Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

చతుర్విధ పురుషార్ధాలు - ధర్మం-2 - megaminds

అర్థం కామం మన కోరికలకు మనసుబానిసఅవుతుంటుంది. బుద్ధి అది తీర్చుకునే మార్గం చెబుతుంది. ఒక్కొక్కప్పుడు మనసుకు బానిస అయిన బుద్ధి చెడు పరిణామ...

అర్థం కామం మన కోరికలకు మనసుబానిసఅవుతుంటుంది.
బుద్ధి అది తీర్చుకునే మార్గం చెబుతుంది.
ఒక్కొక్కప్పుడు మనసుకు బానిస అయిన బుద్ధి చెడు పరిణామాలనుండి బయట పడే మార్గాలనుండి అన్వేషించి చెడు వైపుకు నడపచ్చు. స్కామ్ చేసే వాడు తప్పించుకునే మార్గాలు వెతుక్కున్నట్లు. అయితే ధర్మానికి అంటుకున్న బుద్ధి తప్పు చేయనీయదు. ఎందుకంటె ధర్మం మంచి చెబుతుంది.
కాబట్టి ధర్మాలు చాలా ఉండవు. పరమ సత్యం ఒకటే ఉంటుంది. ప్రకృతి నిరంతరం మారుతుంటుంది. కాబట్టి ఈ ధర్మ సూత్రాలు సాపేక్షంగా ఉంటాయి. కాని ధర్మం మాత్రం శాశ్వత సత్యాన్ని ఆధార పది ఉంటుంది. తికమక గా ఉంది కదూ. వివరణ కొరకు ఒక ఉదాహరణ చెబుతాను. స్త్రీ, పురుష సంబంధాలలో గొడవలు రాని tranqulity ఉండాలి. ఇది ప్రపంచం సరిగా ఉండడానికి ఒక ధర్మం. ఇది శాశ్వత ప్రాతిపాదిక.
జర్మనీ ఉదాహరణ చెబుతుంటారు. ప్రపంచ యుద్ధాలకు పూర్వం జర్మనీ లో పురుషుల సంఖ్యా స్త్రీల సంఖ్యా కంటే ఎక్కువ గా ఉండేదట. అప్పుడు ఈ సంబంధం సరిగా ఉండటానికి బహు భర్తృత్వం నియమం. ప్రపంచ యుద్ధాలలో పురుష సంఖ్యా చాలా తగ్గింది. నిష్పత్తి లో స్త్రీలు ఎక్కువ. అప్పుడు నియమం మార్చారు. అప్పుడు నియమం బహు భార్యత్వం. కాబట్టి ధర్మ సూత్రాలు సాపేక్షం(పరిస్థితులకి అనుకూలంగా) శాశ్వత ధర్మం నింపడం
కోసం. ఇప్పుడు సులువయ్యిందా? కాబట్టి ధర్మం ఒక్కటే శాశ్వతం. ధర్మ సూత్రాలు దేశ కాల మానం అనుసరించి ధర్మజ్ఞులు క్రోడీకరిస్తారు. Code can be changeable. But dharma is permanent.
కాబట్టి హిందూ ధర్మం అని, ముస్లిం ధర్మం అని మరొకటి అని ఉండవు. అందరికి ప్రకృతి ధర్మం, మానవ ధర్మం ఒకటే ఉంటాయి. ధర్మ సూత్రాలు మారుతుంటాయి. మన దేశం లో దక్షిణాది లో ఉత్తరీయం, పంచె తో ఉండే పూజారులుంటారు. హిమాలయాల్లో ఉన్ని దుస్తులు కప్పుకునే పూజారు లుంటారు. అక్కడి పరిస్థితులకు అలా, ఇక్కడి పరిస్థితులకు ఇలా ఉండటం లో తప్పు లేదు. పవిత్ర ప్రాంగణాల రక్షణ, పవిత్ర వాతావరణం మాత్రమె ధర్మం.ఆరాధనా పద్ధతులు వేరు వేరు అయినా భగవంతుడు ఒక్కడే అనేది మనం త్వరగా అర్థం చేసుకునే ధర్మం. ఈ ధర్మం సరిగా అర్థం కాని వారికి ధర్మ సూత్రాల అనుసరనే శర్మమ్ గా భావిస్తారు. అది తప్పు. ఇవి చెప్పగలిగే వాడికి నిజ మైన ధర్మం తెలియాలి.
ధారయతి ఇతి ధర్మ, తో పాటు, యతోభ్యుదయ నిశ్శ్రేయస సిద్ది స ధర్మ, అని మరో సూత్రం ఉంది. అంటే ఇహం లో పరం లో కూడావృద్ధి కలిగించేది ధర్మం. మళ్ళీ ధర్మ సూత్రాలు కాలానుగుణం.
ప్రతీ వాడు భగవంతుని విశ్వసించాలని ధర్మం కట్టడి చేయదు.కాని అనైీతికత, అసూయ,చౌరంలాంటి వాటిపై నిషేధం అందరికీ వర్తింప చేసేదే ధర్మం. పాప, పున్యాలు, ప్రాయశ్చిత్తాల పై నమ్మకం ఉన్నా లేకున్నా సాంఘిక నియమాలు, విధి నిషేధాలు అందరూ పాటించాలి.
ఇంకొక భాగం లో పూర్తి చేస్తాను. ధర్మం విశాల విషయం. అందుకే మనసు బుద్ధి దీని అధీనం లో నడిచిన శ్రీ కృష్ణడు జగత్గురువు అయ్యాడు. సమస్త మానవాళికి 18 భాగాలుగా భగ్వద్గీతని బోధించాడు.
షేర్ చేస్తే చాలా మందికి చేరుతుంది. నమస్సులతో మీ నరసింహ మూర్తి.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments