Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

స్వరాజ్యం లో పర తంత్రం - 2 - megaminds

మన తెలుగు కవి కచెర్ల గోపన్న అదేనండి రామదాసు వ్రాసిన రామ కీర్తన ఒకటి వ్రాస్తాను. ఏ తీరుగా మము దయచూచెదవో ఇనవంశోత్తమా రామా ! నా తరమా భవ సాగ...

మన తెలుగు కవి కచెర్ల గోపన్న అదేనండి రామదాసు వ్రాసిన రామ కీర్తన ఒకటి వ్రాస్తాను.
ఏ తీరుగా మము దయచూచెదవో
ఇనవంశోత్తమా రామా !
నా తరమా భవ సాగరమీదను
నళిన దళేెక్షణ రామా!
శ్రీ రఘునందన సీతారమణా
శ్రిత జన పోషక రామా!
కారుణ్యాలయా భక్త వరద
నిను కన్నది కానుపు రామా!
దాస వినుత రామదాస పూజిత
దండము అయోధ్య రామా
దాసాన్విత కడు జ్ఞానమోసంగవే
దాశరధే రఘు రామా!
ఇది తెలుగు పాట. తెలుగు కవి వ్రాశాడు. తెలుగు వారికి అందరికీ అర్థం అవుతుంది. కాని ఇందులో అచ్చ తెలుగు పదాలు లెక్కేస్తే- చూచెదవో, ఈదను, దండము, కానుపు అనే నాలుగే తెలుగు పదాలు.
మిగతావన్నీ సంస్కృతం నుండి తీసుకున్నవే. ఇది గోల్కొండను పశ్చిమ ఆసియా మూకలు పరిపాలించిన చాలా దగ్గరి నాటి కవనం.
ఇలా భారతీయ అన్ని భాషల్లో 75 శాతం సంస్కృత పదాలుండే భాషని మన ప్రధమ భారత ప్రధాని, నవ భారత నిర్మాత నెహ్రు గారు మృత భాష అంటే భారత జాతి వ్యతిరేకించాల్సింది. కాని హిందీ, తమిళం మధ్య చిచ్చు పెట్టి సంతోషించిన మనం, సంస్కృతం వారధి భాష చేయ దల్చుకోలేదు. స్వతంత్రం కాదలుచుకోలేదు. మన దేశ భాషాలన్నీ జాతీయ భాషాలే అయినా హిందీ జాతీయ భాష అని మిగతా భాషలు తిరుగబడేట్లు చేసి ఇంగ్లీషే శరణ్యం అని నమ్మ పలికారు.
మనం బానిస బ్రతుకు శతాబ్దాలు అనుభవించి, విడిచి పెట్టక స్వరాజ్యం వచ్చినా దుష్పరిపాలక, విదేశీ భాషనే దశాబ్దాలు ఇంకా నెత్తిన పెట్టు కున్నాము.
ప్రపంచం మొత్తానికి జ్ఞాన వెలుగుల నిచ్చిన భారత దేశం, ఆక్రమించి, దోచుకునే పశు ప్రవృత్తి లేక మన సంస్కృతిని ఎల్లెడలా చాటిన మన దేశ గొప్పతనం పూడ్చి పెట్టి, బానిస చిహ్నాలను నెత్తిన పెట్టుకునే దరిద్రపు అడుగులు స్వతంత్రం వచ్చిన సమయం లో మన పెద్దలు వేసారు..
ఇవి సామాన్య ప్రజల్లో RSS తీసుకెళ్తుంటే
దాన్ని మత తత్వ సంస్థ అని, గాంధీజీ హత్య చేసింది వీరేనని అబద్ధపు ప్రచారాలు చేసి, దీన్ని బూటు కాలు తో నలిచేస్తానని మన ప్రధాని ప్రతిన బూని, భంగ పడ్డారు. చైనా యుద్ధం లో సంఘ స్వయంసేవకుల వీరోచిత సాయం (సైన్యానికి) చూసి తరువాత రిపబ్లిక్ పరేడ్ లో మనల్ని ఆహ్వానించారు. కొద్ది రోజుల్లో వారు స్వర్గస్థులయ్యారు. తరువాతి ప్రధాని 17 నెలలే ఉన్నారు. పాకిస్థాన్ తో యుద్ధం. రష్యాలో చర్చల కువెళ్ళి అనుమానాస్పద మృతి చెందారు.
తరువాతి కాంగ్రెస్ ప్రభుత్వాలు నెహ్రు పాటించిన మానసిక పర తంత్ర ధోరణి నే ప్రచారం చేసి పాటించారు. నెహ్రు ముని మనుమడు రాహుల్ కూడా సంఘాన్ని గాంధీజీ హాంతకులని అని, కోర్టు నెత్తిన కొడితే తల బొప్పి కట్టినా కాంగ్రెస్ పర తంత్ర భావాలకే వేలాడుతున్నారు. వారి తో పాటు విదేశీ ఆలోచనా బానిసలు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఆ బూజుకే వేలాడుతున్నారు.
ఇంకా కొనసాగిస్తాను.
షేర్ చేయండి, కామెంట్ చేయండి, నలుగురికి చెప్పండి. నమస్తే మీ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments