Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

విప్లవ వీరుడు భగత్ సింగ్ తన ఉరి ప్రకటన తరువాత మొదటి ఉత్తరం

1930 అక్టోబరు 17న కేసు తీర్పు చెప్పారు. ఉరి శిక్ష పడింది. ఉరిశిక్ష పడిన తర్వాత ముల్తాన్ జైలులో బందీ అయిన బటుకేశ్వర దత్కు భగత్ సింగ్ రాసిన ...

1930 అక్టోబరు 17న కేసు తీర్పు చెప్పారు. ఉరి శిక్ష పడింది. ఉరిశిక్ష పడిన తర్వాత ముల్తాన్ జైలులో బందీ అయిన బటుకేశ్వర దత్కు భగత్ సింగ్ రాసిన ఉత్తరంలో ఈ గొప్ప విప్లవవీరుని అద్భుత సాహసంతో పాటు ఆదర్శాలపట్ల ఆయనకున్న అచంచల విశ్వాసం కూడా వ్యక్తమయింది. ఉత్తరం ఆయన ఇలా రాశాడు:
                                                                                                                 సెంట్రల్ జైలు, లాహోరు,
                                                                                                                  26 అక్టోబరు1930.

ప్రియ సోదరా,

నాకు శిక్ష వేశారు. ఉరి శిక్ష. ఈ జైలు కొట్లలో నేనే కాక ఉరితాడు కోసం ఎదురు చూసే నేరస్తులు ఎందరో ఉన్నారు. వీళ్ళు ఉరిశిక్ష నుండి ఎలాగైనా తప్పించమని దేవుని ప్రార్ధిస్తూ ఉన్నారు. కాని, వాళ్ళందరిలో అశయాల కోసం ఉరికంబం పైన వ్రేలాడే సౌభాగ్యం ప్రాప్తించే రోజుకోసం ఎంతో వేగిరపాటుతో ఎదురుచూచే వాణ్ణి నేనొక్కణే ననుకుంటాను. నేను మహా సంతోషంతో ఉరికంబమెక్కి, విప్లవకారులు తమ ఆశయాల కోసం ఎంత వీరత్వంతో తమ్ము తాము బలి ఇవ్వగలరో ప్రపంచానికి చూపుతాను. 
నాకు ఉరిశిక్ష పడితే నీకు యావజ్జీవ కారావాస శిక్ష పడింది. నీవు జీవించి ఉంటావు. నీవు జీవించి ఉంటూ విప్లవకారులు తమ ఆదర్శాల కోసం మృత్యువును వరించగలగడమే కాదు, జీవించి ఉండి ఎటువంటి విపత్తులనైనా ఎదుర్కోగలరని కూడా నిరూపించాలి, మృత్యువు ప్రాపంచికి కష్టాల నుండి ముక్తినిచ్చే సాధనం కాకూడదు. ఏ విప్లవకారులకై యాదృచ్ఛికంగా ఉరితాడు తప్పిందో, వాళ్ళు జీవించి ఉండి విప్లవకారులు తమ ఆదర్శాల కోసం ఉరికంబమెక్కడమే కాకుండా చిమ్మ చీకటితో నిండిన జైలు ఇరుకు కొట్లలో మగ్గి, కుళ్ళి, నికృష్టమైన అత్యాచారాలను సైతం సహించగలరని కూడా ప్రపంచానికి చూపాలి... 
                                                                                                                                     నీ భగత్ సింగ్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments