మనిషి ఎందుకు పనిచేస్తాడు (మనసు)? - MegaMinds

శరీరం తో పాటు మనిషి కి మనసు ఉంటుంది. ఇది ఇక్కడ ఉంటుంది అని చెప్పడం కష్టం కాని ఇది మన ఆలోచనలను నియంత్రిస్తుంటుని. దీన్నే హృదయం అని కూడా అంటుంటారు. సైన్స్ వాళ్లకు హృదయం అనగానే రక్తం పంప్ చేసే మిషన్ అనిపిస్తుంది. ప్రేమను, ఆత్మీయతను పంచె మనిషి లోపలి భాగాన్ని మనసు అంటాము.
శరీరం నేను సూచిస్తే మనసు మనది సూచిస్తుంది. నా కుటుంబం, నా వూరు, మన దేశం ఇవన్నీ మనసు సబ్జెక్టు. ఐతే ఇందులో మంచీ చెడు రెండూ ఉంటాయి.ప్రేమ, వాత్సల్యం, స్నేహం అనే మంచి భావాలకు ఇది ఉత్పత్తి ప్రదేశం. దానితో పాటు కామం, క్రోధం, మొహం, మదం మాత్సర్యం, లోభం లాంటి అవగుణాలు కూడా అక్కడే అంకురించి మనిషిని దిగజార్చేవి. ఇక్కడ మనసుని మనం ధర్మం యొక్క ఆధీనం లో నడిస్తే మంచికి, లేకపోతే చెడుకు కారణం చేసేది కూడా ఇదే. అయితే ఇదీ సంతృప్తి చెందాలి. దానికోసం మనిషి కష్టపడతాడు. మనిషి అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలనే మానసిక సంకల్పం శరీరాన్ని కష్టపెట్టడానికి సంసిద్ధత కలిగిస్తుంది.
మరో ఉదాహరణ చెబుతాను. ఒకడు రెండు రోజులుగా భోజనం చేయలేదు. ఒకరింట్లో రుచికర వంటలతో వడ్డించి, కూర్చున్నాక, చూడు వెధవ తేరగా వచ్చిందని కూర్చున్నాడు అని పెట్టేవాడు అంటే, భోజనం చేయ కుండా లేచి పోతాడు. వాడి శరీర సుఖానికి భోజనం కావాలి. కాని వాడి మనసు బాధ పడితే శరీరాన్ని పక్కన పెట్టేస్తాడు. కాబట్టి మనసు సుఖం కోసం శారీరక సుఖం పక్కన పెట్టేయగలం.
మనసుకు నచ్చే సంగీతం, పఠనమ్, చిత లేఖనం, సినిమా, టీవీ చానెల్, ఇవన్నీ మనసును సంతోష పెట్టేవే. ఒకతల్లి తన పిల్లాడు ఎదగడం పై తీసుకునే జాగ్రతలు, ప్రయోజకుడయ్యాజ పడే సంతృప్తి ఇవన్నీ మానసిక ఆనందాలే. అందుకే ఆత్రేయగారు
మనసనేదే లేని నాడు మనిషి కేమిటి వెల? అంటారో పాట లో.వారు మనసు కవి.
మనసుని నియంత్రించడం చాలా కష్టం. ఆన్దుకే మనసు కోతి వంటిది అంటారు.గొప్ప మేధావి అయిన రావణాసురుడు నాశనం అయ్యింది ఈ మనసు కోరికను అదుపులో లేకనే. దుర్యోధనుడు నాశనం కావడానికి వాడు కారణం అయినట్లే, అతని మిత్రుడు కర్ణుడు ఈ మనసు కొరకే వాడి స్నేహితుడికి ద్రోహం చేసి వాడి నాశనానికి కారణం అయ్యాడు. కత్తి కి రెండు వైపులా పదును అన్నట్లు ఈ మనసు మంచీ చేయిించగలుగుతుంది. చెడూ చేయించ గలుగుతుంది
కాబట్టి మనిషిని పని చేయించేది శారీరక సుఖం తో పాటు మానసిక సుఖం కూడా.
మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి. చర్చించండి. చర్చిస్తేనే మనకు మిగులుతుంది.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments