస్తవం వేరు. సాధారణ దుస్తుల్లో ఆయుధాలు దాచుకుని పాక్ సైనికులు గ్రామ ప్రజల్లో కలిసిపోయారు. ప్రజలు భయపడడానికి అసలు కారణం అది. పాక్ మూకలు ప్రజల్లో కల్సిపోయి 1000 మంది సాయుధులు పోగయ్యే దాకా వేచి యుండి, ఆ తరువాత కేవలం 90 మంది ఉన్న సోమి దళంపై ఒకేసారి దాడి చేసి సునాయాసంగా బదాంను కైవసం చేసుకుని తదుపరి శ్రీనగర్ విమానాశ్రయాన్ని పట్టుకోవాలని పాక్ సైన్యాధికారి వ్యూహం, గ్రామస్తులు వెళ్ళిపోయిన అరగంట తరువాత అకస్మాత్తుగా గ్రామం వైపు నుండి కాల్పులు మొదలయ్యాయి. 303 రైఫిల్స్తో పాటు మెషిన్ గన్ కాల్పులు కూడా ప్రారంభమయ్యాయి. వాస్తవాన్ని గ్రహించిన సోమి విషయాన్ని పై అధికారులకు చేరవేశాడు. గ్రామంలో సామాన్య ప్రజలు, మహిళలు, పిల్లలు ఉంటారు కనుక అటువైపు ప్రతిదాడి చేయవద్దని గ్రామం వైపు కాల్పులు జరపవద్దని సోమి తన సైనికులను ఆదేశించాడు.
శతృవుల సంఖ్య కన్నా భారత సైనికుల సంఖ్య తక్కువగా ఉందని సోమనాథకు తెలుసు, తన బ్రిగేడ్ కమాండర్కు సమాచారం తెలిపి అదనపు బలగం, మందుగుండు కావాలని కోరితే 1వ పంజాబ్ బెటాలియనను సహాయం పంపుతున్నానని కమాండర్ బదులిచ్చాడు. అంతవరకు శత్రువును నిలువరించకపోతే ఎంత నష్టమో గ్రహించిన సోమి వ్యూహం మార్చారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

1923, జనవరి 31న జమ్మూలో జన్మించిన సోమి 1941 మేలో మిలిటరీ కాలేజీ నుండి పట్టభద్రుడై ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరి 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొని అనుభవం గడించారు. తమ వద్ద ఉన్న మందు గుండును పరిమితంగా వాడుతూ శత్రువును రెచ్చగొట్టి వారి ఆయుధాలు అయిపోయేట్టు చేస్తూ చివరిదాకా పోరాడదామని తన సైనికులను ప్రోత్సహించారు. తన ఎడమచేయి దెబ్బతిని పాస్టర్ వేసుకున్నప్పటికీ ఒంటి చేత్తో గన్ పేలుస్తూ, తన పోస్టులో ఉన్న సైనికులకు మందుగుండు చేరవేస్తూ, వారిని ప్రోత్సహిస్తూ వైర్లెస్లో పై అధికారులకు వాస్తవ సమాచారం తెలిపారు.
శతృవులు 50 గజాల దూరానికి చేరుకున్నారు. చాలా మంది ఉన్నారు. అయినా ఒక్క అంగుళం కూడా వెనక్కి తగం, పోరు ఆగదు.. అని చెపుతుండగానే ఒక గ్రెనేడ్ వచ్చి వారి ప్రక్కనే ఉన్న మందుగుండు సామగ్రిపై పడి చూస్తుండగానే పేలిపోయింది. తీవ్రగాయాలపాలై విపరీతమైన బాధతో నేలకొరిగి పోతూన్న సోమికి ఆకాశంలో శ్రీనగర్ విమానాశ్రయం వైపుకు దూసుకు వస్తున్న భారత్ విమానాలు కనిపించాయి. సోమి పెదాలపై చిరునవ్వు, నా సహచరులు, నా గడ్డ సురక్షితం అన్న తృప్తి ఆ నవ్వులో విరిసింది. .
నాయకత్వ పటిమకు, వీరత్వానికి ఉదాహరణగా నిల్చిన సోమనాథశర్మకు మరణానంతరం భారత ప్రభుత్వం పరమ వీర చక్ర బహూకరించింది. స్వతంత్ర భారత చరిత్రలో తొలి పరమ వీర చక్ర గ్రహీత సోమి.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment
To Top