Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

జాతి కి ఒకే వారసత్వం 2. - megaminds

ప్రపంచం లో మనం చాలా బల సంపన్నులం. సంపద లో అన్ని దేశాల కన్నా భాగ్యవంతులం. విద్యా వంతులం. దేశమ్ విశ్వ గురువుగా ఉండేది. మంచి విశ్వ విద్యాలయాల...

ప్రపంచం లో మనం చాలా బల సంపన్నులం. సంపద లో అన్ని దేశాల కన్నా భాగ్యవంతులం. విద్యా వంతులం. దేశమ్ విశ్వ గురువుగా ఉండేది. మంచి విశ్వ విద్యాలయాలు ఉండేవి. అన్ని తూర్పు దేశాలకూ మనవాళ్ళు సంస్కృతి ప్రచారానికి వెళ్లారు. సస్య శ్యామల దేశం. ధన సమృద్ధం గా ఉండేది. పళ్ళున్న చెట్టు కె రాళ్ళు పడతాయి అంటారు. అలాగే ఈ దేశంపై జరిగినన్ని దండయాత్రలు ఏ దేశంపై జరుగలేదు.
ఈ నిరంతర దాడులతో, మరియు మనలో ప్రవేశించిన కొన్ని లోపాల కారణంగా ఒక్కోసారి ఓడి పోయి పరాక్రాంతులం అయ్యాము. అయితే వెంటనే స్వతంత్ర సాధనకు యుద్ధాలు, ఉద్యమాలు జరుగుతుందేవి. వెంటనే స్వతంత్రం పొందేవారం. మన లో లోపాలతో బాధ పడే సమయం లో పశ్చిమాసియా దండయాత్రలు మొదలయ్యాయి. దోపిడీ మూకలుగా వచ్చిన గజినీ దోచుకొని వెళ్లి పోయాడు. ఘోరి 16 సార్లు ఓడిపోయి, క్షమాభిక్ష పొంది 17 వ సారి మన రాజు అయిన జయ చంద్రుడు సహాయం తో పృథ్వీ రాజ్ ను ఓడించి, సంహరించాడు.
పర్వత ప్రాంతాలతో, ఏడారులతో నిండి ఉండే వాళ్ళ దేశం కంటే ఇక్కడి సస్య శ్యామల దేశం లో ఉండి పోవడం ప్రారంభించారు. మిడుతాల దండులా ఒకరి తరువాత ఒకరు లొడీలు, ఖిల్జీ లు, పఠానులు, మొఘలులు, నవాబులు, తానేషాలు ఇలా అనేక మంది రాజులు కొద్ది కొద్దిగా దేశం లో చాల భూభాగం ఆక్రమించారు. 800 సంవత్సరాలు వీరి పోరు మనం పడ్డాము. ఇక్కడి దేవాలయాల ధ్వంసం చేశారు. అనేక కష్టాలకు గురి చేసి ఇక్కడి వారి మతం మార్చారు. వీటన్నిటికి సాక్ష్యాలు చరిత్రలో దొరుకుతాయి.
వీరికి వ్యతిరేకంగా అనేకమంది మన రాజులు కొట్లాడుతూనే ఉన్నారు. మనలో అనైక్యతను వాడుకుని విదేశస్థులు రాజ్యం చేశారు. శివాజీ ప్రారంభించిన హిందూ పద పాదుషాహి తరువాత పీష్వాలు కొనసాగించి పశ్చిమోత్తర భారతం అంతా జయించారు.
ఈ సమయంలో యూరోప్ నుండి ఇంగ్లిష్ వారు, ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీసు వాళ్ళు కూడా ఈ దేశం లో రాజ్యాలు తేర్పాటు చేసుకున్నారు. యుద్ధం మరో200 సంవత్సరాలు పెరిగింది.
ఇది చరిత్ర. ఇందులో మన వారు అనడం లో విభేదాలు లేవు. పశ్చిమాసియా వారిని మనం పర దేశస్థులు, మనకు శత్రువులు గానే భావన సాగింది. బొబ్బిలి యుద్ధం లో బుస్సీ దొర అని ఫ్రెంచ్ వాళ్ళను వేరు చేసి కూడా చూసాము. కాని చరిత్ర ను, మన వార సత్వ జీవన దారను ఛిద్రం చేసే కుయుక్తి బ్రిటిష్ వాళ్ళు పన్నారు.
మన దేశం లో మత రాజ్యాలు ఎప్పుడూ లేవు. బీజాపూర్ నవాబును, ఔరంగజేబు ఓడించడానికి ప్రయత్నం లో శివాజీకి దగ్గరయ్యాడు. తరువాత శివాజీ ఔరంగజేబు తో కూడా కొట్లాడాడు. యుద్ధాలు రాజా వంశాల మధ్యే జరిగాయి తప్ప మత రాజ్యాలుగా జరుగలేదు. గోల్కొండ తానీషాను ఔరంగజేబు సేనలు ఓడించాయి. అక్కడ మసీదు ధ్వంసం చేసి దాని క్రింద దాచుకున్న్ ధన సంపదను దోచుకు వెళ్ళాడు. ఇవన్నీ చారిత్రిక సత్యాలు. నిజాములకు, మొఘలులకు సంబంధం లేదు.
అయితే ఇంగ్లీష్ వారిపై ఇక్కడి హిందువులు, ముస్లిములు గా మారిన హిందువులూ కలిసి పోరాడారు. 1857 సంవత్సరం జరిగిన సంగ్రామం లో బ్రిటిష్ వాళ్ళు చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా శాంతిమ్ప చేశారు.
బ్రిటీష్ వారు ఈ జాతిని ముక్కలు చేయడానికి కంకణం కట్టుకొని మన చరిత్ర వక్రీకరణ ప్రారంభం చేశారు. ఈ కుయుక్తులన్నీ మళ్ళీ చర్చిద్దాం. అయితే మన చరిత్ర లో వాళ్ళు పురాతన భారత చరిత్ర, మహమ్మదీయ డైనస్టీ, బ్రిటిష్ డైనాస్టీ
అని మూడు భాగాలు చేసి మధ్యలో ఒక మతానికి, రాజ్యానికి జోడించారు. ఆ తరువాతి యూరోప్ దాడిని క్రైస్తవ రాజ్యం అనలేదు. దాన్ని బ్రిటిష్ రాజ్యం అన్నారు. తరువాత ఈ ముస్లింలు గా మారిన జాతీయులు వారి సంబంధం విదేశాలనుండి వచ్చిన పశ్చిమ ఆసియా నుండి వచ్చిన వారితో కలిపి, స్థానిక హిందువల నుండి వేరు చేశారు. వేరు చేయడం లో జిన్నాను వాళ్ళు వాడుకున్నారు.
... .ఇంకా ఉంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments