Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

యతీంద్రనాథ్ దాస్ బ్రిటిష్ న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా మేజిస్ట్రేటుకు రాసిన ఉత్తరం

విప్లవకారుల పైన మోపిన కేసుల విచారణ ఏ పద్ధతిలో జరిగేదో, బిటిస్ న్యాయం ఏ విధంగా కేవలం బూటకంగా ఉండేదో అది మేజి సేటు యతీంద్రనాథ్ దాస్ రాసిన ఈ ...

విప్లవకారుల పైన మోపిన కేసుల విచారణ ఏ పద్ధతిలో జరిగేదో, బిటిస్ న్యాయం ఏ విధంగా కేవలం బూటకంగా ఉండేదో అది మేజి సేటు యతీంద్రనాథ్ దాస్ రాసిన ఈ నిరసన పత్రం ద్వారా స్పష్టమవుతుంది.
యతీంద్రనాథ్ దాస్ బ్రిటిష్ న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా మేజిస్ట్రేటుకు ఈ ఉత్తరం రాశాడు. 
సామ్రాట్టు
వర్సెస్ 
యతీంద్రనాథ్ దాస్ 
                                                                                                                                            3 జూలై 1929.
మహాశయా, 
మీ ప్రార్ధి ఎంతో ఆదరపూర్వకంగా ఈ ప్రార్ధన చేస్తున్నాడు.
(క) నాలుగైదు రోజులకు ముందు నన్ను బందీగా ఉంచిన రైల్వే స్టేషను పోలీసు లాకప్ లో నేరస్తుని గుర్తుపట్టే పెరేడు జరిగింది. 
(ఖ) మురికి బట్టలతో ఉన్న దాదాపు ముప్పై ముప్పై అయిదు సంవత్సరాల వయసు ఉండే కొందరు పంజాబీ పాకీవాళ్ళను, కూలీలను రైల్వే స్టేషను నుండి తీసుకు రావడం జరిగింది. ఈ వ్యక్తులను లాకప్ వద్దకు ఒక సందు గుండా తెచ్చారు. ఆ సందుకు దగ్గరగా నేరస్తుని గుర్తు పట్టేవాడు మేజిస్ట్రేటు కారులో కూర్చొని ఉన్నాడు. నన్ను ఈ ఆరుగురి మధ్య నిలబెట్టారు. ఇలాంటి గుర్తింపు పెరేడ్కు అర్థం లేదనే దాన్ని గురించి తెలిపి నేను మేజిస్ట్రేట్ కు నా చిరాకును వ్యక్తం చేశాను కూడా. ఎందుకంటే ఈ పంజాబీలు ఆజానుబాహులేకాక, వారి రూపు రేఖలు చూచి వీళ్ళు బెంగాలీలు కారని ఎవరైనా చెప్పగలరు. పోలీసుల వద్ద నా ఫోటో, నా దస్తూరీ మొదలైనవి ఉన్నందువల్ల వాళ్ళు నన్ను గుర్తించడానికి వచ్చే వ్యక్తికి లేక వ్యక్తులకు వాటిని చూపే అవకాశం ఉంది కాబట్టి నన్ను నాలాంటి రూపు రేఖలున్న 
చెలగాలీల మధ్య నిలబెట్టడమే న్యాయోచితంగా ఉంటుందని మేజిస్ట్రేటుముందు మాటిమాటికి ఆక్షేపణ తెలిపినా, నా ఆక్షేపణలను లెక్క చేయలేదు. 

(గ) నన్ను గుర్తుపట్టడానికి వచ్చిన వ్యక్తి ఏ తేదీన అయితే నన్ను చూచినట్లు చెప్పాడో, దాన్ని గురించి నేను అతణ్ణి కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నాను. కానీ నా అభ్యర్ధనను తోసిపుచ్చడమే కాకుండా అక్కడికి వచ్చిన పోలీసు అధికారులు గుర్తు పట్టడానికి వచ్చిన ఆ వ్యక్తిని అక్కడి నుండి దూరంగా లాక్కు పోయారు. 
(ఘ) ఈ చర్య అంతా చాలా రహస్యంగానూ, తొందరపాటుతోనూ జరిగింది. ఇందులో పెద్ద నియమోల్లంఘన జరిగిందనీ, అందువల్ల నా ప్రతివాదానికి తీరని లోటు కలుగుతుందనీ నేను భయపడుతున్నాను. 
                                                                                                                             యతీంద్రనాథ్ దాస్
                                                                                                                                          3 జూలై 1929.
మధ్యాహ్నం 2.10 గంటలు లాహోర్ కుట్ర కేసు విచారణ 1929 జూలై 10న మొదలయింది. అంతకు పూర్వం యతీంద్రనాథ్ దాసను అరెస్టు చేసి 1929 జూన్ 4న లాహోర్ జైలుకు చేర్చారు. అక్కడ లాహోర్ కుట్ర కేసుకు సంబంధించిన ఖైదీలు అందరూ జైలు వ్యవస్థలో సంస్కరణ జరగాలని కోరి, తమ కోరికకు మద్దతుగా నిరాహార దీక్ష ఆరంభించారు. ఈ నిరాహార దీక్ష చాలా రోజులు సాగింది. . అతీంద్రనాథ్ దాస్ 63 రోజుల నిరాహార దీక్ష సాగించిన తర్వాత 1929 సెప్టెంబరు 13న అమరజీవి అయ్యా డు.
Image result for jatindra nath das

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments