Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఈశాన్య రాష్ట్రాల అభివృద్దిలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాత్ర - megamindsindia

త్రిపుర తో సహా ఈశాన్య రాష్ట్రాలలో ఆరెస్సెస్  1990 దశాబ్దపు మొదటి భాగం నుండి చురుగ్గా పనిచేయడం ప్రారంభించింది. అందుకు నిర్దిష్టమైన కా...

త్రిపుర తో సహా ఈశాన్య రాష్ట్రాలలో ఆరెస్సెస్  1990 దశాబ్దపు మొదటి భాగం నుండి చురుగ్గా పనిచేయడం ప్రారంభించింది. అందుకు నిర్దిష్టమైన కారణాలున్నాయి. ' సప్త సోదరీమణులు' అని పిలవబడే ఈ రాష్ట్రాలు రాజకీయంగా భారతదేశంలో భాగంగా ఉన్నా , 1947 - 77 మధ్య వాటిలో ప్రత్యేకతా మనస్తత్వం దశలుదశలుగా పెరుగుతూ రావడం చారిత్రక సత్యం. ఈ  మొదట కనబడింది నాగాలాండ్ లో. 1937 - 38 లో బ్రిటిష్ వాళ్ళు బర్మా ను భారత్ నుండి విడగొట్టినపుడు గీసిన  సరిహద్దు రేఖ  నాగా ప్రజలను రెండు దేశాలలో  ఉండేలా చేసింది. అలాగా నాగాలు రెండు విభిన్న జాతీయతలను పొందినా, వారి మధ్య సంస్కృతి, సంబంధాలు ఏమాత్రం దెబ్బ తినకుండా కొనసాగాయి. అంటే ఇరువురి నడుమ సరిహద్దు రేఖకు ఏ అర్థమూలేని స్థితి. ఇదే పరిస్థితి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగి నాగా హిల్ డిస్ట్రిక్ట్ లోని జనం తమ జిల్లాలో భాగమైన అస్సాం రాష్ట్రానికి చెందిన ఇతర ప్రజలనుండి దూరంగానే ఉండి బర్మా లో ఉన్న నాగాలతోనే ఎక్కువ సంబంధబాంధవ్యాలను కొనసాగించారు. ఇది ఏస్థాయిలో ఉండేదంటే , స్వాతంత్రం వచ్చి ఐదారేళ్ళయినా నాగా ప్రదేశాలు భారత్ లో ఉన్నయా లేవా అనే విషయమై ప్రధాని నెహ్రూ కే అనుమానమొచ్చింది. దాంతో నెహ్రూ 1953 లో కొహిమా సందర్శించినపుడు బర్మా ప్రధాని  ఉ ను గారినీ వెంట తీసుకెళ్ళారు. నాగాలూ అంతే, నెహ్రూ ను తమ ప్రధాని అని గుర్తించనేలేదు. వాళ్ళకు నెహ్రూ ఎక్కడినుండో వచ్చిన ఒక విదేశీయుడే. 
  ఇదే సమయానికి నాగా ప్రదేశాలలో క్రైస్తవ మిషనరీల  ప్రభావం తీవ్రగతిలో పెరగసాగింది. నాగాలలో ముందే ఉన్న ప్రత్యేకతా భావం దీంతో ప్రమాదకర స్థాయికి పెరిగింది. ఇదంతా  ఆరెస్సెస్ గమనించింది. పాకిస్తాన్ పేరుతో  ఇస్లాం వల్ల తూర్పు, పశ్చిమాలలో  విశాల భూభాగాలను దేశం కోల్పోవడం పట్ల బాధతో ఉన్న ఆరెస్సెస్ కు , ఇక క్రైస్తవం  ద్వారా  దేశం మరింత భూభాగాన్ని కోల్పోవడం సహజంగానే ఆమోదం కాలేదు. అందులోనూ నాగా ప్రత్యేకతావాదులకు  చైనీయులు పాకీలు  స్నేహ హస్తం చాస్తుంటే, వారికి వ్యతిరేకంగా మన కేంద్ర ప్రభుత్వాలు సరైన యోజనలను రూపొందించడంలో విఫలమై పరిస్థితి చేజారక ముందే నాగాలతో సహా మొత్తం ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో  జాతీయ సమైక్యత కలగజేయడానికి, తద్వారా దేశం మళ్ళీమళ్ళీ  కాకుండా చూడటానికి ఆరెస్సెస్ ముందుకొచ్చింది. ప్రజల  సామాజిక, ఆర్థిక సమస్యలకు స్పందించే , ప్రకృతి వైపరీత్యాల సమయంలో వారికి సహాయపడటం ద్వారా ఈశాన్య ప్రజలను మిగిలిన భారత భూభాగంలోని ప్రజలతో కలిపి ఉంచే చిన్నచిన్న కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 
అస్సామీ అస్తిత్వానికి తగిలిన దెబ్బ : ఆరెస్సెస్ కార్యక్రమాలకు పెద్ద సవాళ్ళు ఎదురయింది 1980దశకపు పూర్వార్ధంలో. ఏ సమస్యలేకుండా ఉన్న ప్రశాంత అస్సాం ఉన్నట్టుండి అట్టుడికిపోయింది. దశాబ్దం నుండి బంగ్లాదేశ వలసదారులు నిరంతరంగా చొరబడటంతో అస్సాం సరిహద్దు జిల్లాలలో తీవ్రమైన ఆర్థిక, ధార్మిక మరియు జనాభా సమస్యలను సృష్టించారు. అతి తక్కువ జీతానికి పనిచేయడానికి తయారైన వలసదారులు స్థానికుల బ్రతుకుదెరువుపై దెబ్బకొట్టడంతోబాటు  అస్సామీ హిందూ ప్రదేశాలను  బంగ్లా ముస్లిం ప్రదేశాలుగా మార్చేశారు. ఇది అస్సామీ అస్తిత్వానికి తగిలిన దెబ్బ. సహజంగానే దీనికి వ్యతిరేకంగా లేచి నిలబడ్డ అస్సామీ విద్యార్థులు అయిదు సంవత్సరాల పాటు రాష్ట్రమంతటా ఉద్యమం చేశారు.  అస్సాం అస్సాంగానే ఉండాలనే వారి నినాదం ' ఆశోమ్ మోరీల థోకేనో కోన్? ఆశోమ్ థోకే మోరే కోన్? ' అంటే  ' అస్సాం చనిపోతే మిగిలేదెవరు? అస్సాం మిగిలితే చనిపోయేదెవరు? ' అనేదే. బంగ్లా దేశీయుల వలస అడ్డుకోకపోతే   అస్సాం  బంగ్లా ముస్లిం బాహుళ్య రాష్ట్రంగా మారిపోయి,  మొత్తం ఈశాన్య రాష్ట్రాలలో ప్రత్యేకతావాదానికి అగ్రస్థానంలో ఉండబోయే ప్రమాదాన్ని గుర్తించిన ఆరెస్సెస్  ఈశాన్య రాష్ట్రాలన్నింటికి ఒకే సమిష్టి యోజనను  90వ దశకంలో రూపొందించింది. ఈ యోజనలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలలో భారతీయతను ఉద్దీపింపజేసే ,తద్వారా దేశపు అఖండతను కాపాడే బాధ్యతను  ఇతర రాష్ట్రాలలోని ఆరెస్సెస్ శాఖలకు ఇవ్వడం జరిగింది. దాని  ప్రకారం అస్సాంను కేరళకూ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ లను మహారాష్ట్రకూ, అరుణాచలప్రదేశ్ ను విదర్భకూ, మణిపూర్ ను కర్ణాటకకూ, త్రిపురను పశ్చిమ బెంగాల్ కూ  దత్తత ఇవ్వడం జరిగింది. 
ఈ కార్యయోజన  ఫలితం ఇపుడిపుడే కనబడసాగింది. విద్య, సామాజిక సేవా సంస్థలు మరియు యోగ శిక్షణా కేంద్రాలలో భాగంగా వందలాది ప్రచారకులు ఈశాన్య రాష్ట్రాలన్నింటా  అందరినీ కలుపుకుపోయే భారతీయ బహుత్వ సంస్కృతి  మరియు విలువలను నాటుతున్నారు. తత్ఫలితంగా పదేళ్ళ  ఉన్నంతగా ప్రత్యేకతావాద మనస్తత్వం అక్కడి ప్రజలలో ఇపుడు లేదు. కాంగ్రెస్, సిపిఐయం జతకలిసి బిజెపిని మతోన్మాద, హిందుత్వవాది అని ఎంత ఊదరగొడుతున్నా , ప్రజలు బుర్రలు చెడగొట్టుకోవడంలేదు. ఆ రెండు పార్టీలు స్వార్థంతో, అధికారలాలసతతో తమను అభివృద్ధికి దూరం చేసి, మతబ్యాంక్ లాగా చేసుకున్నారనే భావన కలిగింది. దాంతో అస్సాం, మణిపూర్, అరుణాచలప్రదేశ్ లలో రాజకీయ మార్పు  జరగడం మనం చూశాం. ఆ జాబితాలో ఇపుడు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ కూడా చేరిపోయాయి. 
త్రిపుర లో మార్పు:
మూలత: వనవాసీ తెగలతో తక్కువ జనాభా కలిగిన త్రిపుర లో  1947 లో ప్రముఖమైన మార్పు వచ్చింది. తూర్పు పాకిస్తాన్ లో సర్వం  కోల్పోయిన బెంగాలీలలో చాలామంది పశ్చిమ బెంగాల్ వైపు చూసినా, సిల్హట్, చిట్టగాంగ్ ప్రాంతంలోని  నిరాశ్రితులు  దగ్గరలోని త్రిపుర లో స్థిరపడ్డారు. దాంతోబాటు బెంగాలీభాషనూ ఆ చిన్న రాష్ట్రానికి తెచ్చారు. అందువల్ల త్రిపుర అనేక రకాలుగా పశ్చిమ బెంగాల్ కు నకలు అయింది. 
1970 దశకంలో పశ్చిమ బెంగాల్ లో దశలవారీగా ప్రభావశాలిగా మారుతూ వచ్చిన సిపిఐయం తర్వాత దశకంలో త్రిపురలో కాలుపెట్టడానికి, 1993 లో అధికారంలోకి రావడానికి సాధ్యమైంది ఈ కారణంతోనే. కమ్యూనిస్ట్ ప్రభుత్వ సతాయింపు, అసహకార విధానాలతో మరియు సిపిఐయం కార్యకర్తల హింసాప్రవృత్తితో త్రిపురలో ఆరెస్సెస్ కార్యకలాపాలకు తీవ్రమైన అడ్డంకులు ఎదురయ్యాయి. వాటిని తొలగించుకోవడానికి సంఘం దృఢమైన, స్పష్టమైన అడుగులు వేయడానికి సిద్ధమైంది. 2014 లో మహారాష్ట్రకు చెందిన ఆరెస్సెస్ ప్రచారక్  సునీల్ దేవధర్ ను త్రిపురకు పంపడం జరిగింది. దేవధర్ ఈ నాలుగు సంవత్సరాలలో త్రిపురలో ఆరెస్సెస్ శాఖలను 60 నుండి 265 కు పెంచారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సాధారణ ప్రజల దైనందిన కష్టాలకు స్పందించి దేవధర్ శాఖలను జనప్రియం చేశారు. దేవధర్ కార్యయోజనలో రాజకీయాలకు స్థానం లేకపోయినా , ఆయన ప్రారంభించిన శాఖల జనప్రియత ఆరెస్సెస్ పునాదిని గట్టిపరచడంతోబాటు బిజెపి పెరుగుదలకూ కారణమైంది. 
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విప్లవ్ కుమార్ దేవ్  మరియు నార్త్ ఈస్ట్ డెమోక్రాటిక్ అలయన్స్ నేత హేమంత్ బిస్వాస్ శర్మ లతో కలసి దేవధర్ కొన్ని సూత్రాలను  అమలు చేశారు. వాటిలో ప్రముఖమైనవి : 1. స్థానిక నాయకుల మధ్య అపనమ్మకం, ఘర్షణలను తొలగించి , ఐక్యత కాపాడటానికి ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క విస్తారక్ ను నియమించడం. 2. ప్రతి ఎలక్షన్ బూత్ లో ఓటర్ లిస్ట్ లో ప్రతి పేజీలో 60 మంది ఓటర్లుంటారు.  ఆ 60 మందిని కలిసి వారి అవసరాలను పరిశీలించడానికి ' పన్నా ప్రముఖ్ ' ( పేజ్ ఇన్ ఛార్జ్ ) అనే పేరుతో కార్యకర్తలను  నియమించడం.  3. ప్రతి అయిదు ఎలక్షన్ బూత్ లకు ఒక ' శక్తికేంద్ర ప్రముఖ్ ' ను నియమించడం. 4 .సిపిఐయం కార్యకర్తల  హింసాప్రవృత్తి గురించి తెలిసి ఉండటంతో , హింసలో గాయపడిన కార్యకర్తల చికిత్స కోసం కొంత మొత్తాన్ని ఏర్పాటు చేయడం. ( గత రెండు సంవత్సరాలలో అలా ఖర్చు చేసిన మొత్తం 15 లక్షలు ) 5. రకరకాల తెగల ప్రజల అభిమానం పొందడానికి  The Indigenous  Peoples Front Of  Tripura పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం. 
  చివరగా ఎన్నికల ప్రచార సమయంలో బిజెపి వాడిన   ప్రభుత్వ ఉద్యోగుల వేతనానికి సంబంధించింది. దేశమంతటా 7వ వేతన సంఘం సిఫారసులు జారీ అవుతుండగా త్రిపుర లో కమ్యూనిస్ట్  అమలు చేస్తున్నది 4వ వేతన సంఘం నిర్ణయించిన వేతనాలు. బీదరికమే ఒక ఆదర్శం అనే  విధానాన్ని వ్యక్తిగతంగా అనుసరిస్తున్న  ముఖ్యమంత్రి  మాణిక్ సర్కార్ మొత్తం రాష్ట్రాన్నే బీదరికంలో ఉంచారని చూపడానికి దీనికన్నా పెద్ద ఉదాహరణ కావాలా? 
ఇన్నింటి  పరిణామం ఇపుడు మన ముందుంది. 
                                                         ఎరుపు  కాషాయం అయింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments