New car prices: జీఎస్టీ ప్రభావంతో దిగిపోయిన కార్ల ధరలు.. ఏ కంపెనీ ఎంత తగ్గించింది?
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్వభావంలో మార్పులు తీసుకురావడంతో భారత మార్కెట్‌లో పాపులర్ కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి. కొత్త సవరణల కారణంగా కార్లపై జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. ఎస్‌యూవీలపై 28 నుంచి 40 శాతానికి పెరిగింది. అయితే సెస్ రద్దు చేయడంతో ఆ కార్ల ధరలు తగ్గాయి. మరి ఏ కారు ధర ఎంత తగ్గిందో చూద్దాం.
ఫోక్స్‌వ్యాగన్ సెప్టెంబర్ 22 నుంచి కొత్త ధరలను అమలు చేయనుంది. టిగువాన్ ఆర్ లైన్ గరిష్ఠంగా రూ.3.26 లక్షల వరకు తగ్గింది. విర్టస్‌పై రూ.66,900, టిగాన్‌పై రూ.68,400 తగ్గించారు.
మహీంద్రా సెప్టెంబర్ 6 నుంచి ఎస్‌యూవీలపై కొత్త ధరలను మహీంద్రా అమలు చేసింది.
- XUV 3XO డీజిల్ మోడల్‌పై గరిష్ఠంగా రూ.1.56 లక్షల తగ్గింపు ప్రకటించింది.
- బాలెరో నియో రూ.1.27 లక్షలు,
- XUV 3XO పెట్రోల్ మోడల్ రూ.1.4 లక్షలు,
- XUV 3XO డీజిల్ మోడల్ రూ.1.56 లక్షలు,
- థార్ రూ.1.35 లక్షలు,
- థార్ రాక్స్ రూ.1.33 లక్షలు,
- స్కార్పియో రూ.1.01 లక్షలు,
- స్కార్పియో N రూ.1.45 లక్షలు,
- XUV 700 పై రూ.1.43 లక్షల తగ్గింపు అందిస్తోంది.
కియా కార్లపై కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.
- సోనెట్‌పై గరిష్ఠంగా రూ.1.64 లక్షలు తగ్గింది.
- సైరస్ రూ.1.86 లక్షలు,
- సెల్టోస్ రూ.75 వేల,
- కేరెన్స్ రూ.48 వేల,
- కేరెన్స్ క్లాసిక్ రూ.78 వేల,
- కార్నివల్ రూ.4.48 లక్షలు చొప్పున తగ్గనున్నాయి.
స్కోడా కస్టమర్లకు సెప్టెంబర్ 22 నుంచి తగ్గించిన ధరలు అందుబాటులోకి రానున్నాయి.
- స్కోడా కైలాక్ ధర గరిష్ఠంగా రూ.1.19 లక్షల వరకు తగ్గింది.
- కొడియాక్ రూ.3.30 లక్షలు,
- సూపర్‌బ్స్ రూ.66 వేల,
- స్కాలా రూ.63 వేల ప్రయోజనం పొందొచ్చు.
మారుతీ సుజుకీ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.
- స్విఫ్ట్‌పై రూ.1.06 లక్షల వరకు తగ్గింది.
- ఆల్టో K10పై గరిష్ఠంగా రూ.53 వేల,
- ఎస్‌ప్రెసో రూ.53 వేల,
- వ్యాగనార్ రూ.64 వేల,
- సెలెరియో రూ.63 వేల,
- డిజైర్ రూ.87 వేల,
- బాలెనో రూ.85 వేల వరకు తగ్గింపు ధరలో లభిస్తుంది.
టయోటా కిర్లోస్కర్ మోటార్స్ కూడా సెప్టెంబర్ 22 నుంచి కొత్త ధరలను అమలు చేయనుంది.
- ఫార్చ్యూనర్ రూ.3.49 లక్షలు,
- లెజెండర్ రూ.3.34 లక్షలు,
- హైలక్స్‌పై రూ.2.52 లక్షలు,
- వెల్ఫైర్ రూ.2.78 లక్షలు,
- కామ్రీ రూ.1.01 లక్షలు,
- ఇనోవా క్రిస్టా రూ.1.08 లక్షలు,
- ఇనోవా హైక్రాస్ రూ.1.15 లక్షల తగ్గింపు పొందబోతున్నాయి.
టాటా మోటార్స్ కొత్త ధరలను సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది.
- నెక్సాన్ గరిష్ఠంగా రూ.1.45 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు.
- టియాగోపై రూ.75 వేల,
- టిగోర్ రూ.80 వేల,
- ఆల్ట్రోజ్ రూ.1.1 లక్షలు,
- పంచ్ రూ.85 వేల,
- నెక్సాన్ రూ.1.55 లక్షలు,
- కర్బ్ రూ.65 వేల,
- హ్యారియర్ రూ.1.4 లక్షలు,
- సఫారి రూ.1.45 లక్షల వరకు తగ్గాయి.
హ్యుందాయ్ ఇండియా కొత్త ధరలను సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి తీసుకువస్తుంది.
- వెన్యూపై గరిష్ఠంగా రూ.1.23 లక్షలు తగ్గించారు.
- నియోస్‌పై రూ.73 వేల,
- ఎక్స్‌టర్ రూ.89 వేల,
- i20 రూ.98 వేల,
- i20 N లైన్ రూ.1.08 లక్షలు,
- వెన్యూ రూ.1.23 లక్షలు,
- వెన్యూ N లైన్ రూ.1.19 లక్షలు,
- వెర్రా రూ.60 వేల,
- క్రెటా N లైన్ రూ.71 వేల,
- క్రెటా రూ.72 వేల,
- ఆరా రూ.75 వేల చొప్పున తగ్గించారు.
మొత్తం మీద, సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ సవరణల ప్రభావంతో భారత కార్ల మార్కెట్‌లో స్విఫ్ట్, క్రెటా, వెన్యూ, నెక్సాన్, బాలెనో, సోనెట్, సఫారి, హ్యారియర్, ఫార్చ్యూనర్, ఇనోవా వంటి పాపులర్ మోడల్స్ ధరలు గణనీయంగా తగ్గాయి.
GST cut car prices India 2025, new car prices after GST reduction, car discounts September 22 GST, popular cars price drop GST, SUV prices after GST cut, Maruti Suzuki GST price cut, Hyundai GST car prices, Tata Motors car discount GST, Toyota car prices after GST 2.0, Kia price cut GST, Skoda car price drop GST, Volkswagen car prices after GST cut