Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సంఘం - డాక్టర్జీ తపః ఫలం - megaminds

సంఘం లో ఒక పాట అందరం పాడుకుని ఉంటాము. ఒక దీపం తో మరియొక దీపం వెలిగించాలి అని. వెలిగింపడే దీపాన్ని వెలిగి ఉన్న దీపం మాత్రమె వెలిగిస్తుంది. ...

సంఘం లో ఒక పాట అందరం పాడుకుని ఉంటాము. ఒక దీపం తో మరియొక దీపం వెలిగించాలి అని. వెలిగింపడే దీపాన్ని వెలిగి ఉన్న దీపం మాత్రమె వెలిగిస్తుంది. కాబట్టి కేవలం ఉపన్యాసాలు, నినాదాలు జీవితాన్ని మార్చలేవు. ఒక్కోసారి ఏర్పరుచుకున్న లక్ష్యాలు కూడా చివరి దాకా ప్రేరణ ఇవ్వలేవు. అలా ఇవ్వగలిగేది వెలుగుతున్న జీవితాలు మాత్రమె.
సంఘం కార్యకర్తలను అలాగే తీర్చి దిద్దగలిగింది. పెద్దలు అంరుంటారు, డాక్టర్జీ తపస్సు మనల్ని నడిపిస్తున్నది అని. ఇది ఎదో వారిపట్ల గౌరవం ప్రకటించే విషయం మాత్రమె కాదు. ఇప్పుడు వారితో ఆ ప్రత్యక్ష అనుబంధం ఉన్నవారు ఒక్క మా. గో. వైద్య గారే. మిగతా వారంతా తమ ఆశలు ఆశయాలు తరువాతి తరాలకు అందజేసి వెళ్లారు.
మాననీయ దత్తొపంత్ థేంగ్డే గారితో ఒక నాటి రాత్రి భోజనం తరువాత మాట్లాడుతూ మీరు డాక్టర్జీ ని చూసారా? అని అడిగాను. డాక్టర్జీని చూసాను గాని నేను చిన్న పిల్లవాడిని, నాకు గురూజీ తో ఘానిష్ఠ సంబంధం ఉండింది. అన్నారు వారి కళ్ళల్లో నీళ్లు తిరగడం నేను గమనించాను. ఈ ప్రశ్న 1992 లో అనుకుంటా. గురూజీ 1973 లో చనిపోయారు. సంబంధం అంటే అలా ఉంటుంది.
ఇంతకు ముందు వ్రాసిన వ్యాసం లో మాననీయ సోమయ్య గారు డిగ్రీ చదువుతున్న, పూర్తి చేసిన 19- 22 సంవత్సరాల మధ్య ఉండే యువకులకు, తపోమయం అయిన తన జీవితం లో రెండు రోజులు తరువాతి తరం వారి ఎంపిక, శిక్షణ కోసం ఇచ్చి మాతో గడిపారంటే, కార్యకర్త ప్రేరణ పొందే ఆ సంబంధం , వారి ధ్యేయం సమార్పిత జీవితం మరో అలాంటి జీవితాన్ని వెలిగిస్తుంది.
శ్రీ రామ కృష్ణుడు వివేకానందుడి కై పడిన తపన, అతని తో జరిపిన చర్చ, గడిపిన సమయం నరేంద్రుడి జీవిత ధ్యేయం, దాని కోసం ప్రపంచం మొత్తానికి ప్రేరణ ఇచ్చే హిందుత్వ జాగరణ కు వారికి మార్గాన్ని, దాన్ని తరువాతి తరానికి అందించే మరో తరాన్ని తయారు చేయడానికి, వారిపై శ్రీ రామకృష్ణుడి తపస్సు పని చేసి ఉండదా? ఆ తపస్సు మనకుంటే మనకూ నరేంద్రులు దొరుకుతారు.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments