Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆదర్శ కార్యకర్త గుణ గణాలు -1 - megaminds

నేను చూసిన ఒక ఆదర్శ ప్రచారక్ ఈరంకి వారు. స్వర్గీయ ఈరంకి సుబ్రహ్మణ్యం గారి తో నా సహచర్యం 8 సంవత్సరాలు.  వారు M.Sc. chemistry  అని చాలా మంద...

నేను చూసిన ఒక ఆదర్శ ప్రచారక్ ఈరంకి వారు.

స్వర్గీయ ఈరంకి సుబ్రహ్మణ్యం గారి తో నా సహచర్యం 8 సంవత్సరాలు.  వారు M.Sc. chemistry  అని చాలా మందికి తెలియదు.  మొదటి సంవత్సరం చేయగానె అత్యవసర పరిస్థితి వచ్చింది.  చదువు వదిలేసి అండర్ గ్రౌండ్ కార్యకర్త అయ్యారు.  రెండు సంవత్సరాలు అలా ఉద్యమాల్లో,  తరువాత ఎన్నికల్లో గడిచి పోయాయి.  తరువాత మాననీయ భాగయ్య గారు వారిని రెండవ సంవత్సరం చదువు పూర్తి చేసి ప్రచారక్ గా రమ్మని అన్నారు.  వారు అలాగే చేశారు.  ఏదో M.Sc.  నాలుగేళ్ళు చదివనోయ్ అనే వారు.  అంటే ఫెయిల్ అయి లేట్ అయ్యిందేమో అనుకునేవారు.  కాని అది అత్యాయక పరిస్థితి లో ఉద్యమం అని ఎవరికీ చెప్పేవారు కాదు.

వారు అత్యంత కఠిన నియమాలు పాటించేవారు.  ఏలూరు లో ఒకసారి దేవాలయం కి వెళ్తే చెప్పులు పోయాయి.  లేకుండానే నడిచేవారు.  నేను ఏలూరు లో ఉద్యోగం చేస్తుండే వాడిని.  ప్రచారక్ గారికి డబ్బులు ఇబ్బంది ఏమో అని నేను కొనిచ్చాను.  వారు కార్యాలయం లో పెట్టి రెండు నెలల తరువాత వాడారు.  ఎందుకంటె పోయిన చెప్పుల సర్వీసు ఇంకా రెండు నెలలుండేది, అని చెప్పారు. నాకు కళ్ళు తిరిగాయి.

గుంటూరు కార్యాలయం లో వంట లేదు.  ప్రచారకులు భోజనాలు ఇళ్ళల్లోనే వారు దాన్ని నియమం లా పాటించేవారు.  హోటల్ లో భోజనం చేసే వారు కాదు.  ఇబ్బంది ఉండేది కాదు.  కాని ఒక్కో సారి పర్యటనలో తిరుగుతూ భోజనానికి చెప్పి వెళ్ళడం కుడిరేది కాదు.  మద్యాహ్నం 1.30 కి చేరితో ఆ రోజు భోజనానికి మంగళం.  నేను హోటల్ కి వెళదాం అంటే రాత్రి త్వరగా చేస్తాను ఎక్కడైనా చెప్పు అనేవారు. ఈ కష్టాలు ఎక్కడా, ఎవరితో, మాట్లాడే వారు కాదు.  నేను చూసేవాడిని కాబట్టి నాకు తెలుసు.

బట్టలు ఉతుక్కోవడం, శుభ్రంగా ఉంచుకునే వారు.  ఇస్త్రీ చేయించే వారు కాదు.  కాని గణవేష  నిక్కర్, చొక్కా ఇస్త్రీ చాలా ఆదర్శనంగా ఉండేది.  బెల్టు, బూటు మెరుస్తుండేవి.  ఎన్ని గంటలు పడుకోవాలి, ఎంత సేపు నియమంగా చదవాలి,  ఎంత ఖర్చు చేయాలి, అన్నీ ఆయన నిర్ణయించుకున్న పద్ధతి లొనే జరిగేది.  జిన్నా టవర్ దగ్గర వేప పుల్లలు కొనడం కూడా వ్రాసుకునేవారు.  అన్ని రకాల పనులకి వారి దగ్గర యోజన ఉండేది.

శారీరక, బౌద్ధిక్ విషయాల్లో ఎప్పుడు వారే reference  బుక్ అంటే ఆశ్చర్యం లేదు.  ప్రార్ధన, ప్రతిజ్ఞ వారి రోజూ నియమం.  ప్రతిజ్ఞ రాత్రి పడుకునేటప్పుడు చేసే వారు.  ప్రతీ ఉగాది కి డాక్టర్జీ జీవితం నియమంగా చదివేవారు.  ఆరోజు ప్రార్థన తప్పక వ్రాసేవారు.  ఇవేవీ ఇతరులకు కనిపించేది కాదు.  ఒక్క కార్యకర్త విషయం లో చిన్న మాట జారే వారు కాదు. తప్పుని మాత్రం తీవ్రంగా ఖండించేవారు.  వారి జీవన క్రమం లో ఒక చిన్న తప్పు కూడా ఎత్తి చూపలేము.  గొప్ప తపశ్శక్తి అంటే అదే అనిపిస్తుంది.

లారీ తో రోడ్డు ప్రమాదం లో కాలు తెగి పడ్డ తను లారీ డ్రై్వర్ ని మిగతా వారు దండిస్తుంటే అతనిది తప్పు కాదు వదిలేయండి అన్నారంటే వారి వ్యక్తిత్వం అర్థం అవుతుంది.  ఆ గాయాల పర్యవసానం వారు దేవుడిని చేరారుఅంత గొప్ప వారిని త్వరగా తీసుకెళ్లడం అన్యాయమనిపిస్తుంది.

షేర్ చేయండి.  నిజంగానే వారు ఆదర్శ ప్రచారక్.
నమస్కారం.  మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments