చైనా గత కొన్నేళ్లుగా టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్రపై భారీ ప్రాజెక్టులు ప్రారంభించింది. వాటి వెనుక వ్యూహం ఏమిటంటే, జలవనరుల నియంత్రణ ద్వారా భారత్‌పై ఒత్తిడి. కానీ భారత్ ఎప్పటిలాగే “తగ్గేదేలే” అని తన జవాబు ఇచ్చింది. 17,000 కోట్ల గ్లోబల్ బిడ్‌తో ముందుకు సాగుతున్న ఈ ప్రపంచంలోనే ఎత్తైన దిబాంగ్ డ్యామ్, దేశానికి ఒక కొత్త శక్తి కేంద్రం.
చైనాకి గట్టి సమాధానం: భారత్ ఎప్పుడూ శాంతికి కట్టుబడి ఉంటుంది. కానీ ఎవరైనా మన సరిహద్దుల్లో సవాలు విసిరితే, సమాధానం ఇవ్వడంలో వెనుకడుగు వేయదు. చైనా బ్రహ్మపుత్రపై డ్యామ్‌లు కడితే, భారత్ కూడా తలవంచకుండా సమాధానం ఇస్తోంది. దిబాంగ్ ఆనకట్ట ద్వారా భారత్ చెబుతున్న సందేశం సూటిగా ఉంది “నీటి వనరులు మన హక్కు, మన శక్తి. ఎవరూ మన భవిష్యత్తు తో ఆడుకోలేరు.”
ఆర్థిక – వ్యూహాత్మక శక్తి , దిబాంగ్ ఆనకట్ట వల్ల కలిగే లాభాలు ఎన్నో:
విద్యుత్ ఉత్పత్తి: ఈశాన్య రాష్ట్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా. పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, స్థానికులకు లాభం.
ఉపాధి అవకాశాలు: నిర్మాణ దశలో వేలమందికి ఉద్యోగాలు. స్థానిక వ్యాపారాలకు కొత్త జీవం.
వ్యూహాత్మక రక్షణ: చైనా ఏ ఆటలాడినా, భారత్ సిద్ధంగా ఉందని ఈ ప్రాజెక్ట్ చెబుతోంది.
ప్రాంతీయ అభివృద్ధి: రోడ్లు, విద్యుత్, నీటి వసతులు, గ్రామీణ మౌలిక వసతులు వేగంగా పెరుగుతాయి.
జల రక్షణ కవచం – ప్రజల రక్షణ: అరుణాచల్ ప్రదేశ్‌లో మాన్సూన్ కాలంలో వరదలు ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతాయి. ఈ డ్యామ్ ఆ వరదలను నియంత్రించి, ప్రజల ప్రాణాలు ఆస్తులు కాపాడుతుంది. నీటి నిల్వ వల్ల కరువు కాలంలో కూడా సాగుకు నీరు అందుతుంది. అంటే, ఇది కేవలం రక్షణ కవచం మాత్రమే కాదు, రైతుల భరోసా, ప్రజల కాపాడే ఆశ్రయం.
పర్యావరణం – సమతుల్యం: పెద్ద ప్రాజెక్టులంటే చాలామందికి పర్యావరణ ఆందోళనలు ఉంటాయి. కానీ ఈ ప్రాజెక్ట్‌లో ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. అడవులను కాపాడుతూ, స్థానిక జనజీవితాన్ని ప్రభావితం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రకృతి అభివృద్ధి రెండూ కలసి ముందుకు వెళ్లేలా చర్యలు కొనసాగుతున్నాయి.
దిబాంగ్ ఆనకట్ట కేవలం ఒక నిర్మాణం కాదు. ఇది భారతీయ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ఇది ప్రపంచానికి ఒక సంకేతం భారత్ వెనుకడుగు వేయదు, తన సరిహద్దులను, వనరులను, భవిష్యత్తును కాపాడుకుంటుంది. దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే, భారత్ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని ప్రపంచం మరోసారి తెలుసుకుంది.
ప్రజల భావోద్వేగం: ఈశాన్య ప్రజల దృష్టిలో ఈ ప్రాజెక్ట్ ఒక ఆశ కిరణం. ఉపాధి, అభివృద్ధి, విద్యుత్ ఈ మూడు వల్ల వారు కొత్త జీవితం పొందుతారు. స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయి, చిన్న వ్యాపారాలు పెరుగుతాయి, గ్రామాలు వెలుగుతాయి. ఇది కేవలం సరిహద్దు రక్షణే కాదు ప్రజల భవిష్యత్తు నిర్మాణం కూడా.
ఇదంతా ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది భారత్ తగ్గేదేలే. దేశ భద్రత, ప్రజల భవిష్యత్తు, జలవనరుల రక్షణ కోసం ఏ సవాలునైనా స్వీకరించడానికి సిద్ధం. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రారంభమైన దిబాంగ్ ఆనకట్ట నిర్మాణం భారత్‌కు గర్వకారణం. ఇది చైనాకు సమాధానం, ప్రజలకు రక్షణ, ఆర్థికాభివృద్ధికి ఇంధనం. భవిష్యత్ తరాలకు దిబాంగ్ ఒక బలమైన భరోసా. -రాజశేఖర్ నన్నపనేని. MegaMinds.