Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కర్పూరీ ఠాకూర్ ఎవరో తెలుసా? ఆయనకే ఎందుకు భారత రత్న?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును రాష్ట్ర...

బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును రాష్ట్రపతి భవన్ ఆయన శత జయంతి సందర్భంగా ప్రకటించింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా, జననాయక్ గా ఆయనకు పేరు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడే 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు. ఆరోజుల్లో దాదాపు రెండేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన కర్పూరీ ఠాకూర్ 1952‌లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు.

జననం: అతి సామాన్యమైన అత్యంత వెనుకబడిన వర్గమైన మంగలి కుటుంబంలో 1924 జనవరి 24న, బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలోని పితౌజియా గ్రామంలో రామ్‌దులారీ దేవి, గోపాల్‌ ఠాకూర్‌ దంపతులకు జన్మించారు.

విద్యాభ్యాసం: సామాజిక అణచివేత, వివక్షల మధ్య కర్పూరీ ఠాకూర్‌ చదువుకున్నారు. తన 15వ ఏటా విద్యార్థిగా ఉండి బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా ప్రసంగించి అరెస్టయి 50 రూపాయలు జరిమానా చెల్లించి, ఒకరోజు జైలు జీవితం గడిపి చిన్ననాటి నుంచి ధైర్యం గల చైతన్యవంతుడు. డిగ్రీ వరకు చదువుకున్న ఆయన జాతీయోద్యమంలో క్రియాశీల కార్యకర్తగా పనిచేశారు. చదువు ముగిసిన తర్వాత ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూ గ్రామీణ సమాజంలో ఉద్యమాలు చేసి గుర్తింపుపొందారు. చరిత్ర, సమాజశాస్త్రం, రాజనీతిశాస్త్రాలు అధ్యయనం చేసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.

స్వాతంత్రోధ్యమంలో: కర్పూరీ ఠాకూర్‌ ఒక స్వాతంత్య్ర పోరాటవీరుడు. ఆధునిక భారతాన్ని నిర్మించటం కోసం జరిగిన అన్ని ప్రయత్నాల్లో తనదంటూ ముద్రవేసిన సామ్యవాది. మహాత్మాగాంధీ భావాలకు ప్రేరేపితుడై క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ ఆలోచన లను ప్రచారం చేశారు. బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా స్వాతం త్య్రం కోసం పోరాడి 24 నెలలు జైలులో గడిపారు. కులానికి వ్యతిరేకంగా గాంధీసత్యా గ్రహం చేయాలని డా.అంబేద్కర్‌, లోహియాలు కోరినప్పుడు గాంధీ, కాంగ్రెస్‌ తప్పించుకున్న తీరు కర్పూరీ ఠాకూర్‌ను ఆలోచింప చేసింది. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బిసిలకు రాజకీయ పౌరహక్కులు కావాలని కోరుతూ దేశవ్యాప్త ఉద్యమం జరుగుతున్న సమయంలో లండన్‌లోని రౌండ్‌టే బుల్‌ సమావేశాల్లో గాంధీ వైఖరితో కర్పూ రీఠాకూర్‌ నిరాశ చెందారు. గాంధీ వల్ల మన సమాజంలో ఎలాంటి మార్పురాదని గ్రహించి లోహియా సామ్యవాద సిద్ధాంతం, అంబేద్కర్‌ కుల నిర్మూలన సిద్ధాంతంతో ప్రభావితుడయ్యారు. కాంగ్రెసుకు గాంధీకి దూరంగా జరిగి అణగారిన వర్గాల అభ్యున్నతికోసం జీవితాంతం పోరాడారు.

రాజకీయ గురువులు: దేశ రాజకీయాల మీద, ప్రజాజీవితం మీద మరచిపోలేని ప్రభావం కర్పూరీ ఠాకూర్‌ చూపారు. లోహియా అనుచరుడిగా, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ మిత్రుడిగా ఆయన బీహార్‌ రాజకీయాలను శాసించే స్థితికి ఎదిగారు. రామ్‌ మనోహర్‌ లోహియా స్థాపించిన సంయుక్త సోషలిస్టుపార్టీకి అధ్యక్షుడిగా చాలాకాలం సేవలందించారు. అహింసాయుత సామాజిక పరివర్తన కోసం సంపూర్ణ విప్లవం నినాదాన్ని జయప్రకాశ్‌ నారాయణ్‌ పిలుపునిచ్చారు. జయ ప్రకాశ్‌ నారాయణ్‌కు సన్నిహితుడైన కర్పూరీ ఠాకూర్‌ జనతాపార్టీలో క్రియాశీల నాయకుడిగా మారారు. 1970లో బీహార్‌ రాష్ట్రానికి మొదటి బ్రాహ్మణేతర ముఖ్యమంత్రి.

ప్రజా జీవితం:  స్వాతంత్య్రం వచ్చాక బీహార్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 1952లో జరిగాయి. భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి చనిపోయేంత వరకు జరిగిన ఎన్నికల్లో దేనిలోనూ ఆయన ఓడిపోలేదు. దేశప్రజల ఆకాంక్షలను తీర్చడానికి పాలకులు కృషి చేయాలని బలంగా వాదించారు. నెహ్రూ అభివృద్ధినమూనా పనికిరాదని ఆయన విశ్లేషణ. దేశంలో భూస్వాముల వద్ద పోగుపడిన లక్షలాది ఎకరాలు, ప్రభుత్వ ఆధీనంలోని కోట్లాది ఎకరాలను పేద ప్రజలకు పంపిణీ చేయడం వల్లే ఆర్థిక, సామాజిక సమానత్వంసిద్ధిస్తుందని, తద్వారా దేశం వేగంగా పురోగమిస్తుందని భావించారు.

నిజాయితీకి మారుపేరు. అంబేద్కర్‌లాగే లోహియా కుల నిర్మూలన జరగాలనీ, కులాధిపత్యం లేని సమాజం నిర్మించడం కోసం గాంధీతో సైద్ధాంతిక యుద్ధం చేశారు. అలాంటి ఆధునిక వాది, సామ్యవాది రామ్‌మనోహర్‌ లోహియా ప్రభావంతో కర్పూరీ ఠాకూర్‌ బీహార్‌ రాజకీయాలనే కాదు, దేశమంతటికీ ఆదర్శప్రాయ మైన ఎన్నో విధానాలను అందించారు. కర్పూరీ ఠాకూర్‌ జన హితం కోసమే తన జీవితాన్ని అంకితం చేశారు. అందువల్లే ఆయన్ని ‘జన నాయక్‌ అని ప్రజలు నేటికీ పిలుచుకుంటున్నారు. 1967లో బీహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరోసారి 1970లో కర్పూరీ ఠాకూర్ బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే బిసి రిజర్వేషన్‌ను విద్యా, ఉద్యోగ నియామకాల్లో 1978లో ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయం బీహార్‌ సామాజిక జీవితాన్ని మార్చేసింది. బిసి రిజర్వేషన్లు బలవంతులైన కొన్ని కులాలకే ఉపయోగపడకుండా, ఎంబిసి లకు, సబ్‌కోటా కూడా ఆయనే కేటాయించి సామాజిక న్యాయ సూత్రాన్ని పాటించారు. కర్పూరీ ఠాకూర్‌ చేపట్టిన ఈ విధానం దేశవ్యాప్తంగా అమలు కావాలన్న డిమాండ్‌ మేరకే మండల్‌ కమిషన్‌ వచ్చింది. బిసి రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌. మద్యపానం రద్దు, అణగారిన విద్యార్థులకు ఫీజు రద్దు వంటి వాటితోపాటు, బీహార్‌ను ఆధునికత దిశగా నడిపించే ఆలోచనలెన్నో చేశారు.

బిసిల గౌరవం కోసం ఆత్మాభిమానం కోసం కృషి చేసిన గొప్పనాయకుడు కర్పూరీ ఠాకూర్‌. బీహార్‌ రాజకీయాలను శాసిస్తున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీష్‌కుమార్‌, రాంవిలాస్‌ పాశ్వాన్‌లకు గురువు. బి.సి మండల్‌ కమిషన్‌, ఓబిసి రిజర్వేషన్‌ సిఫారసు చేయకముందే 1978లో బీహార్‌లో ఓబిసి లకు, స్త్రీలకు రిజర్వేషన్‌ కల్పించారు. దేశవ్యాప్త ఓబిసి, ఎంబిసి ఉద్యమానికి ఆద్యుడు.

బిసిల సామాజిక స్థితిగతుల్లో వ్యత్యాసాలు గుర్తించి బిసి వర్గీకరణ చేపట్టి అత్యంత వెనుకబడిన ఎంబిసిలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి రిజర్వేషన్ల దృక్పథానికి స్ఫూర్తి ప్రదాత అయ్యారు. కర్పూరీ ఠాకూర్‌ ఫార్ములాగా ఈ విధానం ప్రసిద్ధి పొంది మండల్‌ కమిషన్‌కు ప్రేరణ అయింది. జీవితకాలం లో తను నివసించిన పెంకుటింటికి పైకప్పు మార్చుకోలేని పేదరికం.

ఢిల్లీలో తన అధికారనివాసం నుంచి లోక్‌సభకు సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లే పార్లమెంటేరియన్‌ని ఎవరితో పోల్చుకోవాలి. ఇక్కడే కర్పూరీ ఠాకూర్‌ జీవితాన్ని చరిత్రవిస్మరించలేకపోయింది. ఆచరణతో కూడిన ఆదర్శవంతమైన రాజకీయాలు నడిపారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రజాస్వామీకరించారు. శత్రుపక్షం సైతం పార్టీలను పక్కన పెట్టి ఆయన్ను గౌరవించారు. 1988 ఫిబ్రవరి 17న అంతిమ శ్వాస విడిచారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో వారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా వారికి భారత ప్రభుత్వం భారత రత్న ఇవ్వడం దేశప్రజలందరూ సంబరాలు జరుపుకోవాలి.... జయ్ భీం... జయ్ జైశ్రీరాం... రాజశేఖర్ నన్నపనేని.

No comments