శ్రీ చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్తి గారి చణకులు 3 - megaminds

ఆంద్ర యూనివర్సిటీ హాల్ లో సంఘం నిర్వహించిన మైనారిటీ కమిషన్ ఈ దేశమ్ లో అవసరమా? అనే అంశం పై మాట్లాడానికి శ్రీ నానాజి దేశ్ముఖ్ వచ్చారు
వారి ప్రసంగం ముందు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఓ ఐదు నిమిషాలు మాట్లాడారు.
15 కోట్లు ఉన్న ముస్లీమ్స్ ఈ దేశం లో మైనారిటీల క్రింద చేర్చడం తప్పు. ఏ దేశంలో నైనా మెజారిటీ ప్రజలు మైనారిటీ వాళ్ళను తక్కువ చేసినట్లుగా ఉంటె వారి రక్షణ కి కమిషన్ అవసరం. సాయబు లను, ఈ దేశం లో తక్కువ చేసింది లేదు. సాహెబ్ అంటేనే గొప్పవాడని అర్థం. వాళ్ళను తక్కువ ఎప్పుడూ చేయ లేదు.
డబ్బు లేక పోతే గరీబ్ సాహెబ్
బాగా డబ్బున్నోడి ని అమీర్ సాహెబ్
అడుక్కుంటే ఫకీర్ సాహెబ్
చచ్చిపోతే పీర్ సాహెబ్
వారిని మనమెప్పుడు సాహెబ్ అనే గౌరవిస్తున్నాము. వాళ్ళ హక్కులు రక్షించే కమిషన్ స్వాభావికంగానే అందరినీ గౌరవించే హిందూ దేశం లో అవసరం.లేదు. మరీ అవసరం అనుకుంటే మానవ హక్కుల కమిషన్ అని బలహీనులు అందరి రక్షణకు ఒకటి ఉండాలి కాని మైనారిటీకమిషన్ అవసరం లేదు. అని ముగించారు.
వారు సాహెబ్ అని వివరిస్తుంటే ఆ వివరణకు హర్షించిన శ్రోతలు బిగ్గరగా నవ్వుతో ఒకటే చప్పట్లు. పాపం నానాజీ దేశ్ముఖ్ గారికి తెలుగు రాదు. వారి భాషను లో శాస్త్రి గారి ఉపన్యాసం కొద్దిగా హిందీలో పొడిపొడి మాటల్లో విని వారు కూడా నవ్వుతూ తన భాషను పూర్తి చేశారు.
శాస్తి గారితో మీ అనుభవాలు కామెంట్స్ లో అందరికీ పంచుదాం.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments