Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

స్వర్గీయ దీనదయాళ ఉపాధ్యాయ - megaminds

స్వర్గీయ దీనదయల్ ఉపాధ్యాయ గారు చాలా కాలం ఉత్తరప్రదేశ్ ప్రాంత ప్రచారక గా పని చేసేవారు.  చాలా చదువుకున్న వారు. వాజపేయి, మురళీ మనోహర...



స్వర్గీయ దీనదయల్ ఉపాధ్యాయ గారు చాలా కాలం ఉత్తరప్రదేశ్ ప్రాంత ప్రచారక గా పని చేసేవారు.  చాలా చదువుకున్న వారు. వాజపేయి, మురళీ మనోహర్ జోషి, రజ్జూ భయ్యా లాంటి అనేక మంది ఉద్దండులు వారి చేతిలో తయాసరు అయ్యారు.  సంఘాన్ని ఉత్తరప్రదేశ్ నలుమూలలా పెంచారు.

శ్రీ శ్యామా ప్రకాశ్ ముఖర్జీ పూజనీయ గురూజీ  తాను ప్రారంభించిన భారతీయ జనసంఘ్ కి విస్తరణ, సైద్ధాంతిక వికాసానికి మంచి కార్యకర్తని కోరారు.  గురూజీ శ్రీ దీనదయాలజీని ఎంపిక చేశారు.  వారిని ఆవిధంగా రాజకీయ క్షేత్రానికి ఇచ్చారు.  చాలా నిరాడంబరా, సరళ స్వభావుడు అయిన వారు ఆ క్షేత్రం లోకి  వెళ్లడం, ఆ మధ్యే మొదలయిన పార్టీ సైద్ధాంతిక, కార్యకర్తల గణాన్ని ఎంచుకోవడం వారిపైనే పడింది.

శ్రీ శ్యాంప్రసాద్ జి కాశ్మీర్ 370 ఆర్టికల్ వ్యతిరేకంగా ఉద్యమించి, శ్రీనగర్ జైలులో అనుమానాస్పద మృతి చెందారు.  శ్రీ దీన దయాలజీ నే పార్టీ అధ్యక్షులు అయ్యారు
కేరళ ల పార్టీ అఖిల భారతీయ సమావేశాల్లో వారి ఎన్నిక జరిగింది.  త్రివేంద్రం వీధుల్లో ఊరేగింపు, పూల మాలలు, హోరెత్తే నినాదాలు.  వారికి జయకారాలు.

కానీ వారు మలయాళ లిపి లో ఉన్న దుకాణాల పేర్లు చూస్తూ ప్రక్కనున్న వారి తో ఈ లిపి లో కూడా దేవనాగరి లిపి లా పైన గీత ఉంటుంది.  చూడు దేశమంతా ఏకత్వం లో ఇదో సమాన విషయం అన్నారట.  అలా సర్వసంగ పరిత్యాగల తో ఆ పార్టీ నిర్మాణం చేయబడింది.  చిన్న పాటి అహంకారం కదిలించలేని వారి చేతుల్లో జనసంఘ్ వికసించింది.

ఒక సారి ఢిల్లీ లో సమావేశాలు.  వారు వసతి నుండి క్షవరం చేయించు కోవడా నికి  వెళ్తానని ఒక్కరే వెళ్లారు.  క్షౌరశాల లో రష్ ఎక్కువ గా ఉంది.  సమయం తక్కువగా ఉంది.

 వాజపాయీ గారు వారితో సమావేశాల విషయం లో కొన్ని నిర్ణయాలకు వారిని కలవాల్సివచ్చింది.  దగ్గరలో ఉండే సెలూన్లన్నీ వెతికినా కనపడలేదు.  నిరాశగా వెనక్కి తిరిగిన వారికి దీనదయాలజీ పిలుపు వినబడింది
చెట్టు కింద ఒక క్షురకుడు వారికి క్షవరం చేయడం పూర్తి చేశారు.

మీరు మా పార్టీ భారతీయ అధ్యక్షులు.  ఇలా చెట్టుకింద కూర్చుని  క్షవరం చేయించు కోవడమ్ ఏమిటి? అంటే వారు
నాకు సమయం మిగిలింది.  వాడికి నాలుగు డబ్బులు దొరికాయి, అంటూ నవ్వుతూ వచ్చారు.

వారు చెప్పిన ఏకాత్మ మానవతాదర్శనం పై చర్చ దాని పరిశోధన, మొత్తం ప్రపంచానికి వికాశానికి ఆలోచించే మహానుభావుడు జీవితం మాత్రం ఇంత సామాన్యమైనది.

Simple living high thinking ki వారి జీవనము ఒక ఉదాహరణ.

నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

1 comment