చతుర్విధ పురుషార్ధాలు - ధర్మం-3 - megaminds

ధర్మము ఆనగానే అదేదో ఆధ్యాత్మికతడి అనాల్సిన పనిలేదు. వ్యక్తి తన ఆహార విహారాల్లో పాటించే శారీరక ధర్మాలు కూడా ఉంటాయి. జిహ్వ చాపల్యం, ఇంద్రియాల పై అతి వ్యామోహం లేకుండా ఉండటం కూడా ధర్మం చెబుతుంది. మన కర్తవ్యాన్ని, ధర్మాన్ని నిర్వర్తించే సాధనం గా శరీరం ఉపయోగించాలి అనేది కూడా ధర్మమే.
ధైర్యం, క్షమా,దమము, అస్తేయం (దొంగిలించ కుండా ఉండడం), శౌచము, ఇంద్రియ నిగ్రహం, నిర్మల బుద్ధి, విద్య, సత్యం, ఆక్రోధం ఇవన్నీ వ్యక్తిగత ధర్మాలు
ఇవి అన్నీ మనసును, బుద్ధిని నియంత్రించి నడిపిస్తాయి. బుద్ధికి నిత్యమూ, మంచి, శాశ్వత ఆనందం ఇచ్చే వాటి వైిపు ఆలోచించే శిక్షణ.
నియమబద్ధమయం అయిన ఆహార విహారాలూ, వ్యాయామం, యోగాసనం, ధ్యానం, నిగ్రహం, సత్సంగం, సద్గ్రంథ పఠనం, నిష్కామ సేవ మనకు సమర్థతను, ఆనందాన్ని ఇస్తాయి
వీటితో పాటు ఒక ఉన్నత లక్ష్యం, శరీరం కంటే మనసుకు, ఆపై బుద్ధికి, ఆత్మానందానికి మన దృష్టి పెంచాలి. ఆత్మానందం కోసం అన్నింటిని త్యజించ గలిగేదే ధర్మం.
ఇప్పుడు నేను వ్రాస్తున్నా ఏ విషయమూ మతము ఆరాధనా విధానం గూర్చి కాదు
వీటన్నింటిను హిందూ ధర్మ పద్ధతులు అంటారు. ఇవి మన దేశ జీవన విధానం.
మోక్షం గూర్చి కూడా మళ్ళీ వ్రాస్తాను.
షేర్ చేయండి, అందరికీ చేర్చండి. ప్రపంచమంతా మన వివరణ కొరకు చూస్తుంది. లోతుగా చర్చించండి. ప్రపంచ శాన్తి సౌభాగ్యాలకు మనం వారికి, మనకు కూడా అవసరమయిన మార్గం ఇది. ఇంకా వ్యక్తి ధర్మాల్లో ఉన్నాము. సమిష్టి, సృష్టి, పరమేష్ఠి గూర్చి కూడా ఆలోచించాలి.
ఇదే ఏకాత్మ మానవతా దర్శనం - దీన్దయాల్ ఉపాధ్యాయ. శ్రద్ధ పెడదాం.
నమస్సులతో మీ నరసింహ మూర్హి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments