Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అంతర్జాతీయ యోగ దినోత్సవం లో అందరం పాల్గొందాం.

(ఒకాయన వీధిమీద తట్ట మోసుకుని, అరుస్తూ వెళ్తూంటాడు....) ఆటలమ్మ ఆటలూ....కామన్వెల్త్ ఆటలూ..... ఆటలమ్మ ఆటలూ ....కామన్వెల్త్ ఆటలూ..... (తలుపు ద...

(ఒకాయన వీధిమీద తట్ట మోసుకుని, అరుస్తూ వెళ్తూంటాడు....)
ఆటలమ్మ ఆటలూ....కామన్వెల్త్ ఆటలూ.....
ఆటలమ్మ ఆటలూ ....కామన్వెల్త్ ఆటలూ.....

(తలుపు దగ్గర నిలుచున్న ఓకావిడ)
ఓ అబ్బాయ్ ఇలా రా....

అమ్మా కాస్త తట్ట దించమ్మా.....
(తట్ట దించడంలో సాయ పడుతుంది)
హమ్మయ్య....బరువు మోయలేకపోతున్నానంటే నమ్మండి....చాలా బరువమ్మా...

అంత బరువా.......!!
బరువంటే మామూలు బరువా అమ్మా....ఇది ఇండియా పరువు మరి....
ఇంతకీ ఏమేం ఉన్నాయి నీ దగ్గర....?
అన్నీ ఉన్నాయమ్మా....వివాదాలున్నాయి....వినోదాలున్నాయి....ఏమేం కావాలో అన్నీ ఉన్నాయమ్మా....
కూలిపోయిన పై కప్పులు....కుళ్లిపోయిన టాయలెట్లూ....బోల్డంత బురద, మురికి....కావలసినన్ని కండోమ్ వెండింగ్ మెషిన్లూ....
(ఒక్కోటీ చూపిస్తాడు) 
ఛీ...ఛీ ...కంపు కంపు ....తీసిపారెయ్ .....అసహ్యంగానూ....
అసహ్యం కాదమ్మా ....అంతర్జాతీయ స్థాయి అరేంజ్ మెంట్లు ....దేశ విదేశాల ఆటగాళ్ల ముందు మన పరువేంటో...ప్రతిష్ఠ ఏమిటో చూపించాలి కదమ్మా....ఎంత బాగా డిజార్గనైజ్ చేయగలమో ప్రాక్టికల్ గా పర్ ఫెక్ట్ గా చూపించాలి కదమ్మా.....
ఏమిటీ....ఈ దరిద్రాన్ని చూపిస్తే మనకు పేరూ ప్రతిష్ఠలా....!!
అలా అనుకోకండమ్మా...ఆతిథ్యం ఇది....ఇంటర్నేషనల్ లెవెల్ ఆతిథ్యం....మనకు ప్రపంచమంతా ఓ పాయిఖానాయే....ఆ పనిని ఎక్కడ బడితే అక్కడ చేయొచ్చు....కళాత్మకంగా కడుపు బరువు తీర్చుకోవచ్చు.....అదీ మన సంస్కృతి....మెట్లు మలుపు తిరిగిన ప్రతి చోటా పాన్ ఉమ్మేసి పెయింటింగ్స్ వేసేయొచ్చు...అదీ మన సభ్యత...టూరిస్టులు రెస్టు తీసుకునే పరుపులపై కుక్కలు తమ కాళ్లతో సంతకాలు చేయొచ్చు...అదీ మన ధర్మం.....
ఏమిటీ...అదేం ధర్మం...?
ఏమిటమ్మా మీరు మరీనూ....ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు......సకల జీవ జంతువుల్లో పరమాత్ముడున్నాడు...కాబట్టి కుక్కనూ మనిషినీ ఒకేలా చూడగలడగమే అసలైన గొప్పదనం...కాదంటారా...మన రుషులూ మహాత్ములూ చెప్పేది అదే కదమ్మా....అందుకే పక్క మీదకి కుక్కలు వస్తాయి....వచ్చి తీరతాయి...

ఖర్మ ఖర్మ ....
చూడండమ్మా ...మనం పాకిస్తాన్ కన్నా ఎంత గొప్ప వాళ్లమో చెప్పడానికే ఈ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహిస్తున్నామమ్మా...
ఆటలాడిస్తే పాకిస్తాన్ కన్నా గొప్ప వాళ్లమైపోతామా.....?
అవునమ్మా...వాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రమే చేయగలరు...మనం ఇంకా ఎన్నో ఎన్నో ఫిక్స్ చేయగలం మరి....అంతెందుకు ....వాళ్ల ప్రెసిడెంట్ జర్దారీని మిస్టర్ టెన్ పర్సెంట్ అంటారు.....ఎందుకంటే ఆయన ఏ పని చేసినా టెన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాడు....మనం మాత్రం అలా కాదమ్మా....హండ్రెడ్ పర్సెంట్....
అంటే హండ్రెడ్ పర్సెంట్ ఖర్చు చేస్తామన్న మాట....
కాదు కాదమ్మా ....హండ్రెడ్ పర్సెంట్ మిగుల్చుకుంటాం.....
హేవిటీ.....?
అంతాచ్చర్య పోకండమ్మా.....అదిగో అక్కడ గేమ్స్ విలేజీ కనిపిస్తుందా....
లేదు....
అల్లక్కడ స్టేడియం కనిపిస్తోందా....?
స్టేడియమేమిటి నా బొంద ...అక్కడేమీ లేదు....
అదిగో ...దూరాన బ్రహ్మాండమైన ఇన్ డోర్ స్టేడియం కనిపిస్తోందా....?
ఎక్కడా ....ఏమీ కనిపించడం లేదు....
మరి ఫుడ్ కోర్టు...?
లేదు...
ఫైవ్ స్టార్ అకామిడేషన్?
లేదు....
అదేమిటమ్మా.......అంతా మాయ ...విష్ణు మాయ....జగం మిథ్య అంటాం కదమ్మా....!.ఇదీ అలాంటిదే మరీ.....ఉందనుకుంటే ఉంటుంది....లేదనుకుంటే లేదు....అనుకుంటే కబాడీ....లేకపోతే కల్మాడీ.....
బాగుంది......అక్కడేమీ లేకుండా గేమ్స్ ఎలా ఆడిస్తాం....?
అక్కడే ఉందమ్మా కిటుకూ.....కామన్ గా .....వెల్త్ మనకీ....గేమ్స్ వాళ్లకీ.....
మరి జనం ఊరుకుంటారా.....?
కంగారెందుకమ్మా ....టాపిక్ డైవర్ట్ చేస్తాం....ఇంకో కాంట్రవర్సీ పుట్టించేద్దాం.....ఐతే ఐపీ లేక పోతే ఐపీఎల్ ......ఏదో ఒకటి రాకపోదు....మనల్ని రక్షించకపోదు.....జనం మతిమరుపే మన మహాభాగ్యం కదమ్మా......

(ఆమె కొయ్యబారి చూస్తుంది)
వెనక నుంచి .....బాక్ గ్రౌండ్ లో ....
ఇండియా ...ఇన్ క్రెడిబుల్ ఇండియా ....
అన్న టూరిజం డిపార్ట్ మెంట్ సిగ్నేచర్ ట్యూన్ వస్తుంది....

Image result for modi yoga pic
అలాంటి పరిస్తితుల నుండి నేడు ప్రపంచం మొత్తం యోగా దినోత్సవం జరుపుకునే విధంగా మరియు ప్రతి భారతీయుడు గర్వంగా మాది భారతదేశం అని చెప్పుకునే విధంగా మనదేశం నిజంగా ఈ నాలుగేళ్ళలో దూసుకుపోతుంది. కాబట్టి అందరం మన దేశ ప్రతిష్టను పెంచుదాం యోగా దినోత్సవాలలో పాల్గొందాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు సహకరిద్దాం జై హింద్.

No comments