ఒక సారి ఓపిగ్గా ఆలోచించండి. - megaminds

మనకు పొద్దున్నే ఉరుకులు పరుగులు. త్వరగా తయారయ్యి ఇంట్లో పనులు పూర్తి చేసుకుని ఆఫీస్ కి వెళ్ళాలి. సాయంత్రం వరకు అక్కడే. 7-8 గంటలు ఆఫీస్ టైమ్.
సాయంత్రం రాగానే పిల్లల పనులు, హోమ్ వర్క్, వాళ్ళ కొనుగోళ్లు చిల్డ్రన్ టైం.
భోజనం కి కూడా మనం టైం ఇవ్వాలి దినం లో 3 సార్లు కలిపి ఒక గంట కు కొంచం తక్కువ.
మరుసటి రోజు పనుల కొరకు కొంచం సేపు భార్యతో. దానికి ప్లేనింగ్ కి తప్పక ఇవ్వాలి.
వారం లో ఒక రోజు ఫామిలీ ఔటింగ్ టైం. తప్పక ఇవ్వాల్సిందే.
పుణ్యం, భగవంతుడి దయ ప్రాప్తి కోసం పూజా టైం ఉంటుంది.
ఇంకా వ్యాయామానికి, నడకకు టైం.
అప్పుడప్పుడు డాక్టర్ వైద్యం తప్పక టీమ్ ఇవ్వాల్సిందే.
మరి మనకో సిటిజెన్ షిప్, అడక్కుండానే మౌలిక హక్కులు, మనం మాట్లాడే భాష, మనం తినే తిండి, గూడు, గుడ్డ, బ్రతికెందుకు ఒక సంస్కృతి, సాహిత్యం, నీకో ఉద్యోగం, నెల జీతం అన్నీ ఇచ్చిన దేశానికి నీ టైం టేబుల్ లో నిర్దేశించిన సమయం ఎంత?
నీ సంస్కృతిని, నీ నీతిని, నీ ఉదారతను రాబోయే తరానికి ఇవ్వడం నేర్పడానికి నీవు కేటాయించిన సమయం ఎంత?
ఇదేమీ ఇవ్వక కోపం వస్తే సమాజాన్ని, పొరుగు వాడిని, నీకు అన్నీ ఇచ్చిన దేశాన్ని తిట్టడానికి, పేపర్లో కష్టాలను చూసి ఈ దేశం బాగు పడదని కామెంట్ పాస్ చేయడమేనా నీ డ్యూటీ.
సమయం ఇస్తే దేనీకోోసం ఇవ్వాలో ఎలా వినియోగించాలో ఆలోచిస్తాము. అసలు సమయం కేటాయింపులో దేశం ఉంటుందా?
ఒక సారి ఓపిగ్గా ఆలోచించండి.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments