Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కాశ్మీర్ సమస్య విశ్లేషణ - megaminds

ఒక సమస్యను చూసే విధానాన్ని బట్టి దాని విశ్లేషణ, సమాధానం వెతకడం ఉంటుంది.  కష్టానికి కారణం వేరే వాడని, వాడి పట్ల శత్రువు భావన పెంచుకొని, క...


ఒక సమస్యను చూసే విధానాన్ని బట్టి దాని విశ్లేషణ, సమాధానం వెతకడం ఉంటుంది.  కష్టానికి కారణం వేరే వాడని, వాడి పట్ల శత్రువు భావన పెంచుకొని, కుళ్ళబొడిచి, రెండు వర్గాలుగా చీల్చి గొడవ పెరిగితే ఆనందించే లెఫ్ట్ భావాలని నేటి సమాజం అంగీకరించడం లేదు.  ఒకప్పుడు ఊరికేనే ఆవేశం వచ్చేది.  ఇప్పుడు ఆది తగ్గింది.  కాబట్టి వారు పంథా మార్చుకుని విశ్లేషణ లొనే విషం కక్కుతున్నారు.  అది స్లో పాయిజన్.  గొప్పగా మనకు తెలియని యూరోప్ నుండో, ఆఫ్రికా నుండో చైనా నుండో చెప్పిన వారిని ఉటంకిస్తూ విశ్లేషణ చేస్తారు.

మా మిత్రుడు శ్రీ దశపతి రావు గారు చెప్పేవారు.  ఒక బెస్త పిల్లాడికి లెక్కలు చెబుతూ నీ దగ్గర రెండు చేపలు ఉన్నాయి.  నేను మరో రెండు నీకిచ్చాననుకో మొత్తం నీ దగ్గర ఎన్ని చేపలు?  అని ప్రశ్నిస్తే వాడు నాలుగు అంటాడు అదే నీ దగ్గర రెండు ప్లమ్స్ నేను రెండిచ్చానంటే వాడు లెక్క వొదిలేసి ప్లమ్ అంటే ఏమిటి? అనుకోని దాని గూర్చి ఆలోచిస్తాడు అని.  కాబట్టి మేధావులు మన రామాయణం, భారతం, మన చరిత్ర వదిలేసి వాడేదో గొప్పవిషయం చెప్పేవాడుగా అలోచించి అర్థం అయ్యేలోపు గొప్పగా చెప్పాడని అనేస్తాడు.  తరువాత మన అహంకారం దాన్ని సమర్థించడానికి దారులు వెతుక్కుంటాము.

మనింట్లో కూడా పిల్లలు, పెద్ద లూ తప్పులు చేస్తుంటారు.  ఆ తప్పులకు మనం శత్రుత్వ భావన తో సరిచేసే దారులు వెతకం.  కత్తులు, కటారులు వాడం.  ఎలా వాడిని సరి దిద్దడం, అని బాధలో ఆలోచిస్తాం.  పరస్పరం ప్రేమ ఉంటుంది కాబట్టి మాట కూడా మనిషిని మారుస్తుంది.  అలా సఫలం మైన సంఘటనలు కోకొల్లలు.

ఈ మధ్య మేధావులు చిత్రంగా వర్ణించే విషయం కాశ్మీర్ లో ప్రజల పై మొసలి కన్నీళ్లు కార్చడం.  అయ్యో అంత సైన్యమ్, ఎంత దారుణం అని సైన్యం కాపాడేదా లేక అరాచకం చేసేదా అని మనల్ని ఆలోచించుకుని అవకాశం కూడా ఇవ్వకుండా ఇరాక్ లో అమెరికా సైన్యం అంటూ ఒక ఉపమానం.  తలకు, మోకాలికి సామ్యత చెప్పే విశ్లేషణ.  పేకాడే వాడికి మంచి ముక్కలు పడక పోతే పక్కన కూర్చున్న వాణ్ని తిట్టినట్లు, సమస్యకు, కారణం దేనికి దేన్నో ముడేసి  పిచ్చి లేపె  ప్రక్రియ చేస్తుంటారు.  ఇంత గొప్పగా సమాజ ద్రుష్టి మళ్లించే వాళ్ళు కాబట్టే మేధావులు.  దాన్ని హిందూ ప్రభుత్వం ముస్లింల పై ఆజమాయిషీ అని చెప్పకుండా చెబుతారు.

నిజానికి మత దూరహంకారులు తరిమేస్తే  కాందశీకు లై ఇల్లూ, వాకిలి, గొడ్డూ, గోదా వదిలేది రోడ్ల పై బ్రతికే వాళ్ళు హిందువులు.  దేశం లో ఉండే ముస్లింలు రక్షణ పొందుతూ,  మిగతా వారికంటే ఎక్కువ హక్కులు పొందుతుంటే, ముస్లింలే మెజారిటీ గా ఉండే కాశ్మిర్ లోయలో అసహనం ఎందుకు? విద్రోహం, సైన్యం పై రాళ్ళు విసరడం, ఉగ్రవాదులకు రక్షణ లాంటివి వారికి కనపడవు.  వారికి ఇరాక్ లో అమెరికా సైన్యం ఆరాచకమే మన సైన్యం చేస్తుందేమో అని అనుమానం రేకెట్టించడం అబ్బో ఎంత మేధా శక్తి.  ఇక కన్నీయ్య లు ఎందుకు తయారు కారు ?

పరిష్కారం ఒక్కటే కాశ్మీర్ ను భారతదేశం లో పూర్తిగా కలిపేయాలి.  అడ్డుగోడ 370 అధికరణం.  ఎత్తేయాలి. కాశ్మీర్ లో భారతీయులందరికీ హక్కు ఉండాలి. కాశ్మీరీలకు భారత దేశం లో అధికారం ఉంది కదా.  అలా లేకపోతే నెహ్రు కుటుంబం 60 ఏళ్ళు ఎలా పరిపాలన చేసేది.

భారతీయ ముస్లింలు కూడా మేము వేరే జాతి అనే జిన్నా సిద్ధాంతాన్ని వదిలి, మన మాతృ భూమి భారత దేశం.  మనం అందరం ఒకే జాతి. అదే భారత జాతి.  ఈ సంకుచిత వోట్ బ్యాంకు రాజకీయాలు, కలిసి పోనీయని విభేదాలు సృష్టించే మేధావుల కుయుక్తులు వదిలేసి ఇది భారత బృహత్ కుటుంబం అనే వైపు అలోచించి ముందుకు సాగాలి.  మనమ్ కలిసి నడిస్తే దేశం ముందుకు పోతుంది.  లేక పోతే చైనా, పాకిస్థాన్, లెఫ్ట్ భావాలు, అమెరికా కుట్రలు మనల్ని విడగొట్టి దేశాన్ని మరో సారి బానిసలు చేయడానికి ప్రయత్నిస్తాయి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments