Type Here to Get Search Results !

జాతి కి ఒకే పరంపర - megaminds

ఒక జాతి వేల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. అందులో మూలాలు ఉంటాయి. గతం నాస్తి కాదు నేస్తం అనుభవాల ఆస్తి. మన ఇంటిిపేరు చెప్పుకుని, మన పూర్వికులు ఎంత గొప్ప వారూ మన ఇళ్ళల్లో చెప్పుకుంటాము. వారి వారసులుగా మనం గర్వపడుతుంటాము. అలాగే జాతికి కూడా ఉంటుంది. మన పూర్వీకుల మంచి పనులు మనకు మంచి చేయడానికి ప్రేరణ ను ఇస్తుంటాయి. ఇది అత్యంత సహజమైన విషయం. దాన్ని వారసత్వ సంపద అంటారు.
మన జాతి లో చెడు చేసినవాడిని మనం నెత్తిన వేసుకోము. నిరసిస్తాము. రాముదు మన దేశ చక్రవర్తి. రావణాసురుడూ అంతే. కాని మనం రాముడి వారసులుగా చెప్పుకుంటాము. గుణవంతులు దేశం కొరకు ఆలోచించే వాడు మనకు ఆదర్శం. ప్రతినాయకుడు మనకూ విలనే. ఇది ఆలోచించే విధానం. రాముడి వారసత్వమ్ గా మనకు గర్వం గా ఉంటుంది. ఉత్తర భారతం లో నమస్కరించడం కూడా జై రాంజీ కి అని చెప్పుకుంటారు.
అదేవిధంగా చారిత్రిక పురుషులు అనేక మంది. చంద్ర గుప్త మౌర్యుడు, విక్రమాదిత్యుడు, హర్షవర్ధనుడు, కృష్ణ దేవరాయలు, కాకతీయులు, రాణప్రతాపుడు, శివాజీ, గురు గోవిందుడుడు వీరంతా మన దేశాన్ని సుభిక్షంగా, స్వతంత్రంగా ఉండడానికి పోరాడిన వాళ్ళు. వీళ్లపై మనకు అచంచల భక్తి విశ్వాసాలు ఉంటాయి.
చాణక్యుడు, శంకరుడు, రామానుజుడు, మధ్వా చార్యుడు, సమర్థ రామదాసు, మీరా, కబీరు, తులసీ దాసు, వేమన ఇంకా ఎందరో ఈ జాతి లో నీతి, ఆధ్యాత్మికత నింపిన వారు. దేశమంతా తిరిగి జాతిని ఏకం చేసినవారు. వీరిపై అత్యంత గురుభావన ఈ జాతికి ఉంటుంది. ఇది అత్యంత సహజ స్థితి.
ఇందులో ఎంత వీరుడయినా అలెగ్జాండర్ కలవడు. చంద్రగుప్త మౌర్యుడి కి బంధువయినా సెలుకస్ ను కలపము. ఈ దేశం పై దండెత్తినవాడు మన జాతీయుడుగా తీసుకోము. మనం వాడిని శత్రువు గానే చూస్తాము. పరిపాలన బాగా చేసినా, స్వర్ణ లంకాను పాలించిన రావాణాసురుడే మనకు శత్రువుగా చూస్తాము.
సామాన్య ప్రజలకు ఈ ధార స్పష్టంగా అర్థం కావడానికే, కావ్యాలు, కథలు, బుర్రకథలు, నాటకాలు, హరి కథలు, గొల్లసుద్దులు ఇంకా ఎన్నో కళలు, నాట్యాలు, నాటకాలు ఈ దేశమంతా నిరంతరం ప్రచారం జరుగుతుండేది. సన్యాసి వ్యవస్థ పనిచేసేది.
వీటిని ఆ గ్రామ వ్యవస్థ, రాజులు పోషించేవారు. పశ్చిమ ఆసియా నుండి వచ్చిన దోపిడీ మూకలు ముక్కలు ముక్కలుగా చాలా భూభాగం పాలించడం., ప్రజలను వివిధ పన్నుల ద్వారా హింసించడం లో వీటి వ్యవస్థ కొంత కొంత గా నాశనం అయ్యింది.
రేపు మళ్ళీ వ్రాస్తాను. చదువుతారుగా.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.