Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆదర్శ కార్యకర్త గుణ గణాలు-2 - megaminds

ఈరంకి వారు కార్యకర్త గుణాల ఆదర్శ రూపం. ఎదో ఒక్క వ్యాసం వ్రాసి వారిని చెప్పేయ లేము.  కార్యకర్త ఎలా ఉండాలనే అన్ని లక్షణా లని ఆయన సాధన చేసి ...

ఈరంకి వారు కార్యకర్త గుణాల ఆదర్శ రూపం.

ఎదో ఒక్క వ్యాసం వ్రాసి వారిని చెప్పేయ లేము.  కార్యకర్త ఎలా ఉండాలనే అన్ని లక్షణా లని ఆయన సాధన చేసి తనవిగా చేసుకునే వారు.  ఆ సాధన సామాన్యం కాదు. మనిషికి కొన్ని స్వాభావిక మైన గుణాలు ఉంటాయి.  అరిషడ్ వర్గాల ప్రకోపం కూడా ఉంటుంది.  ఏదో ఒక రోజు ఆదర్శం చూపడం కాదు.  అలా జీవిస్తేనే అది ఆదర్శ జీవితం.  వాటి సాధన నేను దగ్గర నుండి చూసాను. అది శారీరక కావచ్చు, బౌద్ధిక్ విషయాలు కావచ్చు, కార్యకర్తలతో ఉండే సంబంధాలు కావచ్చు.  తన లక్ష్యాలు నిర్ణయించుకోవడం కావొచ్చు.  వారి బుర్ర లో అన్నింటికీ స్థానం ఉండేది.  జీవితం గడపడం కాదు.  జీవిత సదుపయోగం, లక్ష్యం వైపు నిరంతర శ్రమ.  ఫలితం భగవంతుడికి వదిలెయ్యడం లాంటి భగ్వద్గీతా లక్షణాలు నేను వారిలో చూసాను.

చూడటానికి సామాన్య వ్యక్తి లా కనపడే వారు. పెద్దగా బయటి వారిని అబ్బురపరిచే లక్షణాలు ఉండేవి కావు.  కాని దగ్గరగా చూసే వారికి వారి ఎత్తు అంచనా వేయనంత అనిపించడం అందరికీ అర్థం అవుతుంది.

నేను బిల్డర్ గా స్థిరపడ్డాక,  మా దగ్గర ఒక అమ్మాయి ఫ్లాట్ కొనింది.  చివర్లో మాటల్లో నేను స్వయంసేవక్ అని ఆమెకు తెలిసి, మా  మేన బావ ఒకతను ఉండేవాదండి.  మీ అంత వారికి తెలుస్తుందని నేను అనుకోను.  ప్రచారక్ గా ఉండేవాడు.  ఆక్సిడెంట్ లో పోయారు, అంటూ చెబుతూ ఉంటె, నేను కల్పించుకొని మీరు సుబ్రహ్మణ్యం గారి గూర్చి చెబుతున్నారా?  అని అడిగాను.  నా కళ్ళు నీళ్ళు నిండాయి.  ఆమె మీకు తెలుసా? అన్నారు.  నా గొంతు గద్గద మయ్యింది. కళ్ళ నీళ్ళు జొట జొట కారాయి.  వారు మా గురువు గారమ్మ అంటే, తనూ తట్టుకోలేక పోయింది.  వారి గూర్చి నేను మాట్లాడు తుంటే మా బావ గారు అంత గొప్పవారని ఈ రోజే తెలిసింది అనింది.  ఇది వారి వ్యక్తిత్వం.

తను ప్రొద్దున్నుంచీ ఎవర్ని కలిసాను, ఏమి మాట్లాడాను,  సంఘ పద్ధతులను సరిగా పాటించానా?  సింహవాలోకానం ఉండేది.  కొత్తగా పెరుగుతున్న స్వయం సేవకుల్లో శారీరక్ ఎవరిది పెంచాలి,  రాబోయే జిల్లా కార్యకర్తలు గా ఎవర్ని పెంచుకోవాలి,  ఎవరు ప్రచారకులుగా రావచ్చు, జిల్లాలో ఈ కేంద్రం లో క్రిందికి దిగి పని చేయాలి.  ఏ బౌద్ధిక్ అంశాన్ని ఈ నెల ఆపొసన పట్టాలి?  తప్పు జరుగుతున్న చోట సవరణ ఎలాగా?  అన్నిటికి వారి దగ్గర యోజన ఉండేది.  మార్పులు, చేర్పులు నిశితంగా పరిశీలించే వారు.  వ్యక్తిగతంగా మాట్లాడి కార్యకర్త సామర్థ్యం పెంచేవారు.  సంఘం లో వారు కాదు.  వారిలో సంఘం సాక్షాత్కారం.

డాక్టర్జీ సంఘ కుటుంబాలలో పొయ్యి వరకు సంబంధం ఉండాలి అనేది వారు సాక్షాత్కరించారు.  సంఘం ఇంట్లో అందరి వద్దకూ వెళ్ళేది.  కార్యకర్త కుటుంబం అంతా సంఘ సిద్ధాంతం, పనిలో పెట్టడం వారి పని.
1984 , మా తృతీయ వర్షాలొ శ్రీ కృష్ణ శాస్త్రి గారు సంస్కృత సంభాషణా శిక్షణ ఇచ్చారు. తరువాత వారు ఇళ్ళల్లో సంస్కృతమీ మాట్లాడేవారు.  నేను తెలుగు తర్జుమా చేసేవాడిని.  నిజంగా వారి జీవితం ఒక సాధన.  మాననీయ సోమయ్య గారిని వారిలో నేను చూసే వాడిని.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments