Page Nav

HIDE

Gradient Skin

Gradient_Skin

Pages

JUST IN

latest

Vinoba Bhave life story - వినోబాభావే జీవిత చరిత్ర - megaminds

భూదాన ఉధ్యమ నిర్మాత వినోబాభావే. సెప్టెంబర్ 11,1895 న పుట్టినపుడు తల్లితండ్రులు పెట్టినపేరు వినాయక నరహరిభావే. మహారాష్ట్రలోని కొలాబా జిల్లాల...

భూదాన ఉధ్యమ నిర్మాత వినోబాభావే. సెప్టెంబర్ 11,1895 న పుట్టినపుడు తల్లితండ్రులు పెట్టినపేరు వినాయక నరహరిభావే. మహారాష్ట్రలోని కొలాబా జిల్లాలో పుట్టిన ఆయన గాంధీజీ అనుచరుడిగా సబర్మతీ ఆశ్రమంలో చేరిన తరువాత ఆశ్రమంలో పెట్టిన పేరు వినోబాభావే.

బాల్యం నుండే ధైవభక్తి కలిగినవారు. మరాఠ సంత్ ల బోదనలు ఆయన్ని ప్రభావితం చేశాయి. జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవలన్న ఆలోచన కొడుక్కి కలిగితే అంగీకరించే తల్లితంద్రులుండరు, కాని వినోబా సన్యాసదీక్ష్ నిర్ణయాన్ని తల్లి రుక్మిణీదేవి విని అభ్యంతర పెట్టలేదు.
దేశంలోని స్వాతంత్ర్య సంగ్రామ ప్రభావం వినోబాభావే మీద ఉంది. ఒకవైపు ఆధ్యాత్మికమార్గము, మరోవైపు స్వాతంత్ర్య పోరాటంలోనూ వారున్నారు. ఇంటర్ పరీక్షలు రాయకుండా కాశీ క్షేత్రం చేరాడు. అక్కడి నుండి హిమాలయాలు చేరి ధ్యానం చేయవచ్చనుకున్నారు కానీ కాశీ విశ్వవిద్యాలయంలో గాంధీజీ ప్రసంగం ఆయన జీవితంను మార్చేశాయి.గాంధీజీ అహింస, సత్యాగ్రహ సిద్దాంతాలు నచ్చి గాంధీజీ వెంట అహ్మదాబాద్ ఆశ్రమానికి చేరారు. అక్కడి నుండి గాంధీజీ పంపగా వార్ధా ఆశ్రమంకు వెళ్ళారు. ఆ ఆశ్రమం ను‌ వినోబానే నడిపారు.
దేశ స్వాతంత్ర్యం వచ్చింది. గాంధీజీ మరణం తరువాత వినోబా కొత్త బాధ్యతలు చేపట్టారు. సర్వోదయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ ఉద్యమం నుండి వచ్చిన ఆలోచనే భూదాన్.
హైదరాబాదు సమీపంలో శివరామపల్లి గ్రామంలో స్వచ్ఛందంగా భూములను దానము చేసి పేదలకు భూములను ఇవ్వాలని వినోబా చేసిన తక్షణమే లభించిన స్పందన నుండి పుట్టిందే భూదాన ఉద్యమం. ప్రభుత్వాలు అమలుచేసిన భూసంస్కరణల కన్నా కూడా ఉత్తమమైనది భూదాన ఉద్యమం.

నాటి నుండి మూడు దశాబ్దాల పాటు దేశమంతా పర్యటించారు వినోబా. గాంధీజీ తన నైతిక శక్తితో కాంగ్రెస్ ని‌ నడిపించిన రీతిలోనే వినోబాభావే తన నైతిక బలాన్ని ప్రభుత్వాల‌మీద ప్రయోగించారు. గాంధీజీ లానే ఉపవాస ఆయుదమే వినోబాభావే ప్రయోగించారు.
అధికారంలో ఉన్న పార్టీలు తమ నిర్ణయాలపట్ల విలువనిచ్చేవి. దేశ పర్యటనలో ప్రజలకు దగ్గరై, వారి సమస్యలు అర్థం చేసుకొని పరిష్కరించేవారు. 1982 వచ్చేసరికి వినోబాభావే గారికి 87 సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పటికే ఆయన దేశం మొత్తం పర్యటన చేసారు. అలా నడిచి వారి ఆరోగ్యం క్షీణించింది.
ఒకప్పుడు అతివేగంగా పడిన ఆయన అడుగులు ఆశ్రమం లో అతికష్టము మీద కదులుతున్నాయి. కాళ్ళు వాస్తున్నాయి. ఆగష్టు లో వినోబాభావే గుండెకు పరీక్ష నిర్వహించారు. ఆయన గుండె బలహీనంగా ఉందని, పేస్ మేకర్ ఏర్పాటు చేయాలని వైధ్యులు చెప్పారు. అయినా వారు నిరాకరించారు.
తానింక బ్రతికి సాదించల్సింది‌ ఏముంది? అని ఎదురు ప్రశ్న వేస్తుండేవారు వినోబాభావే. ఆయన శరీరం బలహీనంగా ఉన్నప్పటికీ వారి మోహము లో వెలుగుతగ్గలేదు అనేక సంవత్సరాలు ఆధ్యాత్మికచింతనలో ఉండటం మూలానా మొహములో కాంతి కనిపించేది. వైద్యులు కూడా ఆ వెలుగు చూసి ఆశ్చర్యపోయేవారు. ఆయన జీవితాంతం భగవద్గీత ను పఠించారు. ఆత్మకు చావులేదని కృష్ణ భగవానుడు చెప్పిన విషయాలు ఆశ్రమవాసులకు నిత్యం చెప్పేవారు.
డెబ్బై ఏళ్ల వయస్సు పైబడిన తర్వాత మనిషి ఈలోకము వదిలివెళ్ళడానికి సిద్దంగా ఉండాలనేవారు. అప్పుడప్పుడు వారికి గుండేపోటు వచ్చేది కానీ వెంటనే మాములుగా అయ్యేవారు‌ అందరూ ఇలా ఆధ్యాత్మిక చింతన లో ఉండటం వలన ఇలా‌ మాములుగా అయ్యారు అనుకునేవారు.

ఇక నా సమయం ముగిసింది. ప్రశాంతంగా మరణించనివ్వండి. అంటూ మందులే కాదు ఆహారం మంచినీరు కూడా తీసుకోవడం మానేశారు వినోబాభావే. ఎంత నచ్చచెప్పినా వినోబాభావే వినడంలేదని తెలిసి ప్రదాని ఇందిరా గాంధీ‌ స్వయంగా ఆశ్రమానికి వచ్చింది.

ఇలా‌‌‌ కొన్ని రోజులు గడిచాక ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చాయి అప్పుడు వారు రామ‌నామ సంకీర్తన లో నిమగ్నమై ఉన్నారు అలా ఒక నాలుగురోజులు గడిచాక నవంబర్ 14 న ఉదయం 9:30 గంటలకు వారి ప్రాణాలు రాముడిలో ఐక్యము అయ్యాయి. వారు ఇంకెన్నో ఈ దేశానికి చేశారు ఇందులో మీకు కుదించి చెప్పడం జరిగినది. రాబోయే తరానికి వీరిలాంటి వారి జీవితాలు మార్గదర్శకాలు కావాలి. జైహింద్.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..