నిన్న రాత్రి మనలో చాలామంది “పాక్ మ్యాచ్ బహిష్కరణ”లో మునిగిపోతే… అదే సమయంలో దేశ భద్రతా ఏజెన్సీలు నిశ్శబ్ద యుద్ధాన్ని చేసాయి. దేశంలో అల్లకల్లోలం సృష్టించి, దేశాన్ని అస్థిరపరచాలని కుట్రలు చేస్తున్న రహస్య రాడికల్ మాడ్యూల్స్, స్లీపర్ సెల్ కుట్రలను విజయవంతంగా చేదించిన భారత సెక్యూరిటి ఏజెన్సీలు. ఆ కుట్రలు గురించి తెలుసుకుందాం..
ఆపరేషన్ 1 - లోన్ వుల్ఫ్ వెబ్: RAW గుర్తించిన వివరాల ప్రకారం, 18–25 ఏళ్ల యువతను మతం పేరిట మోసం చేసి, ఆత్మాహుతి దాడుల కోసం సిద్ధం చేస్తున్నారు. సిగ్నల్ లాంటి యాప్‌ల ద్వారా వారితో రహస్యంగా సంప్రదింపులు జరిగాయి. వీరిలో కొందరు మేవాట్‌లో ఆయుధాలతో పట్టుబడగా, మరికొందరు ముంబై వెళ్తుండగా న్యూఢిల్లీలోనే అరెస్టులు చేశారు. అతి భయంకర ఈ నెట్వర్క్ లో రాంచీకి చెందిన డానిష్ అనే వ్యక్తి నకిలీ IDలు తయారు చేయడం, ఆత్మాహుతి జాకెట్లు తయారు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.
ఆపరేషన్ 2 - PFI దేశవ్యాప్త కుట్ర: కొన్ని పరిశోధనాత్మక రిపోర్టుల ప్రకారం, ఈ ఉగ్రకుట్ర ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా దీపావళి, దసరాకి దేశవ్యాప్తంగ ఉగ్రవాద కుట్రలు చెయ్యాలని ఈ నెట్వర్క్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. బోకారో, తెలంగాణ, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో PFI నెట్‌వర్క్ ఇంకా బలంగానే పని చేస్తుంది. పండుగల సమయంలో ఒకేసారి దాడులు చేసి దేశంలో భారీ ఎత్తున విధ్వంసం చెయ్యాలని వీళ్ళు పధకం రచించినట్లు తెలుస్తుంది.
ఆపరేషన్ 3 - 2047 బ్లూప్రింట్: కిషన్‌గంజ్‌కి చెందిన మదర్సా ఉపాధ్యాయుడు మహబూబ్ ఆలంను NIA అరెస్ట్ చేసింది. అతను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ లక్ష్యం 2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చడం. PFI నిషేధం తర్వాత కూడా ఈ అజెండా ఇతర గ్రూపుల ద్వారా ముందుకు సాగుతోందని అతను ఏజెన్సీలకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇది కేవలం కొద్దిమంది ఉగ్రవాద సంస్థలతోనే ఆగిపోలేదు. ఆ ఆలోచనను నమ్మి మద్దతు ఇస్తున్న వాళ్లు వేలల్లో ఉన్నారు. వాళ్లను పట్టించుకోకుండా వదిలేస్తే, ఈ పరిణామాలు వినాశనానికి దారి తియొచ్చు అని చరిత్ర చెబుతున్నది. ఇలాంటివి మొదట చిన్న చిచ్చులా మొదలై, తర్వాత పెద్ద అగ్నిలా వ్యాపిస్తాయి. అందుకే యావత్ సమాజం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి.
ఇదేదో సాధారణ రాజకీయ విషయం కాదు: మన కుటుంబాలు, మన ఇళ్లు, మన సంస్కృతి వచ్చే 20 ఏళ్లలో సురక్షితంగా ఉంటాయా అనేది అసలు ప్రశ్న. దానికి ఒకటే సమాధానం రాజకీయాల్లో స్పష్టత కావాలి. కొన్ని వర్గాలను ఓటు బ్యాంకుగా చూడడం మాని బుజ్జగింపులు అపెయ్యాలి. ఎవరు పాలనలోకి వచ్చినా దేశ భద్రత, మన సంస్కృతి రక్షణనే ప్రధానంగా చూసేలా మనం నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. జయ్ హింద్ - జయ్ భారత్. -కరుణాకర్ బుదురు. రాజకీయ, సామాజిక విశ్లేషణలు.