మహాత్మాగాంధీ జీవిత చరిత్ర-mahatma gandhi in telugu-Mahatma Gandhi Life in Telugu

megaminds
1
మహాత్మాగాంధీ జీవిత చరిత్ర
                                                     

మహాత్మా గాంధీ చరిత్ర

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత గా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు.  20వ శతాబ్దిలోని రాజకీయ నాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్(CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు.


బాల్యము, విద్య:
"మోహన్ దాస్ కరంచంద్ గాంధీ" 1869 అక్టోబరు 2 వ తేదీన (శుక్ల నామ సంవత్సరం బాధ్రపద బహుళ ద్వాదశి శనివారం) గుజరాత్ లోని పోర్ బందర్ లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. వారిది ఆచారములు బాగా పాటించే సభ్య కుటుంబము. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాస్త నిదానముగా ఉండే బాలుడు. చిన్నతనమునుండీ అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేశాడు. 13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూర్బాయితో వివాహము జరిగింది. వీరికి నలుగురు పిల్లలు (హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ). చదువులో గాంధీ మధ్యస్థమైన విద్యార్ధి. పోర్ బందర్ లోను, రాజ్‌కోట్ లోను ఆయన చదువు కొనసాగింది. 19 సంవత్సరాల వయసులో (1888 లో) న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్ళాడు. తల్లికిచ్చిన మాట ప్రకారము ఆయన మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. ఆయనకు బెర్నార్డ్ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడింది. అనేక మతాల పవిత్ర గ్రంధాలను చదివాడు. ఈ కాలములోనే ఆయన చదువూ, వ్యక్తిత్వమూ, ఆలోచనా సరళీ రూపు దిద్దుకొన్నాయి. 1891 లో ఆయన పట్టభద్రుడై భారతదేశానికి తిరిగివచ్చాడు. బొంబాయి లోను, రాజ్‌కోట్ లోను ఆయన చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు. 1893 లో దక్షిణాఫ్రికా లోని నాటల్‌ లో ఒక న్యాయవాద (లా) కంపెనీలో సంవత్సరము కాంట్రాక్టు లభించింది.

దక్షిణ ఆఫ్రికా ప్రవాసము:
ఒక సంవత్సరము పనిమీద వెళ్ళిన గాంధీ, దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు (1893 నుండి 1914 వరకు) గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు బండి మొదటి తరగతి లోంచి నెట్టివేయడం, హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి, ఎదుర్కొని పోరాడే పటిమను ఆయన నిదానంగా పెంచుకొన్నాడు. గాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికీ, ఆయన ఆలోచనా సరళి పరిపక్వము కావడానికీ, రాజకీయ విధివిధానాలు రూపు దిద్దుకోవడానికీ ఇది చాలా ముఖ్యమైన సమయము. ఒక విధముగా భారతదేశం లో నాయకత్వానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయి. భారతీయుల అభిప్రాయాలను కూడగట్టటమూ, అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడమూ ఆయన చేసిన మొదటి పని. 1894 లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. బిల్లు ఆగలేదుగానీ, ఆయన బాగా జనాదరణ సంపాదించాడు.

ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ఆయన ప్రచురించాడు. సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశాడు. ఇది ఆయనకు కేవలం పని సాధించుకొనే ఆయుధం కాదు. నిజాయితీ, అహింస, సౌభ్రాతృత్వము అనే సుగుణాలతో కూడిన జీవితం గడపడంలో ఇది ఒక పరిపూర్ణ భాగము. గనులలోని భారతీయ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి ఆయన మొదలుపెట్టిన సత్యాగ్రహము 7 సంవత్సరాలు సాగింది. 1913 లో వేలాది కార్మికులు చెరసాలలకు వెళ్ళారు. కష్టనష్టాలకు తట్టుకొని నిలచారు. చివరకు దక్షిణాఫ్రికా ప్రభుత్వము కొన్ని ముఖ్యమైన సంస్కరణలు చేపట్టింది. కానీ గాంధీకి బ్రిటిష్ వారిపై ద్వేషం లేదు. వారి న్యాయమైన విధానాలను ఆయన సమర్ధించాడు. బోయర్ యుద్ధకాలం లో (1899-1902) ఆయన తన పోరాటాన్ని ఆపి, వైద్యసేవా కార్యక్రమాలలో నిమగ్నుడైనాడు. ప్రభుత్వము ఆయన సేవలను గుర్తించి, పతకంతో సత్కరించింది. ఈ కాలంలో అనేక గ్రంథాలు చదవడం వలన, సమాజాన్ని అధ్యయనం చేయడం వలన ఆయన తత్వము ఎంతో పరిణతి చెందింది. లియో టాల్‌స్టాయ్ రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు(The Kingdom of God is Within You), జాన్ రస్కిన్ యొక్క అన్టూ దిలాస్ట్ (Unto the Last) అనే గ్రంథాలు ఆయనను బాగా ప్రభావితం చేశాయి. కాని, అన్నిటికంటే ఆయన ఆలోచనపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథము భగవద్గీత. గీతా పఠనం వల్ల ఆయనకు ఆత్మజ్ఞానము యొక్క ప్రాముఖ్యతా, నిష్కామ కర్మ విధానమూ వంటబట్టాయి. అన్ని మతాలూ దాదాపు ఒకే విషయాన్ని బోధిస్తున్నాయని కూడా ఆయన గ్రహించాడు. దక్షిణాఫ్రికాలో "ఫీనిక్స్ ఫార్మ్", "టాల్ స్టాయ్ ఫార్మ్" లలో ఆయన సామాజిక జీవనాన్నీ, సౌభ్రాతృత్వాన్నీ ప్రయోగాత్మకంగా అమలు చేశాడు. ఇక్కడ వ్యక్తులు స్వచ్ఛందంగా సీదా సాదా జీవితం గడిపేవారు - కోరికలకు కళ్ళెం వేయడమూ, ఉన్నదేదో నలుగురూ పంచుకోవడమూ, ప్రతి ఒక్కరూ శ్రమించడమూ, సేవా దృక్పథమూ, ఆధ్యాత్మిక దృక్కోణమూ ఈ జీవితంలో ప్రధానాంశాలు. గాంధీ స్వయంగా పంతులుగా, వంటవాడిగా, పాకీవాడిగా ఈ సహజీవన విధానంలో పాలు పంచుకొన్నాడు.

ఈ సమయంలోనే ఆయన అస్పృశ్యతకూ, కులవివక్షతకూ, మతవిద్వేషాలకూ ఎదురు నిలవడం బోధించాడు. క్లుప్తంగా చెప్పాలంటే సంపూర్ణమైన జీవితం గడపడం ఆయన మార్గము. పోరాటాలూ, సంస్కరణలూ ఆ జీవితంలో ఒక భాగము. ఒక అన్యాయాన్ని వ్యతిరేకించి, మరొక అన్యాయాన్ని సహించడం ఆయన దృష్టిలో నేరము. 1914 లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది.

భారతదేశములో పోరాటము ఆరంభ దశ:
భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగాడు. అప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలు, సమస్యలను పరిచయం చేశాడు. చాలామంది నాయకులకు ఇష్టం లేకున్నా గాంధీ మొదటి ప్రపంచ యుద్ధములో బ్రిటిష్ వారిని సమర్ధించి, సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించాడు. బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వేచ్ఛనూ, హక్కులనూ కోరుకొనేవారికి ఆ సామ్రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నదని ఆయన వాదం. బీహారు లోని బాగా వెనుకబడిన చంపారణ్ జిల్లాలో తెల్లదొరలు, వారి కామందులూ ఆహార పంటలు వదలి, నీలిమందు వంటి వాణిజ్యపంటలు పండించమని రైతులను నిర్బంధించేవారు. పండిన పంటకు చాలీచాలని మూల్యాన్ని ముట్టచెప్పేవారు. పేదరికమూ, దురాచారాలూ, మురికివాడలూ అక్కడ ప్రబలి ఉన్నాయి. ఆపైన అక్కడ తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారువారు పన్నులు పెంచారు. గుజరాత్ లోని ఖేడా లోనూ ఇదే పరిస్థితి. గాంధీ ఆ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి, 1918 లలో చంపారణ్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడమూ, చదువునూ సంస్కారాన్నీ పెంచడమూ, జాతి వివక్షతను విడనాడడమూ, అన్యాయాన్ని ఖండించడమూ ఈ సత్యాగ్రహంలో భాగము. ఈ కార్యక్రమంలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలచాడు. ఆయన నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలచి, జైలుకు తరలి వెళ్ళారు. సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై ఆయనను అరెస్టు చేసినపుడు జనంలో పెద్ద యెత్తున నిరసన పెల్లుబికింది. చివరకు ఒత్తిడికి తలొగ్గి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికీ, పన్నులు తగ్గించడానికీ ఒప్పందాలు కుదిరాయి. ఖైదీలు విడుదలయ్యారు. ఈ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో "బాపు" అనీ, "మహాత్ముడు" అనీ పిలుచుకొనసాగారు. గాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలూ, ఆమోదమూ లభించాయి.

1919 లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నేరమనే రౌలట్ చట్టానికి నిరసన పెల్లుబికినపుడు గాంధీ నడిపిన సత్యాగ్రహము ఆ చట్టాలకు అడ్డు కట్ట వేసింది. కాని ప్రజలలో ఆగ్రహం పెరిగి ఎదురుదాడులు మొదలైనప్పుడు ఆయన బాగా తీవ్రస్థాయిలో ఉన్న ఉద్యమాన్ని ఆపు చేసి, పరిహారంగా నిరాహారదీక్ష సలిపాడు. పట్టుబట్టి ఆ దాడులలో మరణించిన బ్రిటిష్ ప్రజలపట్ల సంతాప తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గము. ఏ విధమైన హింసయినా తప్పే. ఏప్రిల్ 13, 1919 న అమృత్ సర్, పంజాబు లోని జలియన్ వాలా బాగ్ లో సామాన్య జనులపై జరిగిన దారుణ మారణకాండలో 400 మంది నిరాయుధులైన భారతీయులు మరణించారు. ఫలితంగా సత్యాగ్రహము, అహింస అనే పోరాట విధానాలపై మిగిలినవారికి కాస్త నమ్మకం సడలగా, అవే సరైన మార్గాలని గాంధీకి మరింత దృఢంగా విశ్వాసం కుదిరింది. అంతే కాదు, భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం గాంధీలోనూ, సర్వత్రానూ ప్రబలమైంది. 1921 లో భారత జాతీయ కాంగ్రెస్ కు ఆయన తిరుగులేని నాయకునిగా గుర్తింపబడ్డాడు. కాంగ్రెసును పునర్వ్యవస్థీకరించి, తమ ధ్యేయము "స్వరాజ్యము" అని ప్రకటించాడు. వారి భావంలో స్వరాజ్యము అంటే పాలన మారటం కాదు. వ్యక్తికీ, మనసుకీ, ప్రభుత్వానికీ స్వరాజ్యము కావాలి. తరువాతి కాలంలో గాంధీ తమ పోరాటంలో మూడు ముఖ్యమైన అంశాలను జోడించాడు.


1921 లో ఆంధ్రలో గాంధీజీ:
"స్వదేశీ" - విదేశీ వస్తువులను బహిష్కరించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం,  విదేశీ విద్యనూ, బ్రిటిష్ సత్కారాలనూ తిరస్కరించడం. వీటివల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది. మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు. దేశ ఆర్ధిక వ్వవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది. ఆత్మాభిమానమూ, ఆత్మ విశ్వాసమూ వెల్లి విరిశాయి. శ్రమకు గౌరవాన్ని ఆపాదించడం ఆన్నింటికంటే ముఖ్యమైన ఫలితం.

"సహాయ నిరాకరణ" - ఏదయితే అన్యాయమో దానికి ఏ మాత్రమూ సహకరించకపోవడం. ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదు. వారి చట్టాలను ఆమోదించరాదు. ఈ ఉద్యమానికి మంచి స్పందన లభించింది. కాని 1922 లో ఉత్తరప్రదేశ్ చౌరీచౌరా లో ఉద్రేకాలు పెల్లుబికి హింస చెలరేగింది. ఉద్యమం అదుపు తప్పుతున్నదని గ్రహించి, గాంధీ దాన్ని వెంటనే నిలిపివేశాడు. "సమాజ దురాచార నిర్మూలన" - గాంధీ దృష్టిలో స్వాతంత్ర్యము అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం. అంటరానితనమున్నచోట, మురికివాడలున్నచోట, హిందూ ముస్లిములు తగవులాడుకొంటున్నచోట స్వాతంత్ర్య మున్నదనుకోవడంలో అర్ధం లేదు. గాంధీ ప్రవేశపెట్టిన ఈ ఆలోచనా సరళి వల్లనే భారతీయులు గర్వింపదగిన ఆధునిక భావాలూ, విలువలూ ఈరోజు సాధారణ జీవన సూత్రాలుగా పాదుకొన్నాయని మనం గ్రహించాలి.

1922 లో రెండు సంవత్సరాలు జైలులో గడిపాడు. ఈ కాలంలో కాంగ్రెసులో అతివాద, మితవాద వర్గాల మధ్య భేదాలు బలపడ్డాయి. హిందూ ముస్లిం వైషమ్యాలు కూడా తీవ్రం కాసాగాయి. తరువాత ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయన ప్రయత్నం చేశాడు. 1924 లో మూడు వారాల నిరాహారదీక్ష సాగించాడు. కాని వాటి ఫలితాలు కొంతవరకే లభించాయి. మద్యపానము, అంటరానితనం, నిరక్షరాస్యతలను నిర్మూలించే ఉద్యమాలలో ఆయన లీనమయ్యారు. 1927 లో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తరువాత మరలా గాంధీ స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను చేబట్టాడు. అందరికీ సర్ది చెప్పి, 1928 లో కలకత్తా కాంగ్రెసులో "స్వతంత్ర ప్రతిపత్తి" తీర్మానాన్ని ఆమోదింపజేశాడు. అందుకు బ్రిటిషు వారికి ఒక సంవత్సరం గడువు ఇచ్చాడు. ఆయినా ఫలితం శూన్యం. 1929 డిసెంబర్ 31 న లాహోరు లో భారత స్వతంత్ర పతాకం ఎగురవేయబడింది. 1930 జనవరి 26 ను స్వాతంత్ర్య దినంగా ప్రకటించాడు ఆ రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చును.

పతాకస్థాయి పోరాటము:
ఉప్పు సత్యాగ్రహం (దండియాత్ర), క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలు. ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి, పన్ను కట్టకుండా, సముద్రంలోంచి ఉప్పును తీసుకోవడమనే చిన్న సూత్రంపై ఇది ఆధారపడింది. మార్చి 21 నుండి ఏప్రిల్ 6 వరకు అహమ్మదాబాదు నుండి దండి వరకు 400 కి.మీ. పాదయాత్ర ఈ పోరాటంలో కలికితురాయి. దారిపొడవునా అభినందించేవారు, సన్మానించేవారు, పూజించేవారు - ఇది తరతరాలు తెలుసుకోవలసిన పెద్ద పండుగ. దారిలో చేరినవారితో దండి చేరుకొనే సరికి జనం వెల్లువలా పోటెత్తారు. దండిలోనే కాదు, దేశంలో ఊరూరా ఉప్పు సత్యాగ్రహ సంఘాలు ఏర్పడ్డాయి. మొత్తం దేశంలో 60,000 మంది చెరసాల పాలయ్యారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. 1931 లో గాంధీ-ఇర్విన్ ఒడంబడిక ప్రకారం ఉద్యమం ఆపారు. అందరినీ విడుదల చేశారు. 1932 లో లండను లో రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెసు ఏకైక ప్రతినిధిగా గాంధీ హాజరయ్యాడు. కాని ఆ సమావేశం గాంధీని, స్వాతంత్ర్యవాదులందరినీ నిరాశపరచింది. లార్డ్ ఇర్విన్ తరువాత వచ్చిన లార్డ్ విల్లింగ్డన్ మరలా స్వాతంత్ర్యోద్యమాన్ని పూర్తిగా అణచి వేయడానికి ప్రయత్నించాడు. 1932 లో నిమ్న కులాలవారినీ, ముస్లిము లనూ వేరుచేయడానికి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టారు.

ఇందుకు వ్యతిరేకంగా 6 రోజులు నిరాహార దీక్ష చేసి గాంధీ సమదృష్టితో పరిష్కారాన్ని తెచ్చేలా ఒత్తిడి చేశాడు. తరువాత అంటరానివారిగా చూడబడిన వర్గాలపట్ల సమాజ దృక్పథాన్నీ, వారి స్థితిగతులనూ మెరుగుపరచడానికి గాంధీ తీవ్రంగా కృషి చేశాడు. వారిని హరిజనులని పిలిచాడు. ఆత్మశోధనకూ, ఉద్యమస్ఫూర్తికీ 1933 మే 8 నుండి 21 రోజుల నిరాహారదీక్ష సాగించాడు. 1934 లో ఆయనపై మూడు హత్యాప్రయత్నాలు జరిగాయి. ఫెడరేషన్ పద్ధతిలో ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెసు సిద్ధమైనపుడు గాంధీ కాంగ్రెసుకు రాజీనామా చేశాడు. తన నాయకత్వంవల్ల కాంగ్రెసులోని వివిధ వర్గాల నాయకుల రాజకీయనాయకుల స్వేచ్ఛా ప్రచారానికి ఇబ్బంది రాకూడదనీ, స్వాతంత్ర్యమనే ప్రధాన లక్ష్యాన్నుంచి దృష్టి మరలకూడదనీ ఆయన ఉద్దేశము.

1936 లో లక్నో కాంగ్రెసు సమావేశం నాటికి మరలా గాంధీ ప్రధానపాత్ర తీసుకొన్నాడు. 1938 లో కాంగ్రెసు అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాస్ చంద్రబోసు తో గాంధీకి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. బోసుకు ప్రజాస్వామ్యంపైనా, అహింసపైనా పూర్తి విశ్వాసం లేదన్నది గాంధీ యొక్క ముఖ్యమైన అభ్యంతరం. అయినా బోసు మళ్ళీ రెండోసారి కాంగ్రెసు అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. తరువాత సంభవించిన తీవ్రసంక్షోభం కారణంగా బోసు కాంగ్రెసుకు దూరమయ్యాడు.
1939 లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. ప్రజా ప్రతినిధులను సంప్రదించకుండా భారతదేశాన్ని యుద్ధంలో ఇరికించారనీ, ఒకరి స్వాతంత్ర్యాన్ని కాలరాస్తూ, మరొకప్రక్క స్వేచ్ఛకోసం యుద్ధమని చెబుతున్నారనీ బ్రిటిషు విధానాన్ని కాంగ్రెసు వ్యతిరేకించింది. పార్లమెంటు నుండి కాంగ్రెసు వారంతా రాజీనామా చేశారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942 లో "క్విట్ ఇండియా" ఉద్యమం ప్రారంభమైంది.

"క్విట్ ఇండియా" ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది. ఊరేగింపులూ, అరెస్టులూ, హింసా పెద్ద ఎత్తున కొనసాగాయి. కాంగ్రెసులో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పొడచూపసాగాయి. ఈ సమయంలో గాంధీ చిన్నచిన్న హింసాత్మక ఘటనలున్నా ఉద్యమం ఆగదని దృఢంగా స్పష్టం చేశాడు. "భారత్ ఛోడో"- భారతదేశాన్ని వదలండి - అన్నది నినాదము. "కరో యా మరో" - చేస్తాం, లేదా చస్తాం - అన్నది అప్పటి నిశ్చయము. ప్రభుత్వము కూడా తీవ్రమైన అణచివేత విధానాన్ని చేపట్టింది.

1942 ఆగష్టు 9 న గాంధీతో బాటు పూర్తి కాంగ్రెసు కార్యవర్గం అరెస్టయ్యింది. గాంధీ రెండేళ్ళు పూణే జైలులో గడిపాడు. ఈ సమయంలోనే ఆయన కార్యదర్శి మాధవ దేశాయ్ మరణించాడు. ఆయన సహధర్మచారిణి కస్తూరిబాయి 18నెలల కారాగారవాసం తరువాత మరణించింది. గాంధీ ఆరోగ్యం బాగా క్షీణించింది. అనారోగ్య కారణాలవల్ల ఆయనను 1944 లో విడుదల చేశారు. బ్రిటిష్ వారు యుద్ధము తరువాత ఇతర నాయకులనూ, లక్ష పైగా ఉద్యమకారులనూ విడుదల చేశారు. క్రమంగా స్వాతంత్ర్యం ఇవ్వబడుతుందని అంగీకరించారు.

స్వాతంత్ర్య సాధన, దేశ విభజన:
1946 లో స్పష్టమైన బ్రిటిష్ కాబినెట్ మిషన్ ప్రతిపాదన చర్చకు వచ్చింది. కాని ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితిలోను అంగీకరించవద్దని గాంధీజీ పట్టుపట్టాడు. ముస్లిమ్ మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచన దేశవిభజనకు నాంది అని గాంధీజీ భయము. గాంధీజీ మాటను కాంగ్రెసు త్రోసిపుచ్చిన కొద్ది ఘటనలలో ఇది ఒకటి. కాబినెట్ మిషన్ ప్రతిపాదనను నిరాకరిస్తే అధికారం క్రమంగా ముస్లిమ్ లీగ్ చేతుల్లోకి జారుతుందని నెహ్రూ, సర్దార్ పటేల్ అభిప్రాయపడ్డారు. 1946-47 సమయంలో 5000 మంది హింసకు ఆహుతి అయ్యారు. హిందువులు, ముస్లిములు, సిక్కులు, క్రైస్తవులు ఇరుగు పొరుగులుగా ఉన్న దేశాన్ని మతప్రాతిపదికన విభజింపడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు. అలాంటి ఆలోచన సామాజికంగానూ, నైతికంగానూ,ఆధ్యాత్మికంగానూ కూడా గాంధీ తత్వానికి పెనుదెబ్బ. కాని ముస్లిమ్ లీగ్ నాయకులైన ముహమ్మద్ ఆలీ జిన్నా కి పశ్చిమ పంజాబు, సింధ్, బలూచిస్తాన్, తూర్పు బెంగాల్ లో మంచి ప్రజాదరణ ఉన్నది. కావాలంటే జిన్నాను ప్రధానమంత్రిగా చేసైనా దేశాన్ని ఐక్యంగా నిలపాలని గాంధీ ప్రగాఢ వాంఛ. కాని జిన్నా - "దేశ విభజనో, అంతర్గత యుద్ధమో తేల్చుకోండి" - అని హెచ్చరించాడు. చివరకు హిందూ - ముస్లిం కలహాలు ఆపాలంటే దేశవిభజన కంటే గత్యంతరము లేదని తక్కిన కాంగ్రెసు నాయకత్వము అంగీకరించింది. అయితే గాంధీ పట్ల ప్రజలకూ పార్టీ సభ్యులకూ ఉన్న ఆదరణ దృష్ట్యా గాంధీ సమ్మతించకపోతే ఏ నిర్ణయమూ తీసుకొనే అవకాశం లేదు. అంతర్గత యుద్ధాన్ని ఆపడానికి వేరే మార్గం లేదని గాంధీని ఒప్పించడానికి పటేల్ శతవిధాల ప్రయత్నించాడు. చివరకు హతాశుడైన గాంధీ ఒప్పుకొనక తప్పలేదు. కాని ఆయన పూర్తిగా కృంగిపోయాడు. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకొంటూ ఉండగా దేశవిభజన వల్ల విషణ్ణుడైన గాంధీమాత్రము కలకత్తా లో ఒక హరిజనవాడను శుభ్రముచేస్తూ గడిపాడు. ఆయన కలలన్నీ కూలిపోయిన సమయంలో హిందూ ముస్లిమ్ మత విద్వేషాలు పెచ్చరిల్లి ఆయనను మరింత శోకానికి గురిచేశాయి.

చివరి రోజులు:
స్వాతంత్ర్యానంతరం గాంధీ ప్రయత్నాలు హిందూ-ముస్లిం విద్వేషాలను నివారించడానికీ, ఆత్మశోధనకూ పరిమితమయ్యాయి. ప్రభుత్వం పరిస్థితిని అదుపు చేయలేని అసహాయ స్థితిలో పడింది. మొత్తం పోలీసు బలగాలు దేశ పశ్చిమప్రాంతానికి పంపబడ్డాయి. తూర్పు ప్రాంతంలో కల్లోలాలను అదుపు చేసే భారం గాంధీ పై పడింది. దేశవిభజనతో ముఖ్యంగా పంజాబు, బెంగాలు లలో పెద్దఎత్తున సంభవించిన వలసలవల్ల మత కలహాలు, మారణకాండలు ప్రజ్వరిల్లాయి. 1947లో కాశ్మీరు విషయమై భారత్ - పాకిస్తాన్ యుద్ధం తరువాత ఇంటా, బయటా పరిస్థితి మరింత క్షీణించింది. ముస్లిములందరినీ పాకిస్తాను పంపాలనీ, కలసి బ్రతకడం అసాధ్యమనీ వాదనలు నాయకుల స్థాయిలోనే వినిపించసాగాయి. ఈ పరిస్థితి గాంధీకి పిడుగుదెబ్బ వంటిది. దీనికి తోడు విభజన ఒప్పందం ప్రకారము పాకిస్తానుకు ఇవ్వవలసిని 55 కోట్లు రూపాయలను ఇవ్వడానికి భారత్ నిరాకరించింది. ఆ డబ్బు భారతదేశంపై యుద్ధానికి వాడబడుతుందని పటేల్ వంటి నాయకుల అభిప్రాయం. కాని అలా కాకుంటే పాకిస్తాన్ మరింత ఆందోళన చెందుతుందనీ, దేశాలమధ్య విరోధాలు ప్రబలి మతవిద్వేషాలు సరిహద్దులు దాటుతాయనీ, అంతర్యుద్ధానికి దారితీస్తుందనీ గాంధీ అభిప్రాయం. ఈ విషయమై ఆయన ఢిల్లీలో తన చివరి ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. ఆయన డిమాండ్లు రెండు - (1) మత హింస ఆగాలి (2) పాకిస్తానుకు 55 కోట్ల రూపాయలు ఇవ్వాలి. - ఎవరెంతగా ప్రాధేయపడినా ఆయన తన దీక్ష మానలేదు. చివరకు ప్రభుత్వం దిగివచ్చి పాకిస్తానుకు డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. హిందూ, ముస్లిమ్, సిక్కు వర్గాల నాయకులు సఖ్యంగా ఉండటానికి కట్టుబడి ఉన్నామని ఆయనవద్ద ప్రమాణం చేశారు. అప్పుడే ఆయన నిరాహార దీక్ష విరమించాడు. కాని ఈ మొత్తం వ్యవహారంలో గాంధీ పట్ల మతోన్మాదుల ద్వేషం బలపడింది. ఆయన పాకిస్తానుకూ, ముస్లిములకూ వత్తాసు పలుకుతున్నాడని హిందూమతంలోని తీవ్రవాదులూ, హిందువులకోసం ముస్లిము జాతీయతను బలిపెడుతున్నాడని ముస్లిములలోని తీవ్రవాదులూ ఉడికిపోయారు.

తనమీద హత్యాప్రయత్నం చేసినవారి గురించి గాంధీ:
1948 జనవరి 30 న గాడ్సే వారి బృందం గాంధీని హత్యచేయటానికి విఫల ప్రయత్నం చేసారు. అందులో వారి అనుచరుడు మదన్ లాల్ అరెస్టయినాడు. ఈ విషయం గాంధీకి తెలిసిన మీదట, మదన్ లాల్ ను ధైర్యం గల కుర్రాడని మెచ్చుకున్నాడట. ఆయన మాటలలోనే ఆయన ప్రతిస్పందన- "పిల్లలు!! వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. నేను పోయాక గుర్తుకు తెచ్చుకుంటారు, ఆ ముసలాడు సరిగానే చెప్పాడని". గాంధీ

మరణం,గాంధీ హత్య:
1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్ధన సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ "హే రామ్" అన్నాడని చెబుతారు. 1944 నుంచి 1948 వరకూ మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పని చేసిన వెంకిట కల్యాణం ఆయన హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నారు. ఆయన మాటల ప్రకారం"1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాంగాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చారు. అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి అఛాఛటోపాధ్యాయ గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది పక్కకు జరగండి అంటూ తోస్తూనే ఉంది. కానీ గాడ్సే పాయింట్ 380 ఏసీపీ, 606824 సీరియల్ నెంబర్ కలిగిన బెరెట్టా ఎం 1934 అనే మోడల్ సెమి-ఆటోమెటిక్ పిస్టల్‌తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చారు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలారు. కానీ ఆ సమయంలో బాపు ‘హేరాం’ అని ఉచ్ఛరించలేదు. గాంధీపై కాల్పులు జరిపిన గాడ్సే అనంతరం తనంతట తానే పోలీస్ అని కేక వేసి లొంగిపోయారు." గాంధీ అనుచరుల్లో ముఖ్యులైన శ్రీనందలాల్ మెహతా మాత్రం తాను ఇచ్చిన ఎఫ్‌ఐఆర్‌లో గాంధీ హేరాం అంటూ నేలకొరిగారనే సమాచారాన్ని ఇచ్చారు. గాడ్సే కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు బుల్లెట్లు పొట్ట నుంచి దూసుకెళ్లాయి.

ఢిల్లీ రాజఘాట్ లో అతని సమాధి మరియు స్మారక స్థలమైన రాజ్ ఘాట్ వద్ద ఈ మంత్రమే చెక్కి ఉన్నది. మహాత్ముని మరణాన్ని ప్రకటిస్తూ జవహర్ లాల్ నెహ్రూ రేడియోలో అన్న మాటలు: "మిత్రులారా, మన జీవితాల్లో వెలుగు అంతరించి, చీకటి అలుముకొన్నది. ఏమి చెప్పటానికీ నాకు మాటలు కరవయ్యాయి. మన జాతిపిత బాపూ ఎప్పటిలాగా మన కంటికి కన్పించడు. మనను ఓదార్చి, దారి చూపే పెద్దదిక్కు మనకు లేకుండా పోయాడు. నాకూ, కోట్లాది దేశప్రజలకూ ఇది తీరని శోకము".

గాంధీ గురించి గాడ్సే:
"గాంధీని నిలదీయటానికి ఎటువంటి చట్టపరమయిన అవకాశం లేదు. అతనికి సహజ మరణం పొందే అవకాశం ఇవ్వకూడదు అని నాకు అనిపించింది."అని గాడ్సే చెప్పాడు.[ఆధారం కోరబడినది]

గాంధీని తనెలా చంపాడో-గాడ్సేమాటలలో:
"పిస్టల్ నా కుడి అరచేతిలో ఇముడ్చుకొని, రెండు చేతులూ ముకుళించి 'నమస్తే' అన్నాను. నా ఎడమ చేతితో అడ్డంగా ఉన్న ఒక అమ్మాయిని పక్కకు తోసేసాను. ఆ తరువాత కాల్పులు జరిగాయి, తుపాకీ దానంతటే పేలిందనిపించింది. నేను రెండు సార్లు కాల్చానా, మూడు సార్లు కాల్చానా అన్నది నాకెప్పటికీ తెలియని విషయం. గాంధీ గుండు దెబ్బ తగలగానే 'హేరామ్' అని కిందపడిపొయ్యాడు. నేను తుపాకీని పైకెత్తి గట్టిగాపట్టుకొని నిలుచుని 'పోలీస్! పోలీస్!' అని అరవటం మొదలు పెట్టాను. నాకు కావలిసింది అందరూ, నేను ఈ పని ముందుగావేసుకొన్న పథకం ప్రకారం కావాలని చేసానని అనుకోవాలి, అంతేకాని, ఏదో క్షణికావేశంలో చేశాననుకోకూడదు. అక్కడనుంచి తప్పించుకుని పారిపోవటానికి పయత్నించాననిగానీ, తుపాకీ వదిలించుకొవలని అనుకుంటున్నానని గాని ఎవరూ అనుకోకూడదు. తుపాకీతోసహా పట్టుబడటమే నా అభిమతం. కానీ దాదాపు ఒక అర నిమిషందాకా, ఎవరూ కదలలేదు".

నాథూరామ్ గాడ్సే హత్యా స్థలంనుండి పారిపోయే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు, అతన్ని నిర్బంధించి తుగ్లక్ రోడ్ పోలీసు స్టేషను కు తీసుకొని వెళ్ళారు. అక్కడ ఉపపోలీస్ సూపరింటిండెంట్ సర్దార్ జస్వంత్ సింగ్ మొదటి సమాచార నివేదిక (First Information Report) తయారు చేసాడు. న్యాయ స్థానాలలో తగిన విచారణ అనంతరం నాథూరామ్ గాడ్సే ను అతనికి హత్యలో సహకరించిన నారాయణ ఆప్టేలను 1949 నవంబరు 15న ఉరి తీసారు.

విలువలు,పద్ధతులు,స్ఫూర్తి:
చరిత్రకారుడు ఆర్.బి.క్రీబ్ ప్రకారం మహాత్మా గాంధీ యొక్క ఆలోచనా విధానం కాలంతో పాటు పరిపక్వత చెందినది. లండను లో చదువుకునే సమయంలో నిజాయితీ , నిగ్రహం, పవిత్రత, శాకాహారం అలవర్చుకున్నాడు. భారతదేశం తిరిగి వచ్చాక న్యాయవాదిగా పనిలో వైఫల్యం పొందటంతో దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీ అక్కడ పాతికేళ్ళ పాటు వివిధ భారతీయేతర సంస్కృతుల ఆలోచనలను అర్ధంచేసుకున్నాడు. మహాత్మా గాంధీ పరిశీలనాత్మక మత వాతావరణంలో పెరిగాడు మరియు జీవితాంతం అనేక మతపరమైన సంప్రదాయాల నుంచి స్ఫూర్తి పొందాడు. గాంధీ తల్లికి జైను లతో ఉన్న పరిచయాల వలన జైనమత ఆలోచనలైన కరుణ, శాకాహారం, ఉపవాసం, స్వీయ క్రమశిక్షణ, ప్రతిజ్ఞ యొక్క ప్రాముఖ్యత విలువల ప్రభావం గాంధీ ఫై పడినది. ప్రారంభ దశలో ఉన్న జైనమత ప్రభావం తరువాతికాలంలో గాంధీ యొక్క అన్ని ఆలోచనలకు మూలం గా నిలిచాయి.

టాల్ స్టాయ్:
1908లో టాల్ స్టాయ్ రాసిన ఉత్తరంలో భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రేమ మరియు గుణాత్మక నిరోధకము అనే ఆయుధాల లో సాదించవచ్చని పేర్కొన్నారు.1909లో గాంధీ ఈ ఉత్తరం యొక్క గుజరాతి అనువాదం పత్రికలో ప్రచురించడానికి అనుమతి కోరుతూ టాల్ స్టాయ్ కి జాబు వ్రాశారు.ఈ విధంగా మొదలైన వీరి ఉత్తర ప్రత్యుతర సంభాషణ 1910లో టాల్ స్టాయ్ మరణించేవరకు కొనసాగింది. ఈ ఉత్తరాలలో ఆచరణాత్మక అహింసా విధానాల గురుంచి చర్చించారు.మహాత్మా గాంధీ స్వయంగా టాల్స్టాయ్ యొక్క శిష్యుడిగా పరిగణించుకొనేవారు.ఇద్దరు సామ్రాజ్యవాదం,హింసా విధానాలను వ్యతిరేకించారు.కానీ ఇరువురు రాజకీయ వ్యూహలపై తీవ్రంగా విభేదించారు.మహాత్మా గాంధీ మరియు హెర్మన్ కాలెన్ బాక్ టాల్స్టాయ్ ఫార్మ్ లో శిష్యులకు క్రమపద్ధతిలో అహింస తత్వశాస్త్రం పై శిక్షణ కొనసాగించారు.

సత్యాగ్రహం:
మహాత్మా గాంధీ తన జీవితాన్ని సత్యశోధనకి అంకితం చేశారు. తను చేసిన తప్పులనుంచి నేర్చుకోవటం మరియు అయన సత్యంతో చేసిన ప్రయోగాలు సత్యశోధనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. గాంధీ గారి ఆత్మకథ పేరు "సత్యశోధన" (ఆంగ్లంలో The Story of My Experiments with Truth). బ్రూస్ వాట్సన్ ప్రకారం గాంధీజీ గారి సత్యాగ్రహానికి మూలాలు వైదిక ఆదర్శాలైన ఆత్మ సాక్ష్యాత్కారం మరియు బౌద్ద మరియు జైన విలువలైన అహింస, శాకాహారం, విశ్వవ్యాప్తమైన ప్రేమ. అలాగే క్రిస్టియన్-ముస్లిం విలువలైన సమానత్వం, విస్వసోధరభావం, ఒక చెంపపై కొడితే మరొక చెంప చూపెట్టడం కూడా సత్యాగ్రహానికి మూలాలు. వ్యక్తి యొక్క అతి ముఖ్యమైన పోరాటం తన సొంత భయాలు మరియు అభద్రతాభావాలను అధిగమించడంగా మహాత్మా గాంధీ పేర్కొన్నారు. గాంధీజీ తన విలువల సారంశాన్ని మొదట "దేవుడు సత్యం" గా పేర్కొన్నప్పటికి, తరువాత "సత్యమే దేవుడు" తన తత్వంగా పేర్కొన్నారు.

సత్యాగ్రహం యొక్క ముఖ్యఉద్దేశం సమాజంలోని వైరుధ్యాలు తొలగించటానికి వైరుధ్యం కలిగించేవారికి హాని చేయకుండా వారిలో మార్పు తేవటం ద్వారా వారి నైతికస్తాయిని పెంచడం. సత్యాగ్రహాన్ని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తన ప్రసిద్ధ ప్రసంగం"నాకు ఒక కలవుంది(ఆంగ్లం :I Have a Dream)" లో "ఆత్మ శక్తి" గా పేర్కొన్నారు. సామాన్యునికి సత్యాగ్రహం భుజబలం కన్నా గొప్ప నైతిక శక్తిని ఇస్తుంది. సత్యాగ్రహానికి "సార్వత్రిక శక్తి" గా కూడా వర్ణించవచ్చు. సత్యాగ్రహానికి అందరు సమానమే, బంధువులు మరియు అపరిచితులు,యువకులు మరియు వయసులో పెద్దవారు, స్త్రీ పురుషులు, స్నేహితులు మరియు శత్రువులు మధ్య అందరు సత్యాగ్హానికి సమానమే."
గాంధీజీ ఇలా రాశారు "అసహనం, ఆటవికత, ఒత్తిడి ఉండకుడదు. నిజమైన ప్రజాస్వామిక స్పూర్తి తీసుకురావటానికి అసహనం పనికిరాదు. అసహనం కార్యాచరణ లో వ్యక్తి నమ్మకాన్ని ఒమ్ముచేస్తుంది." "దురావస్త చట్టం (ఆంగ్లం: law of suffering)" అనే సిద్ధాంతం ప్రకారం ఓర్పుతొ కూడిన బాధ, బాధకు అంతం. అంతంలో వ్యక్తి లేదా సమాజం పురోగతిని సాధిస్తుంది. సత్యాగ్రహం ఆయుధంగా పోరాడిన శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ ఉద్యమాలు ఈ సిద్ధాంతం పై నడుపబడినాయి. సత్యాగ్రహంలో సహాయ నిరాకరణ అనగా సత్యం మరియు న్యాయంతో ప్రత్యర్ధి సహకారం సాధించటం.

అహింస:
అహింసను కనిపెట్టినది గాంధీజీ కాదుగాని, అహింసను భారీస్థాయిలో రాజకీయాలలో మొదట ఉపయోగించిన వ్క్యక్తి గాంధీజీ. అహింస సిద్ధాంతం భారతీయ అధ్యాత్మిక ఆలోచనా విధానంలోను మరియు హిందు,బౌద్ధ,జైన,యూదు,క్రిస్తవ మతాలలో పలుమార్లు పేర్కొనబడింది. గాంధిజి తన విలువలను మరియు జీవన విధానాన్ని తన ఆత్మకధలో వివరించారు. అహింసను ఆచరించాలంటే గొప్ప నమ్మకం మరియు ధైర్యం కావాలని అయితే ఈవి అందరిలో లేవని గ్రహించారు. అందుకే అహింస అందరికి పాటించటం కష్టం అని ,ముఖ్యంగా పిరికితనాన్ని కప్పివుంచటానికి వాడరాదు అని, ఒకవేళ పిరికితనం మరియు హింస రెండింటిలో ఒకటి ఎన్నుకోవలసినప్పుడు తను హింసను ఎన్నుకోవలసిందిగా సలహా ఇస్తానన్నారు.హింసా విధానాల ద్వారా స్వాతంత్ర్యం కోసం చేసిన వారి ప్రయత్నాలను నిరసించడంతో గాంధీజీ వారి కోపానికిగురయ్యారు. ముఖ్యంగా భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్,ఉదమ్ సింగ్ యొక్క ఉరి శిక్షలకు వ్యతిరేకంగా నిరసన చేయలేదని కొన్ని వర్గాలు నిందించాయి.

ఈ విమర్శలకు జవాబుగా గాంధీజీ ఏమన్నారంటే "బ్రిటీషు వారితో ఆయుధాలు లేకుండా పోరాడాలి అని చెబితే ప్రజలు ఆచరించారు. కానీ ఇప్పుడు వారే హిందూ-ముస్లిం ఘర్షణలకు అహింస పనికిరాదు అని, అందుకు ప్రతి ఒక్కరు స్వీయ రక్షణ కోసం ఆయుధం చేతబట్టాలి అంటున్నారు." 

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం, అలాగే EPF E-Nominee, jana aoushadi medical shops ఎలా అప్లై చేసుకోవాలి, Types Insurance, Types Loans  ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..


At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

1 Comments
Post a Comment
To Top