Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భగత్ సింగ్ ఉరి ఖరారైన తరువాత కూడా దేశ స్వాతంత్ర్యం గురించి భగత్ సింగ్ ఆలోచనలు ఈ ఉత్తరం తెలుపుతుంది

ఉరి శిక్ష పడిన తర్వాత కూడా భగత్ సింగ్ మనోలోకంలో భారత దేశానికి స్వాతంత్యం తెచ్చే ప్రణాళికలే తిరగాడుతూ ఉండినట్లు ఈ ఉత్తరద్వారా స్పష్టమవుతుం...

ఉరి శిక్ష పడిన తర్వాత కూడా భగత్ సింగ్ మనోలోకంలో భారత దేశానికి స్వాతంత్యం తెచ్చే ప్రణాళికలే తిరగాడుతూ ఉండినట్లు ఈ ఉత్తరద్వారా స్పష్టమవుతుంది. ఆయన తన మృత్యువును గురించి భయం లేకుండా ఉండటమే కాకుండా విప్లవకారులైన తన ఇతర సహచరులను విప్లవ కాగడా పట్టుకొని ముందుకు సాగండని ప్రేరేపిస్తూ వచ్చాడు కూడా. ఆ రోజుల్లోనే ఆయన ఈ భావననే వ్యక్తం చేస్తూ బటుకేశ్వర్ దత్ కు మరో ఉత్తరం కూడా రాశాడు. ఆ ఉత్తరం ఇలా ఉంది:
ప్రియమైన బటుక్ కు,
ఎంతో కాలందాకా కొనసాగిన తర్వాత ఇప్పుడు మన కేసు విచారణా ప్రహసనానికి తెర పడింది. న్యాయ నిర్ణేతలు తీర్పులు చెప్పేశారు. ఆ తీర్పుల సూచన మాకు పంపండం కూడా జరిగింది. నాకు ఉరి శిక్ష పడింది. లాహోర్ జైలులో ఉరిశిక్ష పడిన వాళ్ళను ఉంచే ఏ కోట్లలో కొద్ది రోజుల క్రితం నీవు నాతో సహా ఉండే వాడివో, నేను వాటిలోనే ఉంటున్నానని నీకు తెలుసు. ఈ ఉరి కొట్లలో మొత్తం నలభై అయిదుగురు మరణశిక్ష పడిన ఖైదీలున్నారు. వీళ్లు అనుక్షణమూ తమ ఆఖరు ఘడియకోసం ఎదురు చూస్తున్నారు.
దౌర్బాగ్యులైన ఈ ఖైదీలు ఉరితాడు నుండి తప్పించుకోవడానికి రాత్రింబవళ్ళు దేవుణ్ణి ప్రార్ధిస్తున్నారు. వీరిలో చాలామంది తాము చేసిన నేరానికి ఎంతగానో పశ్చాత్తాప పడిపోతున్నవాళ్ళు. హత భాగ్యులైన ఈ ఖైదీల మధ్య భగవంతుని పైన కాక తన ఆదర్శాల పైన అచంచల విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం కోసం మృత్యువును ఆలింగనం చేసుకోబోతున్న వ్యక్తుల్లో నేకణ్ణి. ఈ విషయం నాకు చాలా సంతృప్తినిస్తోంది. నీతో విడిపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ, ఈ ఎడబాటు వల్ల మన కొన్ని విశిష్టమైన లక్ష్యాలు నెరవేరుతాయి.ఉరికంబం పైన ప్రాణాలర్పించి నేను విప్లవకారుడు తన లక్ష్యాన్ని సాధించడానికి సంతోషంగా తన్నుతాను బలి ఇవ్వగలడని ప్రపంచానికి చూపుతాను. ఈ విధంగా నేనేమో చనిపోతాను. కానీ, నీవు మాత్రం యావజ్జీవ కారావాస శిక్ష అనుభవించేందుక జీవించి ఉంటావు. విప్లవకారుడు తన ఉద్దేశాల కోసం యావజ్జీవితము చిత్రహింసల ననుభవిస్తూ గడపగలడని నీవు రుజువు చేస్తావనే గట్టి నమ్మకం నాకుంది. మరణశిక్ష నీకు పడలేదు కాబట్టి నీవు జైలులో అనేక కష్టాలు సహిస్తూ దేన్నైతే ఆలింగనం చేసుకునేందుకు నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నానో, ఆ ఉరితాడే చిత్రహింసల నుండి తప్పించుకొనిపోయే ఉపాయం కాదని ప్రపంచానికి చూపించగలుగుతావు. బ్రతికి ఉండి జీవితాంతం కష్టాలు సహించే దృఢత్వం విప్లవకారులకుంటుంది.
                                                                                                                                    నీ భగత్ సింగ్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments