Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఇది పని చేసే వారికి పట్టం కట్టే యుగం - megaminds

ఇది పని చేసే వారికి పట్టం కట్టే యుగం. గత 70 సంవత్సరాల స్వతంత్ర చరిత్ర లో ఊహలు మనల్ని ఊపి వేశాయి. స్వతంత్రోద్యమం లో వచ్చిన అనేక మార్పుల్లో స...

ఇది పని చేసే వారికి పట్టం కట్టే యుగం. గత 70 సంవత్సరాల స్వతంత్ర చరిత్ర లో ఊహలు మనల్ని ఊపి వేశాయి. స్వతంత్రోద్యమం లో వచ్చిన అనేక మార్పుల్లో స్వతంత్రం తరువాత అటువంటి ఊహాలని నెహ్రు తన పద్ధతి చేసుకున్నాడు. మన దురదృష్టం, నెహ్రు గారి అదృష్టం గాంధీ గారు సంవత్సరం లోపే మరణించారు. లేకపోతే గాంధీ గారే నెహ్రు కి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసే వారు. జాతీయత రవ్వంత లేని నెహ్రు మనల్ని 17 సంవత్సరాలు పరిపాలించాడు.
ఆ భావాలుండే పటేల్ కూడా త్వరగానే పోయారు. ఊహల్లో ప్రజలను అంత కాలం నడపడానికి ఒక కారణం స్వతంత్రం కాంగ్రెస్ వల్ల మాత్రమె వచ్చిందన్న నెహ్రు ప్రచారం, ప్రజలు ఆ కాంగ్రెస్ దేశానికిచ్చిన బహుమతి నెహ్రు అని ప్రజలు నమ్మడం. ఆ అపార నమ్మకం మన ప్రజలకు కొన్ని తరాలు ఉండింది.
5 సంవత్సరాలక్రితం నేను ఇంటింటికి ప్రచారం చేస్తుంటే దవడలు ఊగే మనుషులు అయ్యా చెయ్యి గుర్తు వద్దంటావా? అని అడిగారంటే ఆ ముసలి తరం ఇంకా వంశ పారంపర్య పాలననే ఆలోచిస్తుందని తెలుస్తున్నది.
ఆ సమయంలో వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న కమ్యూనిస్టు పార్టీ ప్రజల నమ్మకాన్ని చూరగొనలేదు. మరో పార్టీ లేదు. దేశం లో స్వతంత్ర, జాతీయ భావాల సంఘాన్ని గుర్తించిన నెహ్రు గాంధీ హత్యను దానిపై వేసి అంతం చేయాలని చూసాడు. అది ఆయనకు సాధ్యం కాలేదు. అయితే ప్రజలపై నెహ్రు మాత్రమె అభ్యుదయ వాది అనే ప్రచారం అందరిని మార్జినలైజ్ చేయగలిగింది. అందుకే అడ్డులేదు. నెహ్రు తరువాత లాల్బహదూర్ కొద్దిరోజుల పరిపాలన తరువాత పోయారు.
ఇందిరా అస్తిత్వం నెహ్రు కూతురు అనేదే. ప్రజల్లో విశ్వాసం తగ్గడం తో ఇందిరా మైనార్టీ, కుల సమీకరణాలు, దళిత్, వెనుక బడిన వర్గాలు కబుర్లు చెప్పింది. ప్రజలూ దాన్నే నమ్మి కొంత కాలం పట్టం కట్టారు.
ఈ వర్గ రాజకీయాలను ప్రాంతీయ పార్టీ లు మొదలెట్టాయి. తరాలు మారాయి. అబద్ధపు ప్రచారాలు, ఊహల రాజా కీయాలు వాళ్ళో చేశారు. కాని నిజమైన జాతీయ భావాలుండే, దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించే పట్టుదల ఉండే భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసినా దేశం లో ఉండే కాంగ్రెస్, మిగతా ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి పోయి RSS మత తత్వ పార్టీ అని ముద్ర వేసి దాన్ని కామన్ శత్రువు చేసుకుని ఇబ్బంది పెట్టారు.
అబద్దాలు చాలా కాలం నమ్మించలేవు. కేంద్రం లో కాని, రాష్ట్రాలలో కాని పని చేస్తున్న నిజమైన జాతీయ భావాలుండే, దేశమంతా ఒక్కటే అని నమ్మే పార్టీ పనులు చూసారు. అబద్ధపు ప్రచారాలు నమ్మే స్థితి లో ఈ రోజు మధ్యవయస్కులు, యువకులు లేరు. ముందు ప్రభుత్వాలు విడగొట్టిన కుల మత వర్గాలు ఈ రోజు నిజాన్ని గూర్చి ఆలోచిస్తున్నారు.
Sincearity మాటల్లో కాదు చేతల్లో చూసే, విశ్లేషించే ప్రజా సమూహం పెరిగింది. విడగొట్టే వాళ్ళు ఒక మూలకు నెట్టబడుతున్నారు. ఇక వారిది చివరి పోరాటమే. అందుకే అప్పుడప్పుడు రెచ్చి పోతుంటారు. ప్రజలు జాతీయత పరంగా ఏకం అవుతున్నారు. మతాల, కులాల వర్గాయు ఇంకా రాజకీయాల్ని మలుపులు తిప్పలేవు. సరైన మార్పు మరో 10 ఏళ్లలో కనపడుతుంది. ప్రజలు విడగొట్టే వారిని మూలకు తోస్తున్నారు. రాజకీయం మాటల గారడీ కాదు. పనిచేసే జాతీయ వాదులు, దేశాన్ని కలిపే వారే రాబోయే నాయకులు. మొదటి మలుపు దాటింది. అబద్ధపు ప్రచారాలు ప్రజలు నమ్మరు. పని చేసే వాడికే పట్టం. ఇది సంతోష దాయకమే.
దీని మీద విశ్లేషణ కు ఆహ్వానం. ఉంటాను మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments