Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

స్వరాజ్యం లో పరతంత్రం - megaminds

మనది వేల సంవత్సరాల చరిత్ర ఉండే దేశం. 17 వ శతాబ్దం వరకు మన దేశం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో మొదటి స్థానం లో ఉన్నాము. మనకు పోటీ అంటే చైనా ఒక్కటే...

మనది వేల సంవత్సరాల చరిత్ర ఉండే దేశం. 17 వ శతాబ్దం వరకు మన దేశం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో మొదటి స్థానం లో ఉన్నాము. మనకు పోటీ అంటే చైనా ఒక్కటే ఉండేది. యూరోప్ ఎక్కడో క్రింది స్థానం లో ఉండేవి. ఈ మధ్య ఒక పోస్టింగ్ గురుమూర్తి గారిది చూసేవరకు మన దేశం వేల ఏళ్లుగా బీద దేశం అని మన పరి పాలకులు పనికట్టుకొని ప్రచారం చేశారు.
మనం వెనుక బడటానికి మన లో ఉండే వివిధ భాషలు, వివిధ కులాలు, వివిధ మతాలు అని గగ్గోలు పెట్టారు. విదేశస్థుల దండయాత్రలు, ఈ దేశ సొమ్ము దోచుకు పోయిన విషయాలు. ఇక్కడి వృత్తులు నాశనం చేసిన వివరాలు దాచేశారు. ఎందుకు విదేశస్థుల పై ఇంత ప్రేమ? అసలు ఈ దేశస్థులు, చరిత్ర సంస్కృతి ఏది అనే దాన్ని మూసేసి ప్రయత్నం చేశారు. అసలు ఇక్కడి జాతీయత మాట్లాడదాన్ని మతం గూర్చి అని, మతం అంటే వినకూడాని మాటగా, విదేశస్థుల నుండి వచ్చిన మతాలకు పెద్ద పీట. ఎందుకు వేసారు? జాతి 1947 లోనే మొదలయినట్లుగా వ్యవహారం ఎందుకు?
అదే పద్ధతిలో మన చరిత్ర, సంస్కృతి నిండిన మన సాహిత్యానికి దూరం చేయాలంటే, ఆ సాహిత్యం అధికంగా ఉండే సంస్కృతాన్ని చచ్చిన భాష అన్నారు. మేకాలే చెప్పినట్లుగా రంగుకు మాత్రమె నల్ల వాళ్ళు, భాష భూష, బుర్ర అంతా తెల్ల వారిగా తయారు అవుతారని చెప్పిన భవిష్య వాణీ నిజం కావడం మనం చూస్తున్నాము.
నేను వ్రాసే వ్యాసాలూ మా పిల్లలు చదువ లేరు. ఇంగ్లిష్ లో వ్రాస్తే చదువుతాం అంటారు. మన రామాయణ మహా భారతాలు తెలియవు. భగవద్గీత అర్థం కాని సబ్జేక్ట్. సంపాదనకు చదువే సర్వస్వమా. మన జాతీయత హిందుత్వం అనే ధైర్యం లేని ప్రజల బుర్రలను ఎందుకు తయారు చేశారు. అసలు ఇది హిందూ దేశం అని , ఇక్కడి జాతీయులు హిందువులని, ఇక్కడి జాతీయత హిందుత్వం అని మనం చెబితే సూడో సెకులరిస్టులు మన మీద పది కరిచేసే స్థితి ఎందుకు?
ఈ దేశం లో అనేక మతాలూ పుట్టాయి. వాటికి తోడు మరో రెండు బయటి దేశాల దిగుమతి, కలుపుకున్నా ఇది హిందూ దేశమే అని మనం అంటే ఇక్కడి జనాలే జుట్టు పీక్కునే పరిస్థితి ఏమిటి? ఈ దేశానికి, మతానికి సంబంధం లేని ఈ జాతిలో, జాతి పేరునే మతం పేరుగా ఎందుకు సృష్టించ బడింది. ఇదంతా ఇంగ్లిష్ వాడి తంత్రం.
స్వరాజ్యం వచ్చింది. స్వతంత్రం లేదు. తెల్ల వాడికి బదులు తెల్ల వాడి బుర్ర ఇంకా, 70 సంవత్సరాల తరువాత కూడా ఇక్కడి వారిపై పని చేస్తుంది.
వారధి భాష గా సంస్కృతం నేర్పడానికి ఇంత సమయం, ఖర్చు అయ్యేవి కావు. మన దేశంలో అధిక జనాభాకు అర్థం కాని, విదేశస్థులకు సులువుగా అర్థం అయ్యే భాషను వారధి భాష చేయడం ఎంత ప్రమాదకరం. మన దేశం లో వారికి మన పై చిన్న చూపు బయట దేశాలపై అపురూప గౌరవం, కారణం ఆత్మాబిమానం లేక పోవడమా ? నెహ్రు ప్రధాని కావడానికి ఇంగ్లిష్ వాడి వ్యూహమా? ఇందులో గాంధీజీని పావుగా వాడుకున్నారా? అర్థం కాని విషయం.
దేశం లో మన పద్ధతి, మన భాష, మన భూష, మన సంస్కృతి, మన వారసత్వం పై గౌరవం, మన విలువల, మన గ్రంధాల, మన సంస్కారాల పై అభిమానం ఉండే జాతిగా హిందూ జాతి ఎంత త్వరగా మారితే దేశం అంత త్వరగా అభివృద్ధి చెందు తుంది. స్వ తంత్రం సాధిస్తుంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments