Page Nav

HIDE
GRID_STYLE

Latest Posts

latest

స్వతంత్ర దేశం లో స్వంత భాష. - megaminds

పూజనీయ గురూజీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ద్వితీయ సర్ సంఘచాలకులు చాలా సార్లు అంటుండే వారు, 1947 లో ఈ దేశం స్వరాజ్యం వచ్చింది కాని స్వతంత్రం ...

పూజనీయ గురూజీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ద్వితీయ సర్ సంఘచాలకులు చాలా సార్లు అంటుండే వారు, 1947 లో ఈ దేశం స్వరాజ్యం వచ్చింది కాని స్వతంత్రం రాలేదని. అంటే అని అడిగేవారికి స్వతంత్రం అంటే స్వ, తంత్రం అంటే మన పద్ధతి అనేది లేదు అనేవారు.
మన దేశం లో అనేక భాషలు పుట్టి పరిఢ విల్లాయి. అన్ని భాషల్లో ఎన్నో సాహిత్య ప్రయోగాలు జరిగాయి. అన్ని భాషల్లో ఉత్గ్రంధ రచనలు జరిగాయి. ఇవన్నీ వదిలేసి యూరోప్ నుండి దిగుమతి అయిన, మనలను బానిసలుగా పాలించి, మనల్ని దోచుకుని దేశాన్ని బికారిగా చేసిన, మనల్ని హిందువులు ముస్లింలు గా విభజించి, దేశం విడిచి పోతున్నప్పుడు కూడా పరిపాలనా విధంగా ముక్కలు చేసి, పరస్పరం విభేదాలు సృష్టించిన ఇంగ్లిష్ వాడి భాషను మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారధి భాషగా ఆ శత్రువుల భాషను ఎంచుకున్నాము. ఇది మనకు సంక్రమించిన పర తంత్రం. మనం మాట్లాడే మన జాతీయ భాషలు పరస్పరం శత్రు భాషాల్లాగా కొట్లాడు కున్నాము.
భారతీయ భాషాలకే కాదు యూరోప్ భాషలకు కూడా తల్లి భాష సంస్కృతం. డిస్కవరీ అఫ్ ఇండియా లో నెహ్రు గారు సంస్కృత పాదాలకి, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో సమాన పదాలు కూడా వివరిస్తారు. ఇక మన దేశం గుర్తింపు అయిన వేదాలు, ఉపనిషత్తులు, దేశం అన్ని చోట్లా గౌరవించ బడే రామాయణ, మహాభారతాలు, ఈ దేశ పురాణాలు అన్ని సాహిత్య గ్రంధాలలో జీవించి ఉన్న సంస్కృతాన్ని మన దేశ ప్రధమ ప్రధాని డెడ్ లాంగ్వేజ్ , (మరణించిన భాష ) అని నిర్వచించారనే విషయమ వింటే వారు దేశాన్ని పర తంత్రం తోనే నడిపారు అనేది మనకు అర్థం అవుతుంది.
మలయాళం మాట్లాడే ఆది శంకరులు ఉత్తర భారతం లో బదరీ లో, తూర్పు భారతం లో పూరి లో, పశ్చిమ భారతం లో ద్వారకలో, దక్షిణం లో శృంగేరి లో పీఠాలు పెట్టినప్పుడు వారు వాడిన వారధి భాష ఏమి ఉండవచ్చు అని భారతదేశ స్వతంత్ర పాలకులు ఎందుకు ఆలోచించలేదో?
స్వతంత్రం వచ్చిన సమయంలో ఇంగ్లిష్ వచ్చిన భారత జనాభా శాతం కూడా సింగల్ డిజిట్ లో ఉండింది. దాన్ని పెంచుకోవడం కోసం 70 సంవత్సరాలుగా ప్రయత్నం చేసాము. అదే సంస్కృతం పెంచుకొని ఉంటె ఒక దశాబ్దం లో మొత్తం భారత దేశం లో అద్భుతమైన మన స్వంత భాష ఉండేది. మన గ్రంధాలను అధ్యయనం చేసే అవకాశం రెండవ తరానికి నేర్పే వాళ్ళం. మనకు స్వంత విషయాలంటే తక్కువ చూపు. మనం మానసిక బానిసలుగా బ్రతుకడం అలవాటు చేసింది మన స్వదేశ పరిపాలకులు. ఎందుకంటె వారు అత్యంత మానసిక బానిసలు. (కొనసాగిస్తాను)
షేర్ చేయండి. కామెంట్ చేయండి. నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..