సంఘం ఒక బృహత్ కుటుంబం. - megaminds

సంఘం ఒక కుటుంబం అనుకోవ డానికి మరొక అలవాటు సంఘ పెద్దలు చేశారు.  సంఘ్ లో ఒక తాలుకకి పర్యటన చేసే కార్యకర్తలు కనీసం 5 మంది ఉంటారు.  అలా జిల్లా కి, విభాగ్ కి రాష్ట్రానికి, క్షేత్రానికి ఆపై అఖిల భారతీయ బృందాలు ఉంటాయి.  అందరూ పర్యటన చేస్తుంటారు. సంఘమే కాకుండా వివిధ క్షేత్రాల కార్యకర్తలు.  వివిధ కార్యక్రమాల నిర్వహణ. చరైవేతి చరైవేతీ అంటే ఇదే.  నిరంతరం చైతన్యం తో ఈ చక్రం భారతావని లో జాతీయతని నిర్మాణం.  అంత బలంగా సంఘం ఎదుగుతుంది.

ఈ పర్యటనా కార్యకర్తలు, స్థానిక కార్య కర్తల ఇళ్ళల్లోనే ఉంటారు.  వారితో భోజనం చేస్తారు.  పిల్లలతో కబుర్లు చెబుతారు.  అందరం ఒకే కుటుంబం అనడానికి ఇంతకంటే ఏమి నిదర్శనం కావాలి.

1985-86 లో వాజపాయీ గారు గుంటూరు వచ్చారు.   హోటల్ రూమ్ లో దిగలేదు.  స్థానిక కార్యకర్త జూపూడి యజ్ఞ నారాయణ గారింట్లో బస.  ఉదయం తెనాలి లో మీటింగ్.  పూర్తి చేసుకొని వచ్చారు.  వారూ సంఘ ప్రచారకే కదా.  12.00 కు తిరిగి గుంటూరు చేరు కున్నారు.  బాగా భావోగ్వేదం తో వారి మార్గదర్శనం జరిగింది. ప్రయాణ అలసట కూడా. బాగా అలిసి పోయారు.  నేను కూడా వారిని చూద్దామని వెళ్లాను.

Now this body badly needs rest of half an hour.  అన్నారు.  పైన గదిలో పడుకోవచ్చు అని యజ్ఞానారాయణ  గారు దారి తీసారు.  తెనాలి    బి జె పీ రామా చారి గారు నన్ను పరిచయం చేశారు.  ఇతను నగర ప్రచారక్ నరసింహ మూర్తి.  వెంటనే వెను తిరిగిన వాజపేయి గారు.  బహుత్ ఖుషీకా బాత్ హై, అంటూ నన్ను దగ్గరికి తీసుకున్నారు.  ఇక్కడ పని బాగుందా ?  ఎన్ని శాఖలు అన్నారు. చెప్పాను.  వారి విశ్రాంతి బయలు దేరాక వెనక్కి వచ్చేసాను. వాజపేయి గారి పేరు వినడం, ఉత్సాహంగా వారి గూర్చి చెప్పుకోవడం తప్ప చూసింది మొదటి సారి.  వారి ఆత్మీయ పలుకరింపుకు నోచు కోవడం నీనూహించని అదృష్టం.

ఒక ప్రచారక్ జీవితాన్ని సంరక్షించే, ఆత్మీయతను పంచే కుటుంబాలు ఎన్నో !  అందుకే సంఘ కార్యకర్త బహుజన ప్రియుడు.

అందరికీ ఇలాంటి అనుభవాలు ఉంటాయి.  మీరూ మీ అనుభవాన్ని పేస్ బుక్ లో పంచుకోవచ్చు కదా!

షేర్ చేస్తే చాలా మందికి చేరుతుంది.  నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments