Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పరమ వీర చక్ర అందుకున్న తొలి సజీవ వీరుడు కరమ్ సింగ్

'పరమ వీర చక్ర' అందుకున్న తొలి సజీవ వీరుడు కరమ్ సింగ్. యుద్ద గాయాల వల్ల రక్తంతో తడిసిన దుస్తులతో 303 రైఫిల్ పట్టుకుని ఉన్నాడు కర...

'పరమ వీర చక్ర' అందుకున్న తొలి సజీవ వీరుడు కరమ్ సింగ్. యుద్ద గాయాల వల్ల రక్తంతో తడిసిన దుస్తులతో 303 రైఫిల్ పట్టుకుని ఉన్నాడు కరమ్ సింగ్, అప్పటికే పాకిస్తానీయులు చేసిన తొలి వాడిని కరమ్ సింగ్ తన సైనికులతో తిప్పి కొట్టాడు. కానీ శత్రువు నూతన జిలగంతో మళ్ళీ వచ్చాడు.
కరమ్ సింగ్ 1915 సెప్టెంబరు 15న పంజాబ్లోని సంగ్రూర్ జిల్లా స్నేహ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి ఉత్తమ్ సింగ్, కరమ్ సింగ్ 1941లో సైన్యంలో చేరారు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ తరఫున పోరాడి రాజి నుండి ప్రశంసా శౌర్య పతకం పొందారు.
కరమసింగ్ నిశ్శబ్దంగా నిలబడి గంభీరంగా చూస్తున్నాడు, కందకం నుండి బయటకు కంగారుగా వచ్చిన ఒక సిఖ్ సీపాయి 'శత్రువులు దగ్గరికి వచ్చేస్తున్నారు. మేము ముగ్గురం, నీతో కలిసి నలుగురం. ఏం చేద్దాం ?' అన్నాడు కరమ్ సింగ్తో, ఔట్ పోస్ట్ మీదకు వస్తున్న పాక్ సైనికులపై దృష్టి సారించారాయన. తన తుపాకీ వైపు చూశారు, శతృవులపై కాల్పులు జరపడానికి తమ వద్ద ఉన్న తూటాలు సరిపోవు అని గ్రహించారు. తమకు మద్దతుగా రావలసిన భారత సేనలు ఇంకా రాలేదు. వారు వచ్చే దాకా శతృవును ఎలాగైనా సరే నిలువరించాలి. 'జో బోలే సో నిహాల్ సత్ శ్రీ అకాల్' అంటూ గ్రెనేడ్ తీసి శత్రువుల పైకి విసిరారు. శతృసైనికులు చెల్లా చెదురుగా పడిపోయారు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


మనం పోరాడుతూ మరణిస్తే మనల్ని గుర్తుంచుకుంటారు. మనం లేక పోయినా, మన స్థానంలో తోటి సైనికులు పోరాడుతారు' అని చెప్పి తన సంచిలోంచి ఇంకో గ్రెనేడ్ తీసి శత్రువుల వైపు విసిరారు కరమ్ సింగ్. ఆయన ఒక ఆల్ఫా కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. రిచార్ లో గలి ఔట్ పోస్టు వద్ద 1948 అక్టోబరు 13 ఉదయం 6.00 గంటలకు ఆయన దళం పాక్ సైనికుల దాడికి గురైంది. 'చంపడమా లేక చావడమా? అన్న పరిస్థితి. రీచార్ గలిని ఆక్రమించి, తిత్వాల్ గుండా శ్రీనగర్ మీద దాడి చేయాలని పాక్ ప్యూహం, అంచెలంచెలుగా దూసుకు వస్తున్నారు శతృవులు.
Image result for karam singh param vir chakra
పాక్ సైనికులలో ఇద్దరు తమ కందకం దగ్గరకు వచ్చేశారని గమనించారు కరమ్ సింగ్, ఆ ఇద్దరిపై కాల్పులు జరిపితే తన సైనికులు కూడా గాయపడతారని కరమ్ సింగ్ కు అర్ధమైంది. క్షణం ఆలస్యం చేయకుండా తన బాకుతో బంకర్ నుండి బయటికి వచ్చారు. ఎదురుగా ఉన్న పాక్ సిపాయి ఛాతీలో పొడిచారు. 'ఘసా, నికాల్ ఘసా, నికాల్ (పొడుపు, బయటికి తియ్యి, పొదువు, బయటికి తియ్యి) అనుకుంటూ తన ఉసాద్ నేర్పించిన యుద్ద విద్యను స్మరించుకున్నారు. శత్రు సైనికుడు కరమసింగ్ ను ప్రతిఘటించకుండానే మరణించాడు. రెండో పాక్ సైనికుడి చరాని, పేగులను చీల్చుకుంటూ కరమ్ సింగ్ బాకు దూసుకెళ్ళింది. వాడూ నేల కూలాడు. ఏం జరిగిందో తెలిసేలోపు కరమ్ సింగ్ మళ్ళీ బంకర్లోకి వెళ్ళిపోయారు. సిఖ్ యోధుడు చంపే విధానం చూసిన పాక్ సైనికులు ఖంగుతిని, పలాయనం చిత్తగించారు. అప్పటికే వాళ్చు. ఎనిమిది సార్లు కరమ్ సింగ్ దళం మీద దాడి చేశారు. కాని వాళ్ళ దాడుల్ని సిఖ్కులు తిప్పి కొట్టారు, జట్లు జట్లుగా వస్తున్న పాక్ సైనికులు మూడు. ఏ వేల గుళ్ళను ప్రయోగించారు. 'ఏ' కంపెనీ బంకర్లన్నీ ధ్వంసమయ్యాయి. జట్టు పది మంది సిఖ్కులను కోల్పోగా 37 మంది గాయపడ్డారు. డివిజన్ కమాండర్ మేజర్ జనరల్ కె, యస్. తిమ్మయ్య 'ఇది ఒక అద్భుతమైన యుద్ధం' అని పేర్కొన్నారు, లాన్స్సోయక్ కరమ్ సింగ్ భారత తొలి రాష్ట్రపతి డా.రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా పరమ వీర చక్రను అందుకున్నారు. సజీవులుగా ఈ పురస్కారాన్ని పొందిన వారిలో కరమ్ సింగ్ ప్రథములు.

No comments