Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

నరేంద్ర మోడీ VS నారా చంద్రబాబు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొన్ని పోలికలు ఉన్నాయ. బాబు కన్నా మోడీ వయసులో ఆరునెలలు, రాజకీయాల్లో ...ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొన్ని పోలికలు ఉన్నాయ.
బాబు కన్నా మోడీ వయసులో ఆరునెలలు, రాజకీయాల్లో పదేళ్లు చిన్న . కానీ రాజకీయ ఎత్తుగడల్లో ఆరాకులు ఎక్కువే చదివారు. 1950 ఏప్రిల్‌లో బాబు జన్మిస్తే, అదే సంవత్సరం సెప్టెంబర్‌లో మోడీ జన్మించారు. 1978లో కాంగ్రెస్ ఐ ద్వారా బాబు రాజకీయ జీవితం ప్రారంభమయితే, 1987లో బిజెపి ద్వారా మోడీ రాజకీయ జీవితం ప్రారంభం అయింది.
బాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బాబుకు అనుకూలంగా దాదాపు ప్రపంచ మీడియా మొత్తం ప్రచారం చేయగా, మోడీకి వ్యతిరేకంగా అదే స్థాయిలో ప్రచారం సాగింది.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ అనుకూలంగా కావచ్చు, వ్యతిరేకంగా కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి ప్రచారాన్ని పొందింది ఈ ఇద్దరు నాయకులే. మన రాష్ట్రానికి చెందిన సామాజిక శాస్తవ్రేత్త ఒకరు ఒక విషయాన్ని పదే పదే చెబుతుంటారు.
2004లో మన రాష్ట్రంలో, గుజరాత్‌లో దాదాపు ఒకే సమయంలో ఎన్నికలు జరిగాయి. మీడియా బాబుకు అనుకూలంగా విస్తృతంగా ప్రచారం చేసింది, మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మీడియా విస్తృత ప్రచారం చేసింది. కానీ చిత్రంగా వ్యతిరేక ప్రచారాన్ని ఎదురీది మోడీ విజయం సాధించగా, అనుకూల ప్రచారం ఉన్నా బాబు ఓడిపోయారు.
అమెరికా అధ్యక్షుడు సైతం నా పాలన చూసి మురిసిపోయారు అని బాబు ఓడిపోగా, అమెరికా వీసా ఇవ్వకుండా అవమానించిన మోడీ మాత్రం ఘన విజయం సాధించారు. బాబు పాలనపై క్లింటన్ సెనెట్‌లో సైతం ప్రస్తావించారు అని తెలుగు మీడియా ప్రచారం చేసినా బాబుకు విజయం చేకూర్చలేకపోయారు. మోడీని తమ దేశానికి రాకుండా అమెరికా అడ్డుకున్నా ఆయన విజయాన్ని అడ్డుకోలేక పోయింది.
మీడియానో, అమెరికానో కాదు ఓటు వేసే ప్రజలే హీరోలు అని గుజరాత్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్టమ్రైనా పదే పదే నిరూపిస్తూనే ఉంది. మీడియా ప్రచార ప్రభావంపై ఈ ఇద్దరు నాయకుల ఫలితాలను అధ్యయనం చేయాల్సిన అంశమే. గుజరాత్ అల్లర్ల సమయంలో రాజధర్మం గురించి మోడీకి అప్పటి ప్రధాని వాజ్‌పాయి వివరించే సరికి, ఆయన్ని మారుస్తారేమో అనే ప్రచారం జరిగింది.
గాలికి పోయే పిండిని కృష్ణార్పణం అన్నట్టుగా ఆ క్రెడిట్ తాను కొట్టేయడం ద్వారా మైనారిటీల ఓట్లను సాధించవచ్చునని బాబు భావించి, మోడీని తొలగించాల్సిందే అని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం బాబు మద్దతుతోనే నిలబడ్డా, బాబు డిమాండ్‌ను మాత్రం వాళ్లు పట్టించుకోలేదు. బిజెపి వ్యవహారాల్లో ఇతర పార్టీల జోక్యం ఏమిటి? అని బిజెపి నాయకులు నిలదీశారు. మా రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చమనడానికి ఇతర రాష్ట్రాల వారికున్న హక్కేమిటని గుజరాతీలు ప్రశ్నించారు.
చివరకు గుజరాత్ అల్లర్ల వివాదం మోడీని గుజరాత్‌లోనే కాదు దేశంలోనే బలమైన నాయకుడిగా నిలిపింది. మీడియా ప్రచారాన్ని చూసి కొందరు బిజెపి నాయకులు ఏవేవో ఊహించుకుని బిజెపిలో తిరుగుబాటు తీసుకు వచ్చి పార్టీ నుంచి బయటకు వెళ్లి , కొత్త పార్టీ పెట్టి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి అడ్రస్ లేకుండా గల్లంతయ్యారు.
మోడీ బలాన్ని సరిగా అంచనా వేయలేకపోయామని తరువాత ప్రకటించారు. ఒక పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఒక నాయకుడు విజేతగా నిలవాలన్నా ప్రజల మద్దతుతో తప్ప అమెరికా అండతోనో, మీడియా మద్దతుతోనో సాధ్యం కాదని మోడీ నిరూపించారు.
మోడీని దించాల్సిందే అని పట్టుపట్టిన బాబు పదేళ్ళు నుంచి ప్రతిపక్షంలో ఉండి, ఇప్పుడు రాష్ట్రము విడిపోయాక మోడీ హవాలో 2014లో ముఖ్యమంత్రి అయ్యారు , మోడీ మాత్రం నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఐదవ సరి 284 సీట్లతో కమల దళానికి ఘనవిజయాన్ని అందించి ప్రధానమంత్రిగా దేశంలో తిరుగులేని నాయకుడిగా ప్రపంచంలో దేశ కీర్తిని చాటి చెప్పే గొప్ప ధీరోదాత్తుడిగా దేశానికీ ప్రధాన సేవకుడిగా దూసుకుపోతున్నారు....
Source :https://www.facebook.com/sarmagarimella

No comments