Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గురు గోవింద్ సింగ్ జీవిత చరిత్ర - Guru Govind sing life story in Telugu

గురుగోవింద సింగ్ ప్రపంచమంతా ఖాల్సాపంథను ప్రస్తుతించాలి. తురకల దురాగతాలకు అంతం పలకాలి. హిందూ ధర్మం జాగృతం కావాలి” అన్న సందేశంలో హిందూ ధర...


గురుగోవింద సింగ్ ప్రపంచమంతా ఖాల్సాపంథను ప్రస్తుతించాలి. తురకల దురాగతాలకు అంతం పలకాలి. హిందూ ధర్మం జాగృతం కావాలి” అన్న సందేశంలో హిందూ ధర్మరక్షణకై సిక్కు పంథాను రూపొందించిన మహనీయుడు గురుగోవింద సింగ్. 
ఒక మహాపురుషుని బలిదానంతో కాని ఔరంగజేబు అత్యాచారాలకు పరిష్కారం దొరకదన్న తన తండ్రి మాటకు సమాధానంగా 9సం||ల గోవిందుడు నిబ్బరంగా, సూటిగా “మిమ్ములను మించిన మహాపురుషుడు వేరెవరు?” అన్నాడు. 
పరమత అసహనం షాజహాన్ కాలం నుంచి కొనసాగుతున్న సమయంలో గురుగోవిందుని జననం 1723 విక్రమశకం శుద్ధ సప్తమి (క్రీ.శ.1666)నాడు జరిగింది. తండ్రి బలిదానం తరువాత సంIIల వయస్సులో గురుగోవింద్ గురుపీఠాన్ని స్వీకరించాడు. తరువాతి 8సం||ల కాలం శాస్త్ర, శస్త్ర విద్యలు అభ్యసించాడు. తన శిష్యులకు కూడా శిక్షణకు వ్యవస్థను ఏర్పాటు చేశాడు. యుద్ధ నీతిలో ఆరితేరిన సేనను తయారు చేశాడు.
1689సంII ఏప్రియల్ నెలలో తన జీవితంలో మొదటియుద్ధంలో పాల్గొని సీంహీర ప్రాంత ఫకీర్ సయ్యద్ బహదూర్ షా సహకారంతో విజయం సాధించి ఆయనను ఘనంగా సత్కరించాడు. “మీలో ఎవరైనా ధర్మం కోసం తన ప్రాణమర్పించే వారున్నారా?” అని వైశాఖ పండుగ రోజున పరీక్షించి పరీక్షలో విజయవంతమైన ఐదుగురుని పంచప్యారాలుగా గౌరవించి దీక్షనిచ్చి, తానూ అదే దీక్ష స్వీకరించాడు. ఖాల్సాసు గురుస్థానంలో ఉంచి గురువైన తను సామాన్య ఖాల్సాగా వారిని సేవించాడు. వారితో కలసి భోజనం చేసి తనకున్న సర్వాధికారాలు వారికిచ్చివేశాడు. ఖాల్సా దీక్ష తీసుకున్న ప్రతి సిక్కుకు ఐదు బాహ్య చిహ్నాలను నిర్దేశించాడు. ఇవే పంచకకారాలు-కేశ్, కంగా, కడ, కచ్ఛ, కృపాళ్లు.

1700సం||లో జరిగిన యుద్ధంలో కేవలంఎనిమిది వేల సైన్యంతో విజయం సాధించి రోపార్ వరకు శత్రువులను తరిమికొట్టాడు. ఔరంగజేబుతో సంధికి ఇష్టపడక పోవడంతో జరిగిన తదుపరి ఘటనలలో గురుగోవింద్ చిన్న కొడుకులు జురావంసింగ్, ఫతేసింగ్ సజీవ సమాధి చేయబడ్డారు. ఆ సమయంలో కూడా ఆ చిన్నారులు ఎటువంటి రాజీలేకుండా బలిదానానికే సిద్ధపడ్డారు. చమకూర్ కోటలో జరిగిన యుద్ధంలో గురుగోవిందుని ఇద్దరు పెద్దకుమారులు కూడా చనిపోయారు. గురువు సైన్యం కొండరాణాలో ఉండగా, సర్హింద్ సుబేదార్ వజీర్ ఖాన్తో జరిగిన యుద్ధంలో వజీర్ ఖాన్ సైన్యం ఓడిపోయింది. ఈ యుద్ధంలోనే ఆనందపూర్ కోటనుండి ఇంతకు ముందు గురు శిష్య సంబంధం తెంచుకొని వెళ్ళిన 40మంది సికులు వీరోచితంగా పోరాడి తమ ప్రాణాలర్పించారు. వీరిని సిక్కులు ప్రతిరోజు ప్రార్థనలో “నలభైమంది ముక్తులు" అని శ్రద్ధగా స్మరిస్తారు.
ఔరంగజేబు మరణం తరువాత బహదూర్షా 'పేరుతో ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించిన ముఅజ్ఞమ్ గురుగోవిందుని ఆశీస్సులు కోరి, ఘనంగా సత్కరించాడు. సాందేడలో కలుసుకొన్న బైరాగి మాధవదాస్ గురుగోవిందుని మహాత్మునిగా గుర్తించి, గురువు నుండి కర్మ సందేశాన్ని గ్రహించాడు. గురువు ఉపదేశానికి ప్రభావితుడైన మాధవదాస్ తాను "ఐందా” అయినట్లు స్వయంగా ప్రకటించుకున్నాడు. తన సర్వస్వాన్ని గురువుగా అర్పించుకొన్న మాధవదాసీను గురుగోవింద్ తన వారసునిగా సంపాడు. నాందేడ్ చేరిన ఒక మాసంలోనే గురుగోవింద సింహుని జీవన లీల సమాప్తమైంది. 1708 అక్టోబరు 17న ఇక పఠాన్ సైనికుని కత్తిదాడి పర్యవసానంగా నాలుగు రోజుల తరువాత "వాహే గురుజీ కి ఫతే” అంటూ ప్రాణాలు విడిచాడు. నాందేడ్ లో ఆయన జ్ఞాపక చిహ్నం "హుజూర్ సాహిబో" ఒక అర్ధక్షేత్రం అయింది. భారతదేశ చరిత్రలో ఆయనకు అత్యంత శ్రేష్ఠస్థానం కల్పించబడింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments