మనిషి మనుగడ కి శరీరమే ఆధారం - megaminds

megaminds
0
మనిషి మనుగడ కి శరీరమే ఆధారం. శరీరం లేకుండా మిగతా కంపోనెంట్స్ మనలేవు. కాబట్టి మన వారు శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం అని చెప్పారు అంటే ధర్మసాధనానిక్ శరీరమే ఆధారం. కాబట్టి మనిషిని గుర్తించడం శరీరమే ముఖ్య మైన అంశం.
ఈ శరీరానికి కొన్ని అవసరాలు, సుఖాలు ఉంటాయి. వాటిని తృప్తి పరచడం కూడా మనిషి పని చేయడానికి మూలంఅవుతుంది.
శరీరానికి తిండి కావాలి, నిద్ర కావాలి, దానికి
మైిధునం కూడా కావాలి. ఈ అవసరాల సంతృప్తి పరచడం కొరకు మనిషి పని చేస్తాడు. ఇవి తక్కువ ఆలోచనలు అనడం పొరపాటు. ఒక్కో సారి శరీరానికి కీర్తి కూడా ఉంటుంది. దారాసింగ్ దేహం, భీమా శరీరం, కోర మీసం, అందాల జుట్టు, ఆడవారి అందాలు అన్నీ కీర్తినిచ్చేటివి. వీటికి పోషణ కావాలి. ఇప్పటి భాషలో క్రీములు,పౌడర్లు,ఇంకా ఎన్నో ఇవన్నీ అవసరాలా? సౌకర్యాలా? లక్సరీ లా? వీటి విభజన నేను చేయను.
శరీరం లో ఉండే పంచ కర్మేంద్ర్యాలకి, పంచ జ్ఞానేంద్రియాలకీ కూడా తృప్తి కావాలి. కంటికి, చెవికి, ముక్కుకు, జిహ్వకి, చర్మానికి కూడా సుఖం, సంతృప్తి అవసరం వాటిని పొందడానికి మనిషి కష్టపడాలి. దీన్ని తక్కువ ఆలోచనలు అనడానికి లేదు.
కర్మేంద్రియాలకీ పని కావాలి. వ్యాయామం కావాలి, పోషణకు మర్ధనలు కావాలి. ఉపయుక్తంగా ఉంచుకోవడానికి సాధన కావాలి కదా ! ఇవన్నీ సాధారణ అవసరాలే.
అందం ఇనుమడిిమ్పచేసే అనేక ప్రక్రియలకు ఎంతో ఖర్చు చేయాలి. కేశాలంకరణ లాంటి ఒక్కో విభజన కూడా ఒక శాస్త్రమే.
వీటన్నింటిని శారీరక అవసరాలు అందాం.
వీటన్నింటి కోసం మనిషి పని చేయాల్సిందే.
అయితే మనిషి లో మరో ముఖ్యమైన అంశం మనస్సు. దాని గూర్చి రేపు తెల్సుకుందాం.
Share and comment. To be dicussed.
తల్లి భారతి సేవలో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top