దేశం లో అనేక వ్యవస్థలో ప్రభుత్వం ఒకటి ( ప్రభుత్వమే దేశం కాదు) - megaminds

ప్రభుత్వం అనేది దేశం లో ఉండేటి అనేక వ్యవస్థల్లో ఒకటి. అంటే
1 వ్యాపార రంగానికి ఒక వ్యవస్థ
ఉంటుంది.
2. పరిశ్రమలకు ఒక వ్యవస్థ ఉంటుంది.
3. విద్యకు , వైద్యానికి
4.సామాజిక ఉత్సవాలకు, పర్యాటక రంగానికి
అన్ని వ్యవస్ధలు వేరు వేరుగా ఉంటాయి . అన్ని పనులు ప్రభుత్వం చేయదు. వ్యవస్థ లకు ఒక కో ఆర్డినేషన్ మాత్రమె చేస్తుంది.
ప్రభుత్వం, విద్యా, వైద్య, పారిశ్రామిక, వ్యవసాయక, వ్యాపార, క్రీడా, సామాజిక ఉత్సవాలు, పర్యాటక వ్యవస్థలు, అంతర్గత రక్షణ, బయటి రక్షణ వేరు వేరుగా ఈ సమాజ సేవలు చేస్తుంటాయి. జాతీయ సమాజ అభివృద్ధి కోసం, అవసరాలకోసం, పరిపుష్టి కోసం వివిధ పద్ధతుల్లో పని చేస్తుంటాయి.
ఒక తప్పుడు అభిప్రాయం ఏమిటంటే ప్రభుత్వమే అన్నీ చేస్తుందని, అది అన్నిటిని నియంత్రిస్తుందని. కాని ఈ వ్యవస్థలు అన్నీ పరస్పర పూరకాలు.
బలమైన దేశం ఏది అవుతుందంటే, ఈ వ్యవస్థలు వాటికవే సమాజ పరిపుష్టి అనేది ధ్యేయంగా, వీలైనంత స్వతంత్రం గా పని చేస్తేనే దేశం ముందుకు వెళ్తుంది.
అన్నీ పనులకు ప్రజలు ప్రభుత్వం వైపు చూసే వ్యవస్థగా కమ్యూనిజం పూర్తిగా విఫలం అయ్యింది.
ఇప్పుడు ప్రజలు తమ పనులు, ఆదాయమూ, ఆనందం కేవలం ప్రభుత్వం వైపు చూసే వైఖరి తగ్గి తమ కాళ్ళ పై తాము నిలబడి అవసరమైన చోట్ల ఈ వ్యవస్థలు పరిపుష్టం చేసే పద్ధతిలో ఉంటేనే సమాజం బాగుపడుతుంది. దేశం ముందుకు వెళ్తుంది.
ఈ ధైర్యం, ఆత్మాభిమానం, ఆత్మ నిర్భరత ఉన్న సమాజం గా తీర్చి దిద్దేపని ప్రభుత్వం తో పాటు మనం అంటే అన్ని వ్యవస్థలూ చేయాలి. అదే దేశ బలం.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments