Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మనిషి పని ఎందుకు చేస్తాడు-3 - megaminds

ముందు వ్రాసిన రెండు వ్యాసాల్లో గత ఒక శతాబ్దంగా పాశ్ఛత్య దేశాల్లో జరిగిన పరిశోధనల గూర్చి వివరించాను. దీనికి సంబంధించి వ్యాసాలూ, పుస్తకాలు, ...

ముందు వ్రాసిన రెండు వ్యాసాల్లో గత ఒక శతాబ్దంగా పాశ్ఛత్య దేశాల్లో జరిగిన పరిశోధనల గూర్చి వివరించాను. దీనికి సంబంధించి వ్యాసాలూ, పుస్తకాలు, వివరణలు, ఉపన్యాసాలు ఎన్నో మన దేశం లో జరిగాయి. ఇంగ్లిష్ సాహిత్యం చదివే మనవారు ఎందరో మెచ్చుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని పరిశోధించి చెప్పారని ప్రచారం జరిగింది.
మన సాహిత్యం, శాస్త్రం చదివిన వారు ఇవీ ఈ నాటి పరిశోధనలు కావని, మనవారు ఎంతో ముందుగా ఈ విషయాలు వివరించారని పూజనీయ రజ్జూ భయ్యా చెబుతూ, వీటిని మనవారు ఈషణ త్రయం(ఇచ్చా త్రయం) అని చెప్పారూ.
అందులో మొదటిది విత్తేషు, అంటే డబ్బు కోసం ఇచ్చా. ఇదే కార్ల్ మార్క్స్ కనుకొన్నా సిద్ధాంతం.
రెండవది పుత్రేషు, అంటే పుత్రులు కావాలనే కోరిక. కొంచం డిగ్నిఫెయిడ్ గ చెప్పిన లైంగిక వాంఛ. సిగ్మొండు ఫ్రాయిడ్ చెప్పినసిద్ధాంతం.
మూడవది లోకేషు , అంటేలోకంకీర్తించాలనేది
దీన్నే ఏంజెల్స్ చెప్పాడు.
విత్తేషు, పుత్రేషు, లోకేషు అనే ఇచ్చా త్రయాన్ని మన వారు ఈషణ త్రయం అని చెప్పారు.
ఇంత నూతన ఆవిష్కరణలు మనవారు పురాతన పుస్తకాల్లో ఉన్నాయంటే మనం మనవి మరిచిపోయి వారి వెంట తిరిగి, ఇంగ్లిష్ తప్ప మరో భాష రాని ఈ తరం ఎలా చదువుతుంది?
ఈ కాలం లో కూడా మన పురాతన అధ్యయనాలు చేసే మహానుభావులు ఉన్నారన్న విషయం నేను బెంగుళూరు లో ఉండే వివేకానంద కేంద్ర ద్వారా నడుపబడే ప్రశాంత్ కుటీర్ వెళ్ళినప్పుడు అర్థం అయ్యింది. యోగా యూనివర్సిటీ, యోగా శిక్షణ నేర్పే ఆ కేంద్ర చీఫ్ ఒకప్పుడు అమెరికా లోని నాసా కేంద్రం లో శాస్త్రవేతగా పనిచేసేవారు. శ్రీ నాగేంద్ర గారు మన పూర్వీకులు చెప్పే విషయాల్లో పరిశోధన కోసం అక్కడి ఉద్యోగం వదలి ఇక్కడ పరిశోధనలకు కేంద్రం ప్రారంభించారంటే ఎంత ఆనందం వేసిందో?
ఈ మూడు ప్రక్రియల ఆధారమే కాకుండా బ్రతికే వాళ్ళు ఈ భారతావనిలో కోకొల్లలు. అలాంటి ఒక చక్రవర్తి రంతి దేవుడు. ఆయన గొప్ప యాగాలు చేసి తనకున్నదంతా దానం చేసి తనకు అన్నం కూడా లేని సమయంలో అడిగిన వాడికి తనకోసం మిగిలిన నీళ్ళను కూడా దానం చేసాడట. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకొమ్మని అడిగితే, వారు
నత్వహం కామయే రాజ్యం
నా స్వర్గం నా పునర్భవం
కామయే దుఃఖ తప్తానాం
ప్రాణినాం ఆర్తి నాశనం
అని కోరుకున్నాడట. అంటే నాకు రాజ్యం పై కోరిక లేదు. స్వర్గం కావాలని లేదు, మళ్ళీ పుట్టాలనీ లేదు. కాని భగవంతుడా నాకు ఒక్క కోరిక ఉన్నది, దుఃఖ తప్తులయిన ప్రాణులకు వారి ఆర్థిని తీర్చే శక్తి నాకు కావాలి, అని భగవంతుని కోరుకున్నాడు. ఇలాంటి మహానుభావులను ఎందులో చేర్చాలని వారు ప్రశ్నించారు. ఇందులో నపునర్భవం అనే మాటకు మోక్షం అనే అర్థం అని మిత్రులు తెలియ జేసారు. అంటే మోక్షం కూడా కోరుకొను అని చదువుకోవాలి.
కాబట్టి ఇవి మూడు సత్యాల్లా కనపడుతున్నా, పాక్షిక సత్యాలే అని తేలిపోయింది. మరి ఏ ప్రేరణ మనిషికి పని చేయాలనే ప్రేరణ ఇస్తుంది? రేపు మళ్ళీ చర్చిద్దాము.
ప్లీజ్ షేర్, అందరికీ చేరుతుంది.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments